Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 20 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పాడ్యమి(ఉ.6-39 వరకు) తదుపరి విదియ; పుబ్బ నక్షత్రం (రా. 2-56 వరకు) తదుపరి ఉత్తర నక్షత్రం, అమృత ఘడియలు (రా. 8-51 నుంచి 10-22 వరకు) వర్జ్యం (ఉ.11-45 నుంచి 1-16 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Aug 2020 9:10 AM IST
Vanasthalipuram:వనస్థలిపురం ఇంచార్జి ఏసీపీగా శంకర్..
వనస్థలిపురం ఇంచార్జి ఏసీపీగా శంకర్..
భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్'కు అదనపు భాద్యతలు..
వివిధ ఆరోపణల పై ఇటీవలే సస్పెండ్ అయిన ఏసీపీ జయరాం..
- 20 Aug 2020 9:08 AM IST
Coronavirus updates: తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల
తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల
*గడిచిన 24 గంటల్లో 1724 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు*
*కొత్తగా 10 మరణాలు-- మొత్తం 729కి చేరిన మరణాల సంఖ్య*
*GHMC- 395, మేడ్చెల్-105, కరీంనగర్- 101, వరంగల్ అర్బన్-91, రంగరెడ్డి-169, నల్గొండ 67, నిజామాబాద్-సిద్దిపేట-61 కేసులు నమోదు*
*కొత్తగా కొలుకున్నది-1195--ఇప్పటి కొలుకున్నవారి సంఖ్య-75 186 ఉన్నట్లు వెల్లడి*
*ప్రస్తుతం ఆక్టీవ్ కేసులు- 21 509--ఇప్పటి వరకు నమోదైన కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య- 97 424 చేరినట్లు వైద్యశాఖ ప్రకటన*
- 20 Aug 2020 9:00 AM IST
ములుగు జిల్లా :
ములుగు మండలంలోని మేడివాగు దగ్గర బైక్ పై వెళ్తుండగా వరదలలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు అల్లం శివాజీ, కవిరాజు
- 20 Aug 2020 8:59 AM IST
Bhadrachlam: తాలిపేరు కు మరింత పెరిగిన వరద ఉదృతి
భద్రాద్రి కొత్తగూడెం
- తాలిపేరు కు మరింత పెరిగిన వరద ఉదృతి
- చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ కు వరద ఉదృతి మరింతగా పెరిగింది.
- ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.
- దీంతో అదికారులు 24 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1 లక్షా 40 వేల 375 క్యూసెక్కుల వరదను దిగువనున్న గోదావరి నదిలోకి వదులుతున్నారు.
- రిజర్వాయర్ లోకి 1 లక్షా 38 వేల 700 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు
- ప్రాజెక్ట్ వద్ద గురువారం 150 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.
- 20 Aug 2020 8:57 AM IST
భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలంలో మళ్ళీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. ఈరోజు ఉదయం 5 గంటలకు 42.6 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి....
7 గంటలకు 43.1 అడుగుకు పెరిగింది. సుమారు 19 అడుగులు తగ్గిన నీటి మట్టం మళ్ళీ పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది.
- 20 Aug 2020 8:56 AM IST
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా మోస్రారుగా కురుస్తున్నా వర్షాలు...
- ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా మోస్రారుగా కురుస్తున్నా వర్షాలు...
- ఎజన్సీ ప్రాంతంలో ఉప్పోంగుతున్నా వాగులు, వంకలు
వాగులు, వంకలు ఉప్పోంగి ప్రవాహించడంతో బాహ్య ప్రపంచంతో సంబధాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నా గిరిజనులు
- 20 Aug 2020 8:12 AM IST
Kamareddy: నిండు కుండాలా మారిన కౌలాస్ నాలా ప్రాజెక్టు
కామారెడ్డి :
- నిండు కుండాలా మారిన కౌలాస్ నాలా ప్రాజెక్టు
- ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 555 క్యూసెక్కుల మేర వస్తున్న వరద నీరు.
- పూర్తి స్థాయి నీటి మట్టం 458 మీటర్లు కాగా 457.10 మీటర్లు చేరిక.
- 20 Aug 2020 8:12 AM IST
Nizamabad: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం.
నిజామాబాద్ :
- జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం.
- రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం. చెరువులు, కుంటలకు భారీగా చేరుతున్న నీరు.
- ఇప్పటికే 50 శాతానికి పైగా చెరువుల్లో మత్తడి.
- 20 Aug 2020 8:10 AM IST
Warangal: జిల్లాలో రాత్రి నుండి భారీ వర్షం.
వరంగల్ అర్బన్:
- జిల్లాలో రాత్రి నుండి భారీ వర్షం.
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.
- ట్రై సిటీస్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- వరంగల్, హన్మకొండ లోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం.
- 20 Aug 2020 8:10 AM IST
Heavy Rains: ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో
మంచిర్యాల జిల్లా:
- ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో
- ఎల్లంపల్లి ప్రాజెక్టు కు భారీగా చేరుకుంటున్న వరద నీరు,
- వాటర్ లెవెల్: 148 మీటర్ల కు ప్రస్తుతం 147.59 మీటర్లు,
- నీటి నిలువ: 20.175 టి.ఎం.సి. లకు
- ప్రస్తుతం 19.0362 టి.ఎం.సి.లు,
- ఇన్ ఫ్లో - 41235 క్యూసెక్కులు,
- అవుట్ ఫ్లో- 38984 క్యూసెక్కులు
- 8 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేసిన అధికారులు



