Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 26 Aug 2020 12:26 PM GMT

    Warangal: కరోనా అంబులెన్స్ లను ప్రారంభించిన TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

    - ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద 10 నియోజకవర్గాల కరోనా అంబులెన్స్ లను ప్రారంభించిన TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటీఆర్

    - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఇతర ఎమ్మెల్యేలు హాజరు

    - సకాలంలో అంబులెన్స్ లను తయారు చేయించిన మంత్రి ఎర్రబెల్లి ని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి కేటీఆర్

    - అంబులెన్స్ లను ఇచ్చిన దాతలను అభినందించిన మంత్రులు కేటీఆర్,ఎర్రబెల్లి

    - పాలకుర్తి కి 2 ,వర్ధన్నపేట కి 2, ములుగు 1,భూపాలపల్లి 1,పరకాల 1, వరంగల్ పశ్చిమ 1,వరంగల్ తూర్పు 1,జనగామ 1 లను ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ కి తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

  • 26 Aug 2020 12:25 PM GMT

    ములుగు జిల్లా.

    - తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారాలమ్మ లను దర్శించుకున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క.

    - మేడారం జంపన్నవాగు వరదకి కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించారు.

  • 26 Aug 2020 12:24 PM GMT

    Hyderabad: రెండవ రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

    - రెండవ రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

    - నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుండి చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ అధికారులు..

    - అంజిరెడ్డి, శ్రీనాథ్ లకు సంబంధించి అనేక విషయాలి సేకరించిన ఏసీబీ..

    - 1కోటి 10 లక్షల రూపాయల పై డబ్బు ఎవ్వరిది అణా దానిపై పూర్తి వివరాలు రాబట్టిన ఏసీబీ...

    - ఆంజిరెడ్డి ఇంట్లో దొరికొన డాక్యుమెంట్ల పై వివరాల అడిగిన ఏసీబీ..

    - ఆంజిరెడ్డి చేసిన భూ లావాదేవీలకు ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల పై ఆరా తీసిన ఏసీబీ...

    - లాకర్ల పై స్పష్టత ఇవ్వని నాగరాజు..

    - చంచల్ గూడ జైలు కు తరలించిన ఏసీబీ..

    - రేపు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించనున్న ఏసీబీ.

  • 26 Aug 2020 12:22 PM GMT

    జాతీయం

    - కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్‌ .

    - కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ కు హాజరయిన ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేష్‌ బాగేల్‌, హేమంత్‌ సోరేన్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రేలు .

    - నీట్ పరీక్షవాయిదా అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ పాలిత సీఎంలు నిర్ణయం.

    - ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన .

    - రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ ఆరోపణ. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదన్న సోనియాగాంధీ.

    - రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టిన సోనియా

    - కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శ.

    - పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం.

    - నీట్‌ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయన్న రాహుల్‌ గాంధీ

    - దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్‌ పరీక్ష నిర్వహించడం సరికాదనన్న రాహుల్‌ గాంధీ.

    - అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

  • 26 Aug 2020 12:22 PM GMT

    ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రికి ఇరవై కోట్లు విడుదల చేస్తూ అర్థిక శాఖ నుండి ఉత్తర్వులు జారీ

    - నిదుల విడుదల పై హర్ష్యం వ్యక్తం చేసిన. ఎమ్మెల్యే జోగురామన్న

  • 26 Aug 2020 12:21 PM GMT

    జగిత్యాల జిల్లా:

    - మెటుపల్లి ఖాదీ బోర్డ్ చైర్మన్,కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ K.V రాజేశ్వర్ రావు హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి.

  • 26 Aug 2020 12:06 PM GMT

    Nizamabad: ఆర్మూర్ మండలం గోవింద్ పేట ఘటన పై స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి.

    నిజామాబాద్ :

    - ఆర్మూర్ మండలం గోవింద్ పేట ఘటన పై స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి.

    - అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ లకు కలెక్టర్ ఆదేశం.

    - కోవిడ్ తో మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి.

    - రెవెన్యూ డివిజన్ లో ఆర్డీఓ లు మున్సిపాలిటీ లో కమిషనర్ తో కమిటీల ఏర్పాటు.

    - నిన్న కోవిడ్ లక్షణాలు తో వృద్ధురాలు మృతి, అంత్యక్రియలకు ముందుకు రాని బంధువులు

    - జేసిబి సహాయం అంత్యక్రియలు చేసిన డ్రైవర్.

  • 26 Aug 2020 12:05 PM GMT

    Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 92.40 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 1.848 టీఎంసీ

    - ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,30,500 క్యూసెక్కులు

  • 26 Aug 2020 12:05 PM GMT

    సంగారెడ్డి జిల్లా..

    - జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు.

  • 26 Aug 2020 12:04 PM GMT

    Telangana: తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేరుతున్నాయి: గొంగిడి సునీత

    - గొంగిడి సునీత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్

    - తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేరుతున్నాయి.

    - రైతే రాజు అన్న కేసీఆర్ ఆకాంక్ష నిజం అవుతుంది.

    - భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దాన్యాగారంగా మారింది.

    - గతంలో నల్గొండ జిల్లా ఎడారి అవుతుందన్న నిపుణులే ఇవ్వాళ దాన్యాగారంగా మారిందని అంటున్నారు.

    - నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఉన్నా--జిల్లాకు అప్పటి నాయకులు నీళ్లు ఇవ్వలేదు.

    - ఉమ్మడి నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తా అన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు.

    - గోదావరి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తరలించిన ఘనత కేసీఆర్ ది.

    - పేదరికంలో మగ్గిపోతున్న నల్గొండ జిల్లా రైతాంగం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.

    - జిల్లాలో రైతులకు పావలా ఋణానికి 120కోట్లు ప్రభుత్వం ఇప్పించింది.

    - నల్గొండ జిల్లాను స్వర్ణయుగంగా మార్చిన ఘనత కేసీఆర్ ది.

    - నియంత్రిత సాగులో కేసీఆర్ చెప్పినట్లు నల్గొండ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

    - రాజోలు బండ దగ్గర తూములు పగలగొట్టి నీళ్లు తీసుకుపోయిన విషయం అందరికి తెలుసు.

    - తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుకట్ట వేస్తోంది.

    - సీఎల్పీ నేత చేపట్టిన హాస్పిటల్ పర్యటన రాజకీయ పర్యటన మాత్రమే

    - శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ లో జరిగింది అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమే.

    - మళ్ళీ ఇలాంటి ఘటనలు జగగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Print Article
Next Story
More Stories