అంతర్ రాష్ట్ర బస్సులు నడిచేనా

అంతర్ రాష్ట్ర బస్సులు నడిచేనా
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

Inter State Bus Services : కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Inter State Bus Services : కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సమయంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకలను ప్రభుత్వాలు నిలిపివేసాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ఎక్కడికక్కడ స్థంబించి పోయాయి. లాక్ డౌన్ సడలింపులిచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను పునరుద్దరించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఆర్టీసీ కీలక అధికారులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునరుద్ధరించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారులతో ఏపీ అధికారులు అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభించాలనే అంశంపై రెండుసార్లు సమావేశమైనా తెలంగాణ అధికారులు ఈ విషయంపై సానుకూల నిర్ణయం మాత్రం రాలేదు.

సరిగ్గా ఈ సమయంలోనే రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు ఎత్తేయాలని స్పష్టం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ మధ్య సమాన సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడిపేలా ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు సూచించినట్టు వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories