Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha updates: విశాఖ ఎయిర్ పోర్ట్ లో కలకలం..
    21 Oct 2020 2:30 PM GMT

    Visakha updates: విశాఖ ఎయిర్ పోర్ట్ లో కలకలం..

    విశాఖ..

    -ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ ప్రయాణీకుడుని అదుపులోకి తీసుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు

    -భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు అధికారులకు సమాచారం

    -ప్రయాణీకుదుని అదుపులోకి తీసుకొని నగదు కు సంబంధించి ప్రశ్నిస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు

  • Vellampalli Srinivas: సీఎం దుర్గ గుడి అభివృద్ధి నిధులు మంజూరు చేయడం హర్షణీయం..
    21 Oct 2020 2:28 PM GMT

    Vellampalli Srinivas: సీఎం దుర్గ గుడి అభివృద్ధి నిధులు మంజూరు చేయడం హర్షణీయం..

     విజయవాడ

    --దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

    --రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దుర్గ గుడి అభివృద్ధి 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం హర్షణీయం

    --ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

    --దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం..

  • 21 Oct 2020 2:23 PM GMT

    National updates: ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర..

      జాతీయం..

    --కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర .

    --బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయం

    --కేబినెట్‌ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి.

    --కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ జారీతో పండుగ సీజన్‌లో డిమాండ్‌ పుంజుకుంటుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం

    --దసరా లోపు బోనస్‌ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడి.

    --కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్‌ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్‌ గెజిటెట్‌   ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్

  • Kurnool district updates:  కోడుమూరు లో భారీ వర్షం..
    21 Oct 2020 2:19 PM GMT

    Kurnool district updates: కోడుమూరు లో భారీ వర్షం..

    కర్నూల్

    * కోడుమూరు లో ఉరుములు మెరుపులతో కూడుకున్న భారీ వర్షం

    * చెరువులను తలపిస్తున్న వీధులు, కాలువలు

    * కొన్ని వీధుల్లో ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు

  • Vijayawada durgamma updates: ఇంద్రకీలాద్రి పై దర్శనాలు!
    21 Oct 2020 2:15 PM GMT

    Vijayawada durgamma updates: ఇంద్రకీలాద్రి పై దర్శనాలు!

    విజయవాడ..

    // ఇంద్రకీలాద్రి పై దర్శనాలను పునరుద్ధరించిన దుర్గగుడి అధికారులు

    // క్యూలైన్లలో పోటెత్తిన భక్తులు

  • Durgamma temple updaets: కొండచరియలు పడిన సంఘటనను సీఎం పరిశీలించారు..
    21 Oct 2020 12:43 PM GMT

    Durgamma temple updaets: కొండచరియలు పడిన సంఘటనను సీఎం పరిశీలించారు..

      విజయవాడ

    -దుర్గగుడి పాలక కమిటీ చైర్మన్, పైలా సోమినాయుడు

    -రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు

    -లడ్డు ప్రసాదం తయారుచేసే పోటుకి, కొండమీద రివిటింగ్ కి, సోలార్ సిస్టం కి 70కోట్లు ప్రకటించారు

    -సీఎం త్వరితగతిన నిధులు ప్రకటించారు

    -మరింతగా నిధులు ఇస్తే ఇంకా ప్లానింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు చేస్తాం

    -ఈఓ సురేష్, ఇంద్రకీలాద్రి దుర్గగుడి మల్లేశ్వర స్వామి గుడి, కేశఖండన శాలకు కూడా సీఎం ప్రకటించిన నిధులు వినియోగిస్తాం

    -కొండచరియలు పడతాయని సమాచారం లేదు

    -కొండచరియల క్రింద ఎవరూ లేరనుకుంటున్నాం

  • Vijayawada updates: అమ్మవారికి  పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..
    21 Oct 2020 12:32 PM GMT

    Vijayawada updates: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

     విజయవాడ..

