Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • బెజవాడలో హవాలా కలకలం
    18 Aug 2020 7:54 AM GMT

    బెజవాడలో హవాలా కలకలం

    విజయవాడ: 30 లక్షలతో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు

    ఇద్దరు కర్నూలు, ఇద్దరు విజయవాడకు చెందిన వారిగా గుర్తింపు

    బత్తాయి వ్యాపారానికి సంబంధించిన సొమ్ముగా అవాస్తవాలు చెప్పే యత్నం చేసిన నిందితులు

    నలుగురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

    నిందితులు: కర్నూల్ కి చెందిన నూరుభాషా, వెంకటరమణ, బెజవాడ వన్ టౌన్ కి చెందిన గుంట్ల సాంబశివరావు, సందీప్ ఓజా గా గుర్తింపు...

  • పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
    18 Aug 2020 7:52 AM GMT

    పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

    పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

    పాత పోలవరం గ్రామంలోబలహీనంగా ఉన్న రింగ్ బండ్ గట్టు ను పరిశీలించిన సోము వీర్రాజు

    కడెమ్మ సలూయిజ్ వద్ద గట్టు పరిశీలన

    ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న బీజేపీ నేతల పర్యటన..

  • ధవళేశ్వరం వద్ద  మూడవ ప్రమాద హెచ్చరిక
    18 Aug 2020 7:49 AM GMT

    ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక

    అమరావతి: ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

    గోదావరికి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక

    ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 22,40,194 క్యూసెక్కులు

    గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు

  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై హైకోర్టు లో విచారణ
    18 Aug 2020 7:47 AM GMT

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై హైకోర్టు లో విచారణ

    అమరావతి: మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిల్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్

    ప్రతీ జడ్జ్ కదలికల్ని పోలీసులతో మోనిటర్ చేస్తున్నారని కోర్టుకు తెలిపిన పిటిషనర్

    ఇందు కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని నియమించారన్న పిటిషనర్

    మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ ని ఆదేశించిన కోర్టు

    అదనపు సమాచారం తో అఫిడవిట్ దాఖలు చేస్తానన్న పీటీషనర్

    ప్రభుత్వం తో పాటు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

    కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.

    మేము ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు ఆర్డర్ చేయకూడదో అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి.

    తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా

  • 18 Aug 2020 7:47 AM GMT

    విజయవాడ: పోలీసుల కష్టడీలో కారు హత్యాయత్నం నిందితుడు

    నిందితుడు వేణుగోపాలరెడ్డిని రహస్యంగా విచారిస్తున్న పోలీసులు

  • ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌
    18 Aug 2020 7:45 AM GMT

    ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

     అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

    అధికారులంతా సహాయపునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు

    నేను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను

    నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు

    అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నాను

    గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం

    ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించండి

    ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించండి

    మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవండి

    ఖర్చు విషయంలో వెనుకాడ వద్దు

    వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి

    వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి

    వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టండి

    క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి

    ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది

    వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి

    ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలి

    విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి

  • కూనవరం మండలాన్ని ముంచెత్తిన శబరి,గోదావరి
    18 Aug 2020 7:43 AM GMT

    కూనవరం మండలాన్ని ముంచెత్తిన శబరి,గోదావరి

    తూర్పుగోదావరి: కూనవరం మండలాన్ని ముంచెత్తిన శబరి,గోదావరి.

    - కూనవరం మండల కేంద్రంలో వేలాది మంది వరద బాధితులు.

    - తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక రోడ్లపైన నీరీక్షిస్తున్న వరద బాధితులు.. పట్టించుకోని అధికారులు.

    - అధికారులతో వాగ్వివాదంకు దిగిన వరద బాధితులు..

  • లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్
    18 Aug 2020 7:42 AM GMT

    లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్

    తూర్పుగోదావరి: అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్ వే లోపల ఉన్న లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు..

    స్థానిక వైసిపి నాయకులతో కలిసి పంటు పై ముంపు గ్రామాలను పరిశీలిస్తున్న తోట త్రిమూర్తులు..

    తోట త్రిమూర్తులు ప్రయాణం చేస్తున్న పంటుకు తలెత్తిన సాంకేతిక లోపం..

    గోదావరి మధ్యలో నిలిచిపోయిన పంటు..

  • లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్
    18 Aug 2020 7:41 AM GMT

    లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్

    తూర్పుగోదావరి: అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్ వే లోపల ఉన్న లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు..

    స్థానిక వైసిపి నాయకులతో కలిసి పంటు పై ముంపు గ్రామాలను పరిశీలిస్తున్న తోట త్రిమూర్తులు..

    తోట త్రిమూర్తులు ప్రయాణం చేస్తున్న పంటుకు తలెత్తిన సాంకేతిక లోపం..

    గోదావరి మధ్యలో నిలిచిపోయిన పంటు..

Print Article
Next Story
More Stories