Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ఏరియల్ సర్వే చేసేందుకు హెలికాప్టర్ లో బయలుదేరిన సిఎం జగన్
    18 Aug 2020 9:16 AM GMT

    ఏరియల్ సర్వే చేసేందుకు హెలికాప్టర్ లో బయలుదేరిన సిఎం జగన్

    అమరావతి: గోదావరి వరదలను ఏరియల్ సర్వే చేసేందుకు హెలికాప్టర్ లో బయలుదేరిన సిఎం జగన్

  • 18 Aug 2020 9:14 AM GMT

    ప్రకాశం..కొండపి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై కందుకూరు సబ్ కలెక్టర్ ని కలసి నివేదిక సమర్పించిన కొండపి శాసనసభ్యుడు శ్రీ బాలవిరాజనేయస్వామి వీటిపై విచారణ జరిపించాలని కోరిన కొండెపి శాసనసభ్యుడు

  • నిజామాబాద్ లో ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం పర్యటన వాయిదా
    18 Aug 2020 9:09 AM GMT

    నిజామాబాద్ లో ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం పర్యటన వాయిదా

    నిజామాబాద్: జిల్లాలో ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం పర్యటన వాయిదా

    సర్వే పనులను రైతులు అడ్డుకుంటారనే సమాచారం తో వాయిదా వేసుకున్న బృందం

    పట్టా భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులు

  • ఉగ్రరూపం దాల్చిన వశిష్ఠ గోదావరి
    18 Aug 2020 9:05 AM GMT

    ఉగ్రరూపం దాల్చిన వశిష్ఠ గోదావరి

    భారీగా చేరిన వరద నీటితో ఉగ్రరూపం దాల్చిన వశిష్ఠ గోదావరి..

    వరద ముంపులో ఉన్న లంక గ్రామాల్లోకి పర్యటనకు వెళ్ళి వెనుదిరిగిన మంత్రి చెరుకువాడ శ్రీరంగానాధ రాజు

    గోదావరిలో ప్రయాణం సురక్షితం కాదని అధికారులు చెప్పడంతో మధ్యలోనే వెనుడిరిగిన మంత్రి..

    మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు కామెంట్స్...

    గోదావరి వరదలపై లంక గ్రామాల ప్రజలకు అవగాహన ఉంది...

    అందుకే లంకల్లో ఇల్లు ఎత్తుగా కట్టుకుంటారు..

    వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం..

    ఇప్పటికే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించాము...

    3నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాం..

    పిల్లలు, గర్భిణులు,వృద్ధులకు వైద్యం, మందులు అందుబాటులో ఉంచాం..

    విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నాం..

    వరద వల్ల నష్టపోయిన తమలపాకు రైతులను ఆదుకుంటాం..

    రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధం..

    వరద బాధితులకు అవసరమైతే భోజనాలు ఏర్పాటు చేస్తాం..

  • 18 Aug 2020 9:03 AM GMT

    ముంపు గ్రామాల్లో వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పర్యటన

    తూర్పుగోదావరి: కోటిపల్లి వద్ద గోదావరి ప్రవాహం లో నిలిచిపోయిన పంటు 

    పంటు ద్వారా లంకల్లో వరద పరిస్థితి ని చూసేందుకు బయలుదేరిన వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు. పార్టీ శ్రేణులు.....

    సాంకేతిక కారణాలతో పంటి ముందుకు కదలక పోవడం తో గోదావరిలోనే లంగరు వేసి పంటు నిలిపివేశారు.


  • చంద్రబాబు దిగజారి మాట్లాడ్తున్నారు: ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్
    18 Aug 2020 8:55 AM GMT

    చంద్రబాబు దిగజారి మాట్లాడ్తున్నారు: ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్

    అమరావతి: ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్.....లక్ష్మీ పార్వతి

    సిగ్గు అనే పదం చంద్రబాబు డిక్షనరీలో లేదు

    చంద్రబాబు దిగజారి మాట్లాడ్తున్నారు..

