Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 24 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి: రా.11-44 తదుపరి నవమి | మూల నక్షత్రం రా.11-36 తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.8-11 నుంచి 9-43 వరకు తిరిగి రా.10-04 నుంచి 11-36 వరకు | అమృత ఘడియలు: సా.5-26 నుంచి 6-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ.2-41 నుంచి 3-29 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-54

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 24 Sep 2020 2:54 PM GMT

    Hyderabad: రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

    - నగరంలో 25% సర్వీసులను నడపనున్న ఆర్టీసీ, కర్ణాటక, మహారాష్ట్ర కు కూడా....

    - సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నగరంలో సిటీ బస్సులను ప్రారంభించనున్న ఆర్టీసీ...

    - రేపటి నుంచి హైదరాబాద్ సిటీలో 25% బస్సులతో తొలుత సిటీ సర్వీసులను నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    - ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికే అధికారులతో మాట్లాడారు.

    - ఎక్కడెక్కడ, ఏ ఏ రూట్లలో నడపాల అనే దానిపై మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు.

    - రేపటి నుండే 25% బస్సులు రోడ్డు ఎక్కనున్నాయని, అందుకు సిటీలోని అన్ని డిపోలను అప్రమత్తం చేశామని వెల్లడించారు.

    - హైదరాబాద్ సిటీలో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం రేపటి నుండి బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.

    - సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో ప్రయాణికుల సౌకర్యార్థం కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటు బస్సులను నడపనున్నట్లు స్పష్టం చేశారు.

  • 24 Sep 2020 2:52 PM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా

    - కోడేరు మండలం రేకులపల్లి తాండ పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి సస్పెన్షన్ చేసిన -జిల్లా కలెక్టర్ శర్మన్

  • Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ..
    24 Sep 2020 12:47 PM GMT

    Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ..

    ప్రగతి భవన్..

    -ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ .

    -భేటీలో పాల్గొన్న రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్.

    -గ్రేటర్ హైదరాబాద్ లో rtc బస్సులను ఎంత శాతం నడిపించాలి, ఎప్పటి నుండి అనుమతి నివ్వాలనే అంశం చర్చ.

  • Telangana Education Department: ఇంటర్ సిలబస్ తగ్గింపు విషయంలో వెనకడుగు వేసిన తెలంగాణ విద్యా శాఖ..
    24 Sep 2020 12:40 PM GMT

    Telangana Education Department: ఇంటర్ సిలబస్ తగ్గింపు విషయంలో వెనకడుగు వేసిన తెలంగాణ విద్యా శాఖ..

    తెలంగాణ విద్యా శాఖ..

    -ఇంటర్ సిలబస్ తగ్గింపు విషయంలో వెనకడుగు వేసిన తెలంగాణ విద్యా శాఖ

    -ప్రముఖుల జీవిత చరిత్ర లకు సంబంధించిన పాఠాలను సిలబస్ నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

    -ఇంటర్ బోర్డు కు ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్

  • 24 Sep 2020 12:32 PM GMT

    KTR Teleconference: అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి: కేటీఆర్!

    టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్..

    #ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్

    # ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి

    #పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్

    # పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది

    #రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయి

    # ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేశాం

    # ప్రైవేట్ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించాము

    # గతంలో ఎన్నడూ లేనివిధంగా అపూర్వమైన పాలన సంస్కరణలు చేపట్టాము

    #60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశాము 

    # రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలే దివాలా తీశాయి

  • 24 Sep 2020 12:19 PM GMT

    GHMC Elections: బ్యాలట్ పద్ధతి లోనే ghmc ఎన్నికలు: తెలంగాణ రాష్ట్ర సమితి!

    GHMC ఎన్నికలు..

    --బ్యాలట్ పద్ధతి లోనే ghmc ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తన అభిప్రాయాన్ని తెలిపిన తెలంగాణ రాష్ట్ర సమితి .

