Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 21 Aug 2020 10:34 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • Rajahmandry: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్ళీ పెరుగుతున్న వరద ఉధృతి
    21 Aug 2020 7:37 AM IST

    Rajahmandry: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్ళీ పెరుగుతున్న వరద ఉధృతి

    తూర్పుగోదావరి:

    రాజమండ్రి: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్ళీ పెరుగుతున్న వరద ఉధృతి

    * ప్రస్తుతం 15.90 అడుగుల నీటిమట్టం తో 16లక్షల 13వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

    * ధవలేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక, రాత్రి నుంచి తిరిగి పెరుగుతున్న వరద

    * ధవలేశ్వరం వద్ద నేటి సాయంకాలానికి మూడో ప్రమాద స్థాయికి

    * భద్రాచలం వద్ద ప్రస్తుతం 54 అడుగులు దాటిన వరద గోదావరి నీటిమట్టం

    * గత ఏడు రోజులుగా జలదిగ్భంధంలో నానుతున్న దేవీపట్నం ముంపు, కోనసీమ ప్రాంతాలలో లంకగ్రామాలు..

    * భద్రాచలం ఎగువ తాలిపేరు ప్రాజెక్టు నుంచి 1లక్షా 96 వేల క్యూసెక్కుల దిగువకు విడుదల..

    * దేవిపట్నం ముంపు ప్రాంతాలలో 144 సెక్షన్ విధించిన అధికారులు

  • 21 Aug 2020 7:35 AM IST

    Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

    విశాఖ:

    - బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం జార్ఖండ్, ఒడిశ్శా ప్రాంతం లో కేంద్రీకృతం..

    - రానున్న 3-4 రోజులలో పశ్చిమ దిశగా చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా పయనించే అవకాశం..

    - ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

K V D Varma

K V D Varma

Next Story