Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Aug 2020 7:52 AM IST
Nizamabad breaking news
నిజామాబాద్ :
- డిచ్ పల్లి లో శివారులో రెండు కార్లు , ఓ బైక్ కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు.
- భూ వివాదం కారణం అంటున్న గ్రామస్థులు.
- గ్రామ పెద్ద కారు తో పాటు వెంచర్ నిర్వాహకుని కారుకు నిప్పు.
- పూర్తిగా దగ్ధం అయిన కార్లు
- నిందితులని కోసం గాలింపు.
- 25 Aug 2020 7:49 AM IST
వర్షం తగ్గడంతో ఊపిరి తీసుకున్న ఓరుగల్లు.
వరంగల్:
- గత 15 రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కారణంగా అతలాకుతలంఐన ఉమ్మడి వరంగల్ జిల్లా.
- వరద ప్రవాహం తగ్గడంతో ములుగు-ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ప్రారంభమైన రాకపోకలు.
- చాలివాగు తగ్గడంతో వరంగల్ - భూపాలపల్లి ,కాళేశ్వరం ప్రధాన రహదారిపై ప్రారంభమైన రాకపోకలు.
- నిండుకుండలా రామప్ప, పాకాల, లక్నవరం జలాశయాలు....
- వర్షం తగ్గినా ఇంకా మత్తళ్ళు పోస్తున్న 3 సరస్సులు.
- ఇంకా ప్రమాదకర స్థాయిలోనే జలాశయాలు, జలపాతాలు...
- అప్పుడే పర్యాటకులను రావద్దని అధికారుల విజ్ఞప్తి.
- ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద శాంతించిన గోదావరి...... వరద ప్రవాహం తగ్గడంతో 7 అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి నీటిమట్టం.




