Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Hyderabad updates: ఓపెన్ నాలాల పై క్యాపింగ్ నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం..
    21 Sep 2020 9:44 AM GMT

    Hyderabad updates: ఓపెన్ నాలాల పై క్యాపింగ్ నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం..

    పత్రికా ప్రకటన..

     మంత్రి కే తారకరామారావు..

    -హైదరాబాద్ ఓపెన్ నాలాల పై క్యాపింగ్ (capping)  (బాక్స్ డ్రైనేజీల) నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం

    -రెండు మీటర్ల కన్న తక్కువ వెడల్పు ఉన్న నాళాల్ని క్యాపింగ్ (బాక్స్ డ్రైనేజీల నిర్మాణం) చేస్తాం అన్న మంత్రి కేటీఆర్

    -రెండు మీటర్ల కన్నా వెడల్పు అయిన నాలల పైన గ్రీ న్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు

  • Ponnam Prabhakar Comments: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా వ్యవసాయ, రైతు వ్యతిరేక బిల్లులు..పొన్నం ప్రభాకర్..
    21 Sep 2020 9:40 AM GMT

    Ponnam Prabhakar Comments: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా వ్యవసాయ, రైతు వ్యతిరేక బిల్లులు..పొన్నం ప్రభాకర్..

    పొన్నం ప్రభాకర్.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.

    -కార్పొరేట్లకు అండగా నిలబడేందుకు దేశంలోని రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి పార్లమెంట్ లో రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం బిల్లులను     ఆమోదించుకుంది..

    -12 రాజకీయ పార్టీ లు వ్యతిరేకిస్తున్న మూజువాణి ఓటు తో ప్రభుత్వం బిల్లులు ఆమోదింప జేయడం రాజ్యాంగ విరుద్ధం..

    -రైతులకు నిజంగా మేలు చేయాలని ఉంటే భూముల పరీక్షలు చేయాలి. నాణ్యమైన విత్తనాలు అందజేయాలి, ఎరువుల ధరలు తగ్గించాలి అలా కాకుండా తన   కార్పొరేట్ మిత్రులకు దేశంలోని వ్యవసాయాన్ని అందించాలనే లక్ష్యంతో మోడీ వ్యవసాయ బిల్లులు తెచ్చారు..

    -బిల్లుల విషయంలో తన మిత్ర పక్షం కూడా వ్యతిరేకించి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసింది..

    -పంజాబ్, హర్యానా లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, రైతుల వ్యతిరేక బిల్లును ప్రభుత్వం వెంటనే ఉపశరించుకోవాలి..

    -క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాం...రైతుల హక్కులను, ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యను కాంగ్రెస్ సమర్థించదు..

    -ఎట్టి పరిస్థితులలో బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించి ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం.

  • Yadadri updates: చౌటుప్పల్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అవగాహన కార్యక్రమం....
    21 Sep 2020 9:33 AM GMT

    Yadadri updates: చౌటుప్పల్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అవగాహన కార్యక్రమం....

    యాదాద్రి :

    -పల్ల రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..

    -దేశం లోనే ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ విషయం పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రి వెల్లడించారు.

    -మునుగోడు లో సాగు నీటి ప్రాజెక్టు లు త్వరలోనే వేగంగా పూర్తి చేస్తాం.

    -దేశంలోని అత్యధికంగా పంటలు పండించిన రాష్ట్రం తెలంగాణ..

    -టిఆర్ఎస్ పాలన లో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందుతున్నాయి.

    -దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అన్ని రంగాలలో తెలంగాణ ముందుంది.

    -రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చిన టిఆర్ఎస్ గెలుస్తుంది. రాబోయే పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక లలో కూడా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం.

    -ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త గ్రామాలలోని పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకునే విధంగా టిఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలి.

  • Sripada Yellampalli project updates: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బారీగా చేరుతున్న వరదనీరు..
    21 Sep 2020 9:26 AM GMT

    Sripada Yellampalli project updates: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బారీగా చేరుతున్న వరదనీరు..

    మంచిర్యాల శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్టు:

    -ప్రస్తుతం నీటిమట్టం 147.56

    -గరిష్ట నీటిమట్టం148.00 M

    -ప్రస్తుతం నీటి నిల్వ 18.9529

    -పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 TMC*

    -ఇన్ ప్లో :206409 c/s*

    -ఇరవై గేట్లను ఎత్తి 206409 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నా అదికారులు

  • KTR Meeting on Rainfall: వర్షాలపైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం..
    21 Sep 2020 8:40 AM GMT

    KTR Meeting on Rainfall: వర్షాలపైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం..

