Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sept 2020 7:20 AM IST
Anantapur Updates: అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు ఉత్తమ జాతీయ సేవ పథకం అవార్డులు.
అనంతపురం:
- వర్చువల్ విధానంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ద్వారా అవార్డులు అందుకున్న ప్రతిభావంతులు
- జె ఎన్ టి యూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నవీన్ కుమార్, ఎస్కేయూ కళాశాల బీఫార్మసీ విద్యార్థి భరత్, ఎస్ ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చిన్న పుల్లయ్య కు అవార్డులు ప్రధానం
- 25 Sept 2020 7:19 AM IST
Anantapur Updates: పి.టి.సి పరేడ్ మైదానంలో SCT ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం.
అనంతపురం:
- హాజరైన హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్.
- శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ఎస్ఐలు.





