Live Updates: ఈరోజు (సెప్టెంబర్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 20 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ: ఉ.10-07 వరకు తదుపరి చవితి | చిత్త నక్షత్రం ఉ.6-20 వరకు స్వాతినక్షత్రం తె.4-41వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: ఉ.11-32 నుంచి 1-01 వరకు | అమృత ఘడియలు: రా.8-28 నుంచి 9-58 వరకు | దుర్ముహూర్తం: సా.4-20 నుంచి 5-08 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Sept 2020 10:51 AM IST
Satyavathi Rathod Tour to Warangal: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సత్యవతి రాథోడ్..
వరంగల్ రూరల్ జిల్లా..
- నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సత్యవతి రాథోడ్..
- నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనున్న మంత్రి సత్యవతి రాథోడ్..
- 20 Sept 2020 10:45 AM IST
Jawahar Nagar updates: జవహర్ నగర్ లోని శ్రీలక్ష్మి నర్సింహ దేవాలయం లో చోరీకి పాల్పడిన దుండగుడు..
హైదరాబాద్..
# ఉండిలో ఉన్న నలబై వేల నగదు, అమ్మవారి, స్వామివారి బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లిన దొంగ.
# స్థానికులు గమనించి దొంగ ఒడుసు నర్సింహ ను పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
# గతంలో కూడా ఇదే దేవాలయం లో దొంగతనం చేసాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.
# నిందితుడిని విచారిస్తున్న పోలీసులు.
- 20 Sept 2020 10:39 AM IST
Ranga Reddy updates: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీ వీ ఎక్స్ప్రెస్ పిల్లర్ నంబర్156 ఫ్లై ఓవర్ పై ఓవర్ స్పీడ్ గా వెళ్లడంతో ఇన్నోవా కార్ బోల్తా ...
రంగారెడ్డి జిల్లా ......
-నలుగురికి తీవ్ర గాయాలు ..
-మైదిపట్నం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న సిబ్బందికి నలుగురికి గాయాలు ..
-ఎయిర్పోర్ట్ సిబ్బంది గా గుర్తించిన పోలీసులు..
-భారీగా ట్రాఫిక్ జామ్..
-సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు..
-గాయాలు అయిన వారిని స్ధానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు...
- 20 Sept 2020 9:26 AM IST
Weather updates: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం...
విశాఖ...
-24 గంటల్లో బలపడే అవకాశం..
-తెలంగాణ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనాలు..
-వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
-తీరం వెంబడి గంట కు 45-50 కీ మీ వేగం తో గాలులు
-మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు..