    రాజకీయ ముసుకులో చంద్రబాబు వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారు

    చంద్రబాబు ఇప్పుడుకు ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు

    జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంది..

    ప్రజల నమ్మకంతో గెలిచిన నాయకుడు జగన్

    అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు

  • విశాఖ మధురవాడలో సినిమా పక్కీలో దోపిడీ
    18 Aug 2020 8:04 AM GMT

    విశాఖ మధురవాడలో సినిమా పక్కీలో దోపిడీ

    విశాఖ: రియల్ ఎష్టేట్ వ్యాపారి కోటేశ్వరరావు, బ్రోకర్ వెంకటేశ్వర్లు స్థలాన్ని పరిశీలిస్తుండగా ఈలోగా కారులో సైరన్ మోగిస్తూ వచ్చిన కారులోనకిలీ పోలీసులు.

    కోటీశ్వరావు నుంచి 20 లక్షల రూపాయలు దోచుకున్న నకిలీ పోలీసులు.

    స్థానిక పోలీస్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితుడు.

    ఇటీవలే పొలం అమ్మగ 50 లక్షలు నగదు విచ్చిందన్న కోటేశ్వరరావు

    20 లక్షల తో ప్లాట్ కొనాలని బ్రోకర్ కి చెప్పిన కోటేశ్వరరావు

    బ్రోకర్ పై అనుమానం

  • నూతన ఇసుక పాలసీలోనూ లోపాలు: రఘురామకృష్ణంరాజు
    18 Aug 2020 8:02 AM GMT

    నూతన ఇసుక పాలసీలోనూ లోపాలు: రఘురామకృష్ణంరాజు

    రఘురామకృష్ణంరాజ, నర్సాపురం ఎంపి

    రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీలోనూ లోపాలున్నాయి

    జగన్ పక్కన చాలా మంది కట్టప్పలు ఉన్నారు. తన పక్కన ఉన్న కట్టప్పలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారు. రాజు 

    ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం దొరకడం లేదు.

    రాజమండ్రిలో ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడుతుంది . ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

    సీఎం తన కళ్లెదురుగా జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోలేక పోతున్నారు. మా జిల్లా వ్యవహారాలను చూసే కట్టప్ప వాస్తవాలను వక్రీకరించి చెబుతున్నారు.

    ఉభయ గోదావరి జిల్లాలలో భూ సమీకరణ లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి.

  • సినీ హీరో రామ్ కి మేము అండగా ఉంటాం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
    18 Aug 2020 7:59 AM GMT

    సినీ హీరో రామ్ కి మేము అండగా ఉంటాం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

    అమరావతి: ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లు టాప్ చేయటం దుర్మార్గమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

    సినీ హీరో రామ్ ట్విట్ పెడితే ఆయనకు నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదం

    విజయవాడ నగరంలో వైసీపీ నాయకుడు పట్టపగలు కిరోసిన్ పోసి హత్య చేస్తే పోలీసులు ఎక్కడికి వెళ్లారు ?

    సినీ హీరో రామ్ కి మేము అండగా ఉంటాం... పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి

    పోలీసులంటే అధికార పార్టీ నాయకులకు లెక్క లేదు.... డిజిపి దీనికి సమాధానం చెప్పాలి

  • ఏపీ మంత్రి అనిల్ కుమార్ సన్నిహితులకు కరోన
    18 Aug 2020 7:56 AM GMT

    ఏపీ మంత్రి అనిల్ కుమార్ సన్నిహితులకు కరోన

    అమరావతి: ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సన్నిహితులకు కరోన

    వరసగా వారితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గున్న మంత్రి అనిల్ కుమార్..

    దీనితో సెల్ఫ్ quartain లో ఉన్న మంత్రి అనిల్ కుమార్

    Quartain లో ఉండి ఎప్పటికి అప్పుడు వరదలు పై అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అనిల్ 

Print Article
Next Story
More Stories