Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Nov 2020 10:47 AM IST
Visakha Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం...
విశాఖ
* రాగుల 24 గంటలో తుఫాన్ గా మారనున్న వాయుగుండం
* పూదుచ్చేరికి 700 చైన్నె కు 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతం
* రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం
* దక్షిణ కోస్తాంధ్ర లో చాలా చోట్ల భారీ వర్షాలు
* 25న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం
- 23 Nov 2020 10:44 AM IST
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
తిరుమల
* కార్తీక మాసంలో స్వామి వారిని దర్శించుకోవడం అలవాటుగా వస్తోంది.
* స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది.
* పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపి పంచాయతీ రాజ్ శాఖా మంత్రి
- 23 Nov 2020 10:21 AM IST
Tirumala Updates: శ్రీవారి దర్శనార్థం రేపు కుటుంబ సమేతంగా తిరుమలకు రాష్ట్రపతి రాక...
* పర్యటనలో పాల్గొననున్న గవర్నర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి
* చెన్నై నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రేపు ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి రాక
* రేణిగుంట నుండి తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శింకుంటారు..
* మధ్యాహ్నం 12: 15 గంటలకు తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహాన్నికి చేరుకుంటారు....
* 12.50 గంటలకు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహ స్వామివారిని దర్శించుకుని మహద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేయనున్నారు.
* శ్రీవారిని దర్శించు కున్న అనంతరం 3 గంటలకు తిరుమల తిరుగు ప్రయాణం 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి సాయంత్రం అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు.
* రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు, భారీ బందో బస్తు ఏర్పాట్లు చేసిన పోలిసులు
* శ్రీవారి దర్శనాన్ని కూడా దాదాపు 2 గంటలకు పైగా నిలిపి వేయనున్నారు.
- 23 Nov 2020 9:55 AM IST
Anantapur Updates: కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బొత్స సత్యనారాయణ పర్యటన...
అనంతపురం:
* కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రి లో 50 పడకల పెంపుకు సంబంధించి నూతన భవనానికి శంకుస్థాపన.
* తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన లో పాల్గొననున్న మంత్రి.
* రాయదుర్గం లో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి.
- 23 Nov 2020 9:49 AM IST
Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
నెల్లూరు...
-- ఇన్ ఫ్లో 8376 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 8454 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.358 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.
- 23 Nov 2020 9:41 AM IST
Tirumala Updates: దుబ్బాకాలో బి.జె.పి. విజయం సాధించిన తరువాత స్వామి వారిని దర్శించుకోవాలని అనిపించింది...
తిరుమల
* శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బి.జె.పి. నేత బాబుమోహన్.
* దుబ్బాకా విజయం సాధించినట్లే జీహెచ్ఏంసీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్ధించాను.
* జీహెచ్ఏంసీలో బి.జె.పి. జెండా ఎగుర వేయాలని ప్రయత్నిస్తున్నాం.
* దుబ్బాకా ఎన్నికల్లో విజయం సాధించడం కేసీఆర్ ను ఓడించినట్లే లెక్క.
* తెలంగాణలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా వుంది కనుక బిజెపి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.
* కేసీఆర్ కేవలం మాటలే కానీ చేతలు లేదు, ప్రజలకు మంచి చేస్తే ఎప్పటికి మరిచిపోరు.
* బి.జె.పి. తప్ప వేరోకటి లేదని చాలా మంది బిజెపిలో చేరుతున్నారు.
* మళ్ళీ కాబోయే ప్రధాని కూడా నరేంద్ర మోదీనే.
* తెలంగాణ,ఆంధ్ర ఎన్నికల్లో కూడా బి.జె.పి. విజయం సాధిస్తుంది.
- 23 Nov 2020 8:57 AM IST
Tirumala Updates: ఇవాళ నుండి వర్చువల్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు..
తిరుమల
- వర్చువల్ విధానానికి భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణ
- నవంబర్ నెలకు కల్యాణోత్సవ టికెట్లు కొన్న 31,380 మంది భక్తులు
- ఊంజల్ సేవా టికెట్లు కొనుగోలు చేసిన 2,185 మంది భక్తులు
- ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు కొన్న 2,546 మంది భక్తులు
- సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కొన్న చేసిన 1,748 మంది
- 23 Nov 2020 8:33 AM IST
Srikakulam Updates: రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు...
శ్రీకాకుళం..
* జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం, శ్రీచక్రపురం లో ఉన్న సహస్ర శివలింగ మందిరం, ఏండ్లమల్లిఖార్జున దేవాలయం, శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంల వద్ద రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.
* మాస్క్ వేసుకున్న వారికే ఆలయ ప్రవేసమన్న జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్
* ప్రతి ఆలయంలోకి వెళ్లే ద్వారా వద్ద సానీటైజర్ ఏర్పాటు..
* భక్తులు భౌతిక దూరం పాటించాలని పిలుపు
- 23 Nov 2020 8:29 AM IST
Vijayawada Updates: కార్తీక సోమవారం కావడంతో కిటకిటలాడుతున్న శైవకేత్రలు....
విజయవాడ..
* కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో శివాలయాలకు పెద్దసంఖ్యలో పోటెత్తిన భక్తులు..
* కోవిడ్ కారణంగా నది సాన్నంకి అనుమతి ఇవ్వని అధికారులు...
* ఇళ్ల వద్ద స్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుంచే ఆలయానికి వస్తున్న భక్తులు
* కార్తీక దామోదరుడు కి రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
- 23 Nov 2020 8:26 AM IST
Annavaram Updates: అటు పెళ్లి బాజా , ఇటు కార్తీకమాసం సందడి...
తూర్పుగోదావరి.. అన్నవరం
* భక్తులతో కిక్కిరిసిన సత్యదేముని ఆలయం.
* తెల్లవారుజాము 3 గంటల నుండి ప్రారంభమైన సత్యదేముని వ్రతాలు , సర్వ దర్శనాలు.
* దర్శనం అనంతరం రావి చెట్టు వద్ద ధీఫారాధన చేస్తున్న భక్తులు.













