Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 19 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ: మ.12-34వరకు తదుపరి తదియ | హస్తనక్షత్రం ఉ.8-00 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: మ.3-26 నుంచి 4-55 వరకు | అమృత ఘడియలు: రా.12-22 నుంచి 1-51 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-52 నుంచి 7-28 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-58
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతోహనం లాంచనంగా ప్రారంభం అయ్యాయి.
ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభం కానుంది.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Sept 2020 10:12 AM IST
Heavy Rains in GAdwal District: అలంపూర్ నియోజకవర్గం లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం..
జోగులాంబ గద్వాల జిల్లా :
- పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
- పుల్లూరు కలుగొట్ల మధ్య నిలిచిన రాకపోకలు..
- అమరవాయి - మానవపాడు మధ్య పెద్దవాగు పొంగి పొర్లుకుండటంతో నిలిచిన రాకపోకలు...
బొంకూర్ గ్రామం దగ్గర అంతర రాష్ట్ర రహదారి ఉప్పొంగి ప్రవహిస్తున్న పెద్దవాగు.. వాహనాలు రాకపోకలకు అంతారాయం..
- 19 Sept 2020 10:08 AM IST
Gaddenna Vagu: నిర్మల్ జిల్లా భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ నీటి మట్టం : 358.60 మీటర్లు
- పూర్తి స్థాయి నీటి మట్టం :358.7 మీటర్లు
- పూర్తి స్థాయి నీటి సామ్యర్థం :1.852 tmc
- ప్రస్తుత నీటి సామ్యర్థం :1.768 tmc
- ఇన్ ఫ్లో :500 క్యూసెక్కు లు
- అవుట్ ఫ్లో :నీల్
- గేట్స్ ఓపెన్: నీల్
- కెనాల్ : 40 క్యూసెక్కులు
- 19 Sept 2020 10:07 AM IST
Lakshmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ 46 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 94.20 మీటర్లు
- ఇన్ ఫ్లో 2,73,800 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 3,22,900 క్యూసెక్కులు
- 19 Sept 2020 10:00 AM IST
Sriram Sagar Project Updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
నిజామాబాద్:
- 32 గేట్లు ఎత్తి లక్షా 25 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.
- ఇన్ ఫ్లో 1,46874 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 146874 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం
- సరస్వతీ, లక్ష్మీ, కాకతీయ కేనాల్స్ కు కొనసాగుతున్న నీటి విడుదల.
- 19 Sept 2020 9:59 AM IST
Kamareddy Updates: సామాజిక మాధ్యమాల్లో తనపై పై అసత్య ప్రచారం చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ శరత్ ఆగ్రహం
కామారెడ్డి :
- దీనిపై దర్యాప్తు చేయాలని ఎస్పీ కి పిర్యాదు
- కారకులపై కేసు నమోదు చేయాలని
- రంగంలోకి దిగిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నం
- నిందితులను గుర్తించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామన్న జిల్లా ఎస్పీ శ్వేత.



