Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Aug 2020 9:59 AM IST
Kadapa: కడప జిల్లాలొ విషాదం...
కడప :
- కడప జిల్లాలొ విషాదం...
- కరోనా పాజిటీవ్ వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి రైలు కింద పడి అత్మహత్య...
- ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఘటన ...
- తన చావుకు ఎవరు కారణం కాదు...కరొనా వచ్చిందనే ఆత్మహత్య చేసుకుంటున్నాను...
- కుటుంబ సభ్యులు మన్నించాలంటూ వేసుకున్న బనియన్ పై రాసుకుని అత్మహత్య
- ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న గంగిరెడ్డి...తన పత్రాలను అదికారులు పరిశీలించాలంటూ నేలపై రాసిన గంగిరెడ్డి
- 25 Aug 2020 9:59 AM IST
Narsipatnam: కారులో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువైన 100 కిలోల గంజాయి పట్టివేత
తూర్పుగోదావరి
- నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం వైపు కారులో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువైన 100 కిలోల గంజాయి పట్టివేత
- ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న రాజవొమ్మింగి పోలీసులు
- మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు
- 25 Aug 2020 9:58 AM IST
కర్నూలు జిలా
- ఇటీవల తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదం తో మేల్కొన్న ఏపీ ప్రభుత్వం
- ఈరోజు ఉదయం 11 గంటలకు కు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సేఫ్టీ కమిటీ సభ్యులతో పరిశీలించనున్న జెన్కో హైడల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు
- కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం భద్రత స్థితి గతులను పరిశీలించి నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న కమిటీ సభ్యులు
- సమర్పించిన నివేదిక ఆధారంగా భద్రతా ప్రమాణాలను మరింతగా పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడి
- 25 Aug 2020 9:57 AM IST
shankavaram: శంఖవరం మం కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్
తూర్పుగోదావరి
- శంఖవరం మం కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్ తీసి పరీక్షలు చేయకుండానే 12 మందికి పాజిటివ్
- పరీక్షలు చేయకుండానే వైరస్ సోకినట్లు నివేదిక ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం
- ఈనెల 20న ఆసుపత్రి సిబ్బందితో పాటు పలు ప్రాంతాలకు చెందిన 50 మందికి పరీక్షలు చేశారు
- తాజా ఫలితాలలో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు.
- పాజిటివ్‌గా నిర్ధారణలో 37 మందిలో 12 మంది అసలు పరీక్షకే హాజరుకాలేదు
- అయితే శాంపిల్స్ ఇవ్వకుండా తమపేర్లు పాజిటివ్‌గా ఎలా వచ్చాయని వారు ఆందోళన చెందుతున్నారు
- ఆన్‌లైన్, ల్యాబ్‌లో సాంకేతిక లోపం కారణంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రావికంపాడు వైద్యులు చెబుతున్నారు.
వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు
- 25 Aug 2020 8:01 AM IST
Swarna Palace issue updates: స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ సాయం
విజయవాడ
- స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు నేడు ప్రభుత్వ సహాయం
- మరణించిన వారి కుటుంబాలకు 50లక్షల చొప్పున చెక్కులు
- మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ,పౌర సరఫరా ల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని)లు అందజేస్తారు
- 25 Aug 2020 7:43 AM IST
RTC services update: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన
విజయవాడ
- తెలంగాణకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజూ 2.65 లక్షల కి.మీ. బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు
- టీఎస్‌ఆర్టీసీ ఏపీకి 1.16 లక్షల కి.మీ. బస్సు సర్వీసులు నడుపుతోంది
- ఏపీఎస్‌ఆర్టీసీ కూడా లక్ష కిలోమీటర్లు తగ్గించాలని సూచించింది టీఎస్ఆర్టీసీ
- సెప్టెంబరు 1 నుంచీ అంతర్రాష్ట్ర రవాణా ప్రారంభించాలని సూచించిన కేంద్రం
- ఈ నెలాఖరులోగా ఏపీ, టీఎస్ ల మధ్య చర్చలు ఫలించే అవకాశం
- 25 Aug 2020 7:41 AM IST
అమరావతి
ఉదయం 11 గంటలకి క్యాంపు కార్యాలయంలో 13జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
- 25 Aug 2020 7:40 AM IST
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
కర్నూలు జిల్లా...
- శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద... అన్ని క్రస్ట్ గేట్లు మూసివేసిన అధికారులు
- ఇన్ ఫ్లో : 1,24,047 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 30,986 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
- ప్రస్తుత : 884.20 అడుగులు
- నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 210.9946 టీఎంసీలు
కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 25 Aug 2020 7:39 AM IST
ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు
అమరావతి
- ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించిన ప్రభుత్వం
- 25 కిలోల రైస్ తో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని ఉత్తర్వులు జారీ
- వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కార్



