Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Sept 2020 9:26 AM IST
Tirumala updates: తిరుమలలో నాల్గోవ రోజు ఏకాంతంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
తిరుమల :
-కల్పవృక్ష వాహనంపై ఊభయదేవేరులతో కలిసి మలయప్ప స్వామిని కొలువు తీర్చిన ఆలయ అర్చకులు..
-కోవిడ్-19 కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు..
-మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకూ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్న అర్చకులు..
-రాత్రి 7 నుండి 8 గంటల వరకూ సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శన మివ్వనున్న మలయప్ప స్వామి..




