Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం, 23 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం పంచమి: (రా. 9-32 వరకు) తదుపరి షష్టి, చిత్త: (రా. 10-15 వరకు) తదుపరి స్వాతి, అమృత ఘడియలు: (సా. 4-18 నుంచి 5-47 వరకు) వర్జ్యం: (ఉ. 7-22 నుంచి 8-51 వరకు తిరిగి తె. 3-27 నుంచి 4-57 వరకు) దుర్ముహూర్తం: (సా. 4-38 నుంచి 5-28 వరకు) రాహుకాలం: (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-19
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Aug 2020 10:03 AM IST
Gadwal: ఉప సర్పంచ్ నర్సమ్మను సస్పెండ్ చేసిన కలెక్టర్ శృతి ఓజా..
జోగులాంబ గద్వాల జిల్లా:
- మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామ ఉప సర్పంచ్ నర్సమ్మను సస్పెండ్ చేసిన కలెక్టర్ శృతి ఓజా...
- చెక్కులపై సంతకాలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఉప సర్పంచ్ నర్సమ్మ.
- సర్పంచ్ రాధనీల ఫిర్యదు మేరకు విచారణ జరుపి ఉప సర్పంచ్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్.
- 23 Aug 2020 8:31 AM IST
Sangareddy: గుమ్మడిదల మండలం దోమడుగు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.
సంగారెడ్డి:
గుమ్మడిదల మండలం దోమడుగు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.
- వోరా పెట్రో కెమికల్స్ గోదాంలో చెలరేగిన మంటలు,దట్టంగా అలముకున్న పొగలు
- వందల డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సాల్వెంట్స్ అంటుకోవడంతో పేలుడు శబ్దం,భయాందోళనకు గురైన స్థానికులు
-సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఐదు ఫైర్ ఇంజన్లు,
- గోదాంలో నుంచి ఇంకా వెలువడుతున్న పొగలు
- రికవరి సాల్వెంట్ పేరుతో దందా చేస్తున్న కల్పేష్, హరీష్
- ఫైర్ సేఫ్టీ లేకుండా మూడు సంవత్సరాలుగా అక్రమంగా దందా
- ప్రమాదంలో రెండు లారీలు దగ్థం, బూడిదైన గోదాం
- 23 Aug 2020 8:22 AM IST
Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 95.10 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 4.726 టీఎంసీ
- ఇన్ ఫ్లో 4,07,120 క్యూసెక్కులు
- ఓట్ ఫ్లో 4,07,120 క్యూసెక్కులు
- 23 Aug 2020 8:21 AM IST
Saraswathi Barrage: సరస్వతి బ్యారేజ్ 19 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- సరస్వతి బ్యారేజ్ 19 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 116.100 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 5.25 టీఎంసీ
- ఇన్ ఫ్లో 63,000 క్యూసెక్కులు
- ఓట్ ఫ్లో 63,000 క్యూసెక్కులు



