Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

విషాదం: తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాయిని కన్నుమూత. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వర్తించిన నాయిని. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకపాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కార్మిక నేత నర్సన్నగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితుడు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి. బుల్లెట్ నర్సన్నగా ప్రసిద్ధి. 1944 మే 12న జన్మించిన నాయిని నర్సింహారెడ్డి. నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మం. నేరేడుగొమ్ము

Show Full Article

Live Updates

  • 22 Oct 2020 4:55 AM GMT

    గద్దర్ ప్రజాగాయకుడు

    నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రజా గాయకుడు గద్దర్...

    తనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాం..

    ఉద్యమాలు,త్యాగాలు,పదవులు ఆయన్నుండి నేర్చుకున్న పాఠాలు..

    ఆయన చనిపోవడం బాధాకరం..

    కార్మిక పక్షపాతి...

    కార్మికుల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి నర్సన్న..

  • 22 Oct 2020 4:54 AM GMT

    మంత్రి జగదీశ్వర్ రెడ్డి.....

    నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి...

    వయస్సులో పెద్దవాడు అయిన మాతో కలిసి పనిచేసే వాడు..

    చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో కలవడిగ ఉండే వాడు మా నర్సన్న

    పేద ప్రజలతో మమేకం అయ్యే వ్యక్తి నర్సన్న..

    మంత్రి అయిన తర్వాత కూడా కార్మికుల కోసం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి నర్సన్న..

    తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి నర్సన్న ఎంతో పోరాటం చేశారు..

  • 22 Oct 2020 4:54 AM GMT

    ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్....

    తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయిని చేసిన కృషి , పోరాటం మరవలేనిది...

    సోషలిస్టు పార్టీ లో చురుకైన కార్యకర్త గా పనిచేసిన వ్యక్తి నాయిని..

    జనతా పార్టీ పిలుపు మేరకు అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు కు వెళ్లిన వ్యక్తి..

    జార్జ్ ఫెర్నాండెజ్ కు అత్యంత సన్నిహితుడు నాయిని నర్సింహారెడ్డి..

    కార్మిక లోకాన్ని పక్షపాతి నాయిని...

    2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి రోజు మాట్లాడే వాళ్ళం...

    తెలంగాణ రాష్ట్ర సమితి నాయిని సేవలను మరచి పోదు..

    నాయిని పేరు తెలంగాణ చరిత్ర లో లికిస్తాం..

  • 22 Oct 2020 4:54 AM GMT

    ఖమ్మం జిల్లా

    ఖమ్మం ...

    మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గారి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం .

    నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభుతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించిన మంత్రి పువ్వాడ...

    పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమనేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడిన పువ్వాడ....

  • 22 Oct 2020 4:53 AM GMT

    హైదరాబాద్

    వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

    తార్నాకలోని మాణికేశ్వర్ నగర్ లో ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి...

    తమని ఆదుకోవాలని కేంద్రమంత్రి ని కోరిన నిర్వాసితులు...

  • 22 Oct 2020 4:53 AM GMT

    కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి....

    నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి..

    నాయిని తో నాకు చాలా సన్నిహితం ఉంది..

    మా జిల్లా వాసి నాయిని..

    నాయిని ఇకలేరని జీర్ణించుకోలేక పోతున్న..

    మాతో పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి..

    సోషలిస్టు పార్టీ లి క్రియాశీలక పాత్ర పోషించారు..

    సోషలిస్టు పార్టీ లో నాయిని ఉన్న సమయంలో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను..

    1978 జనతా పార్టీలో కూడా నాయిని తో కలిసి పనిచేశాను..

    మంత్రి గా ఉన్నప్పుడు ప్రతిపక్షం లో నాయిని ఉన్నాడు..

    రాజకీయంగా నేను ఎదగడానికి నాయిని కృషి మరువలేనిది..

    ప్రజా సమస్యల పై నిరంతరం నాయిని కృషి చేసే వాడు..

    నాయిని ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతున్న..

    కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న.

  • 22 Oct 2020 4:52 AM GMT

    రాజన్న సిరిసిల్ల జిల్లా

    వేములవాడ లో నేడు సద్దుల బతుకమ్మ...

    వేములవాడ పట్టణం లో ఎంగిలిపూల బతుకమ్మ నుండి ఏడవరోజే సంప్రదాయంగా వస్తున్న సద్దుల బతుకమ్మ

    వేములవాడ లో నేటితో ముగియనున్న బతుకమ్మ వేడుకలు ...

    కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసిన అధికారులు

  • 22 Oct 2020 4:52 AM GMT

    జగిత్యాల జిల్లా : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణలో "కాత్యాయని"రూపంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు...

  • 22 Oct 2020 4:52 AM GMT

    రాజన్నసిరిసిల్లజిల్లా :

    వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు

    6 వ రోజు కాత్యాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.

    స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

    శ్రీ రాజరాజేశ్వరిదేవి కి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చతుషష్టి ఉపచార పూజ నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు.

    మూల నక్షత్రం సందర్భంగా మహా సరస్వతీ పూజ

  • 22 Oct 2020 4:51 AM GMT

    మాజీ మంత్రి నివాసానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిలక సంఘాల నేతలు..

    మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్,బాల్కా సుమన్, మండలి విప్ కర్నె ప్రభాకర్..

Print Article
Next Story
More Stories