    -రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసిన తర్వాత మీడియా తో టిఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం .శ్రీనివాస్ రెడ్డి(ఎమ్మెల్సీ ),సోమ భరత్ కుమార్

    -జిహెచ్ ఎంసీ ఎన్నికల నిర్వహణ ఏ పద్ధతి లో ఉండాలనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అభిప్రాయం కోరింది

    -మా అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేశాం

    -మా పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి అని లేఖ ఇచ్చాం

    -కరోనా సమయంలో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బంది అనుకుంటే... ఈవీఎం ల వల్ల కూడా ఇబ్బంది ఉంటుందని తెలిపాం

    -ఈవీఎం లతో పోలిస్తే బ్యాలెట్ పద్ధతే ఈ సమయం లో ఉత్తమమని trs భావిస్తోంది .దీన్నే తెలియ జేశాం.

  • 24 Sep 2020 12:06 PM GMT

    Malkajgiri ACP Case: మల్కాజిగిరి ఏసీపీ కేసులో రెండు చోట్ల కొనసాగుతున్న విచారణ...

    మల్కాజిగిరి ఏసీపీ కేసు..

    -నాంపల్లి హైదరాబాద్ రెంజ్ ఏసీబీ అధికారుల విచారణ, ప్రధాన కార్యాలయంలో మరో టీం విచారణ.

    -Ghmc సిబ్బందిని బంజారహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించిన ఏసీబీ..

    -Ghmc పరిధిలో భూముల వ్యవహారం లో పలు విషయాల పై ఏసీబీ వద్దకు వచ్చిన ghmc సిబ్బంది.

    -రెండు వాహనాల్లో పలు డాక్యుమెంట్ స్ తో ఏసీబీ హెడ్ ఆఫీస్ కు వచ్చిన సిబ్బంది..

  • 24 Sep 2020 12:03 PM GMT

    Hyderabad updates: రేపు హైదరాబాద్ రానున్న సీడబ్ల్యూసీ మెంబర్ మల్లికార్జున ఖర్గే..

    హైదరాబాద్.. 

    -మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నివాసం లో తెలంగాణ ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులతో భేటీ.

    -మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

  • 24 Sep 2020 12:01 PM GMT

    Rangareddy District updates: మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై గవర్నర్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ కిసాన్ సెల్..

    రంగారెడ్డి జిల్లా..

    -ఇబ్రహీంపట్నం టీఆరెస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై గవర్నర్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ కిసాన్ సెల్..

    -మెయిల్ ద్వారా పిర్యాదు చేసిన అల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొందండ రెడ్డి .

    -ఫార్మసీటీ పేరుతో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రైతుల వొద్ద అక్రమంగా భూములు లకుంటున్నడు అంటు లేఖ

    -ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు బెదిరించి రైతుల దెగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నాడు అంటూ లేఖ.

    -రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసిన కోదండరెడ్డి.

  • Telangana High Court: చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ...
    24 Sep 2020 11:43 AM GMT

    Telangana High Court: చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ...

    టీఎస్ హైకోర్టు.....

    -చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది రగునాథ్..

    -ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల పై సెక్షన్ 302 కేసు నమోదు చేయాలన్న రగునాథ్..

    -మృతదేహాలను వరంగల్ ఎంజీఎం , ఉస్మానియా ఆసుపత్రి కి తరలించాలన్న రగునాథ్..

    -మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణుల తో పోస్టుమార్టం చేపించాలన్న రగునాథ్..

    -ఇప్పటికే 3 మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్న ప్రభుత్వం...

    -కుటుంబ సభ్యుల నుండి మృతదేహాలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో ఫ్రీజ్ చేయాలన్న ప్రభుత్వానికి హైకోర్టు అదేశం..

    -ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేపించాలని హైకోర్టు అదేశం..

    -పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేపించి రీపోర్ట్ షీల్డ్ కవర్ లో సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం...

    -తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదా వేసిన హైకోర్టు..

Print Article
Next Story
More Stories