Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sept 2020 7:13 AM IST
Durgam Cheruvu Cable Bridge: నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్
- 184కోట్లతో ఆసియా లోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం
- కేబుల్ బ్రిడ్జి తో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ను కలుపుతూ నిర్మించిన ఫ్లై ఓవర్ ను కూడా ప్రారంభించనున్న కేటీఆర్
- జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్ కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్ వే గా నామకరణం
- 25 Sept 2020 7:10 AM IST
SPB Health Update: విషమంగానే ఎస్.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి
చెన్నై:
- చెన్నై ఎం.జి.ఎం ఆసుపత్రిలో ఎక్మో, వెంటిలేటర్ పై కొనసాగుతున్న వైద్యం
- గత 24 గంటల్లో మరింతగా క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం
- గత నెల 5 తేదీన చెన్నై ఎం.జి. ఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులెటిన్ కోసం ఎదురుచూపులు
- కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత 5రోజులకు విషమించిన బాలు ఆరోగ్యం
- 25 Sept 2020 7:08 AM IST
Rajendernagar Updates: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓపియం నల్లమందు అమ్ముతున్నారని సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు..
రాజేంద్ర నగర్
- రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ దర్గా చౌరస్తా వద్ద రాజస్థాన్ నుంచి వచ్చే ఓపియం నల్లమందు DRUGS అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారంతోశంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు..
- రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి హిమాయత్ సాగర్ లో దర్గా లో అమ్ముతున్న కైలావత్ షేకవత్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు ఇతని వద్ద నుంచి అరకెజి నల్లమందు స్వాధీనం..
- నల్లమందు విలువ ఏడున్నర లక్షలు ఉంటుందని అంచనా వేసిన ఎస్వోటీ SOT పోలీసులు.
- రాజేంద్రనగర్ పోలీసులకు అప్పజెప్పారు





