Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Aug 2020 7:00 AM IST
ఒంటిమిట్ట కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ...
కడప :
- ఒంటిమిట్ట కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ...
- కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్న టిటిడి
- 19న పవిత్ర ప్రతిష్ఠ, 20న పవిత్రాల సమర్పణ, 21 పవిత్రాల విసర్జన, పుర్ణాహుతి కార్యక్రమాలు
- 18 Aug 2020 7:00 AM IST
డాక్టర్ రమేష్, చైర్మన్ సీతారామారావుల స్క్వాష్ పిటీషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ
విజయవాడ:
- డాక్టర్ రమేష్, చైర్మన్ సీతారామారావుల స్క్వాష్ పిటీషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ
- స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో తన ప్రమేయం లేదన్న డాక్టర్ రమేష్
- పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్
- కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు డీఎంహెచ్ఓ అనుమతి ఇచ్చారన్న డాక్టర్ రమేష్
- తను అరెస్ట్ ఐతే ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్‌లో పేర్కొన్న రమేష్
- ఇదే అభ్యర్థనతో రమేశ్ కార్డియాక్ చైర్మన్ ఎం.సీతారామమోహనరావు కూడా హైకోర్టులో పిటిషన్