    // విరిగిపడ్డ కొండచరియలు పరిశీలించిన సీఎం

    // ఇంద్రకీలాద్రి నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరిన సీఎం

  • Guntur district updates: ఎక్సైజ్ సి.ఐ. వేదింపులు!
    21 Oct 2020 12:29 PM GMT

    Guntur district updates: ఎక్సైజ్ సి.ఐ. వేదింపులు!

      గుంటూరు జిల్లా , గురజాల

    --ఎక్సైజ్ సి.ఐ. వేదింపులు తాళలేక షేక్.లాల్ భీ అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం....

    --దాచేపల్లికి చెందిన షేక్.లాల్ భీ ఇటీవల అక్రమ మద్యం అమ్ముతు పట్టుబడింది....

    --అపుడు కేసునమోదు చేసి రిమాండ్ కు పంపిచిన పోలీసులు....

    --జైలు నుంచి వచ్చినప్పటినుంచి మద్యం అమ్మడం మానేసి పోలం పనులు చేసుకుంటున్న మహిళా...

    --గత రాత్రి లాల్ బీ కుమారులను మద్యం అమ్ముతున్నారంటూ మీపై

    --పి.డి.యాక్ట్ పెడతానంటూ ఎక్సైజ్ సిఐ బెదిరింపులు.....

    --మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం..స్థానిక.ఆసుపత్రికి తరలింపు

  • Amaravati updates: భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు..
    21 Oct 2020 12:25 PM GMT

    Amaravati updates: భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు..

    అమరావతి

    //బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా

    //ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానా

    //జరిమానాలు..

    //వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750

    //సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750

    //అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

    //అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

    //డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000

    //రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

    //వేగంగా బండి నడిపితే - రూ. 1000

    //సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

    //రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

    //రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

    //పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

    //ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

    //వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000

    //ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000

    //అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

    //రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష

  • Y.S.Jagan Comments: ఇది చాలా పెద్ద కార్యక్రమం, గొప్ప కార్యక్రమం...
    21 Oct 2020 12:22 PM GMT

    Y.S.Jagan Comments: ఇది చాలా పెద్ద కార్యక్రమం, గొప్ప కార్యక్రమం...

    అమరావతి..

    ‘వైయస్సార్‌ బీమా’ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్ ..:

    -ఏ ఒక్క కుటుంబం బాధ పడొద్దు

    – ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మాది.

    – ఒక నిరుపేద కుటుంబం, సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం బాధ పడొద్దన్న ఉద్దేశంతో పథకం అమలు.

    కేంద్రం తప్పుకున్నా..:

    – గతంలో ఉన్నట్లుగా కాకుండా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ పథకం అమలు చేస్తోంది.

    – ఏటా రూ.510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ కల్పిస్తోంది.

    పారదర్శకంగా:

    – పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు.

    – ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించమని కోరాము.

    – అర్హత ఉండి కూడా ఎవరి పేర్లు అయినా ఆ జాబితాలో లేకపోతే వారు తమ పేర్లు వెంటనే నమోదు చేసుకోవచ్చు.

    బీమా ప్రయోజనాలు:

    – పథకంలతో 18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజ మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం

    – 18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ మరణించినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం.

    – ఇక 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.3 లక్షల సహాయం.

    – ఇంకా 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు.

    నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో:

    – పథకంలో ప్రీమియమ్‌ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

    – బ్యాంకర్లు ఆ నగదును తొలుత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, ఆ తర్వాత బీమా కంపెనీలకు ప్రీమియమ్‌గా చెల్లిస్తారు.

    – ఆ తర్వాత ఒక వారంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేస్తారు.

    – పథకం లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా గ్రామ, వార్డు సచివాలయాలు రెఫరల్‌ పాయింట్‌గా ఉంటాయి.

    తక్షణమే రూ.10 వేలు:

    – ఏదైనా ప్రమాదం జరిగి, కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్‌ పొందడానికి 15 రోజులు పడుతుంది.

    – ఆలోగా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇస్తారు.

    – ఇది పథకంలో లేకపోయినా, కొత్తగా అమలు చేయబోతున్నాము.

Print Article
Next Story
More Stories