    హైదరాబాద్..

    # హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై ఆరా

    # ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

    # రానున్న రెండు వారాలపాటు అధికారులకు సెలవులు రద్దు

    #నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని సూచన

    # కేవలం పది రోజుల్లోనే యాభై నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని తెలిపిన అధికారులు

    # భారీ వర్షంలోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సహాయక చర్యలు చేపడుతున్నామన్న అధికారులు

    # వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశం

    #వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలి

    #మున్సిపల్ శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నత అధికారులతో మంత్రి సమీక్ష.

  • 21 Sep 2020 7:34 AM GMT

    Kamareddy District updates: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్ను వసూలు చేసే మహిళా ఉద్యోగి రోజా పై మరో ఉద్యోగి దాడి...

    కామారెడ్డి :

    -మహిళా ఉద్యోగి రోజా కు తీవ్ర గాయాలు..

    -దాడి చేసిన ఉద్యోగి బోధన్ మున్సిపల్ లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ .

    -గతంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన రామకృష్ణ. దాడి చేసిన రామకృష్ణుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

  • Telangana Latest news: మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుతో కెసిఆర్ ఉలిక్కిపడ్డాడు..ధర్మపురి అరవింద్..
    21 Sep 2020 7:27 AM GMT

    Telangana Latest news: మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుతో కెసిఆర్ ఉలిక్కిపడ్డాడు..ధర్మపురి అరవింద్..

    ధర్మపురి అరవింద్, బిజెపి ఎంపీ..

    -రైతు పండించిన పంట కోరిన మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పించే ఈ బిల్లు రైతుల పాలిట వరం.

    -అదే రోజు రైతుకు డబ్బు చెల్లించే విధానాన్ని కొత్త బిల్లు కల్పిస్తుంది.

    -మార్కెట్ యార్డ్ ఫీజు, మధ్యవర్తుల కమిషన్లు లేకుండా రైతుకు 5 శాతం డబ్బు మిగిలేలా ఈ బిల్లు చూస్తుంది.

    -కెసిఆర్ ఫామ్ హౌస్ లో పండించే పంటలు రిలయన్స్ వంటి కార్పొరేట్ల తో ఒప్పందం చేసుకొని అమ్మట్లేదా.

    -కెసిఆర్ లాగా రైతు కూడా కార్పొరేట్ల తో ఒప్పందం చేసుకుని అమ్ముకోవద్ధా?

    -కెసిఆర్ కి బిల్లులోనీ మంచి విషయాలు తెలిసినప్పటికీ రైతులను మభ్య పెట్టే అబద్ధాల గురువు గా మారాడు. 

    -KST టాక్స్ తగ్గుతుందనే బాధ తోనే వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 

    -కెసిఆర్ అడుగులకు మడుగు లోత్తకుండా కేశవరావు తన స్థాయిని నిలబెట్టుకోవాలి.

  • 21 Sep 2020 5:10 AM GMT

    Nizamabad updates: మహారాష్ట్ర నుంచి జిల్లాకు అక్రమంగా దేశీ దారు రవాణా..

    నిజామాబాద్ :

    -కోప్పర్గ- నీలా రహదారి పై పోలీసుల తనిఖీల్లో 48 దేశిదారు మద్యం పట్టివేత.

    -అక్రమంగా దేశిదారు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.

  • Nizam Sagar Project updates: నిజాం సాగర్ ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద..
    21 Sep 2020 5:08 AM GMT

    Nizam Sagar Project updates: నిజాం సాగర్ ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద..

    కామారెడ్డి :

    -1428 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో..

    -పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు..

    -ప్రస్తుతం 1392 అడుగులకు చేరుకున్న నీటి మట్టం..

    -ఐదు టి.ఎం.సి లకు చేరిన నీటి నిల్వ..

    -రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..

  • Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
    21 Sep 2020 4:57 AM GMT

    Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

    నిజామాబాద్..

    -ఇన్ ఫ్లో 134 364 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 134364 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

    -32 వరద గేట్లు ఎత్తి 1 12500 క్యూసెక్కుల దిగువకు విడుదల.

    -కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

    -గోదావరి లోకి 54 టీఎంసీ లు విడుదల..

Print Article
Next Story
More Stories