Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 20 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పాడ్యమి(ఉ.6-39 వరకు) తదుపరి విదియ; పుబ్బ నక్షత్రం (రా. 2-56 వరకు) తదుపరి ఉత్తర నక్షత్రం, అమృత ఘడియలు (రా. 8-51 నుంచి 10-22 వరకు) వర్జ్యం (ఉ.11-45 నుంచి 1-16 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Aug 2020 9:12 AM IST
తూర్పుగోదావరి
రాజమండ్రి: గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న వరద రెండో ప్రమాద హెచ్చరిక
- 16లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
- బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 15.70 అడుగులు
- దేవీపట్నం ,కోనసీమ లంకల్లో కొనసాగుతున్న జలదిగ్భంధం
- ఇంకా ఉధృతంగానే వశిష్ట.వైనతేయ, గౌతమీ పాయలు ..
- 20 Aug 2020 8:11 AM IST
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిగా అదుపులోకి వచ్చిన వరద
విజయవాడ:
- ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిగా అదుపులోకి వచ్చిన వరద
- 36,250 క్యూసెక్కులు ఔట్ ఫ్లో, 41వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- 4,500 క్యూసెక్కుల వరద నీటిని కాలువలకు విడుదల
- 20 Aug 2020 8:09 AM IST
Rajahmandry: ఆకస్మికంగా వరదలో పడి మునిగిన భర్తను ధైర్యంగా రక్షించిన భార్య
తూర్పుగోదావరి:
రాజమండ్రి: ఆకస్మికంగా వరదలో పడి మునిగిన భర్తను ధైర్యంగా రక్షించిన భార్య
- పి.గన్నవరం మం లంకలగన్నవరంలోని డొక్కా సీతమ్మకాలనీలో ఘటన
- ఇక్కడి నాగాబత్తుల వెర్రియ్యకు చెందిన ఇల్లు ముంపు వరదజలదిగ్దం బారినపడింది.
- అదే కాలనీలో సురక్షిత ప్రాంతం నుంచి భర్త వెర్రియ్య, భార్య కళావతి ముంపునీటిలో ఇంటిని చూసుకునేందుకు దిగి వెళ్లారు.
- ఆ సమయంలో వెర్రియ్యఅదుపుతప్పి వరదలో మునిగిపోయాడు.
- వెంటనే భార్య కళావతి స్పందించి రక్షించింది.
- అస్వస్థతకు గురైన వెర్రియ్యను పి.గన్నవరంలోని ఆసుపత్రికి స్థానికుల సహకారంతో తరలించి ప్రాణాలు కాపాడారు.
- 20 Aug 2020 8:07 AM IST
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం..
విశాఖ:
- బంగాళాఖాతంలో అల్పపీడనం..
- ఒడిశ్శా ఉత్తర ప్రాంతం వద్ద తీవ్ర అల్పపీడనం గా కొనసాగుతుంది..
- 24 గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం వుంది..
- వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 23 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుంది.
- అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో వర్షాలు...
- 20 Aug 2020 7:04 AM IST
Ananthapur: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం:
- జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
- కరోనా తో పరీక్షల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
- మొత్తం తొమ్మిది బాలికల, ఆరు బాలుర పాఠశాలలో 480 సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారుల వెల్లడి
- 20 Aug 2020 7:03 AM IST
Guntur: అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..
గుంటూరు:
- అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..
- 246వరోజుకు చేరుకున్న రైతులు, నిరసనలు
- 20 Aug 2020 7:02 AM IST
Ananthapur: జిల్లాలో రెండు వందల ఇరవై రెండు మంది వీఆర్ఏలకు విఆర్వోలు గా పదోన్నతులు
అనంతపురం:
- జిల్లాలో రెండు వందల ఇరవై రెండు మంది వీఆర్ఏలకు విఆర్వోలు గా పదోన్నతులు
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ గంధం చంద్రుడు



