Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sept 2020 10:48 AM IST
Rajahmundry EAMCET updates: నిర్ణీత సమయం దాటిన తర్వాత చేరిన ఇద్దరు విద్యార్థులను అనమతించని అధికారులు..
తూర్పుగోదావరి..
-రాజమండ్రి లూథరిగిరి ఎంసెట్ పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం దాటిన తర్వాత చేరిన ఇద్దరు విద్యార్థులను అనమతించని అధికారులు.
-గంటముందే పరీక్షా కేంద్రానికి రావాలనే నిబంధన..
-9,10,11,14 తేదీల్లో, రోజు రెండు విడతలుగా మొత్తం 8 విడతలుగా జరగనుంది.
-పరీక్షా సమయం మొదటి విడత ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు..
-రెండవ విడత మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
- 17 Sept 2020 10:19 AM IST
Srikakulam District updates: జిల్లాలో ప్రారంభమైన ఎంసెట్ పరీక్షలు..
శ్రీకాకుళం జిల్లా..
-ఎచ్చెర్ల, రాజాం, టెక్కలి కేంద్రాలలో ఎంసెట్ నిర్వహణ..
-ఎచ్చెర్లలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన కారణంగా ఇద్దరు విద్యార్థులను పరీక్షకు అనుమతించని అధికారులు..
- 17 Sept 2020 10:15 AM IST
munguti srinivasu reddy comments: బల్లి దుర్గాప్రసాద్ తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది: మాగుంట శ్రీనివాసులు రెడ్డి..
-మాగుంట శ్రీనివాసులు రెడ్డి..
-28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
-ప్రతిసారి నా ఆశీస్సులు తీసుకునేవారు
-ఆయన కుటుంబానికే కాదు, నాకు కూడా ఈ మరణం వ్యక్తిగతంగా లోటు
-పార్లమెంట్ లో అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు
-ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారు
- 17 Sept 2020 8:49 AM IST
Eleru Reservoir: ఏలేరు రిజర్వాయర్ కు పెరుగుతోన్న వరద ఉధృతి..
తూర్పుగోదావరి :
- 13 వేల 700 క్యుసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో..
- 24.11 టిఎంసి లకు గాను 23.11 టిఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ..
- 10వేల క్యుసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు..
- గత నాలుగు రోజులుగా ముంపు లో ఉన్న ఏలేరు ప్రాజెక్ట్ దిగువ ఉన్న ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగ్గంపేట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, యూ.కొత్తపల్లి మండలాలు..
- ఏలేరు కాలువకు 26 చోట్ల గండ్లు..
- గొర్రిఖండి, నక్కలఖండి, వాలు కాలువ, సుద్దగడ్డ కాలువ, రామవరం కాలువ, రామశెట్టి వారి కాలువ, పెద్ద ఏరు కాలువ లకు గండ్లు.
- గండ్లు పూడ్చడానికి అష్ట కష్టాలు పడుతున్న రైతులు.. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు.
- కిర్లంపూడి మండలం రాజుపాలెం, గొల్లప్రోలు మండలం ఈబిసి కాలనీలో నీట మునిగిన నివాసగృహాలు..
- ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఇంకా కురుస్తున్న వర్షాలు..
- అవుట్ ఫ్లో పెరిగితే దిగువ ప్రాంతాలకు మరింత పొంచి ఉన్న ముప్పు..
- 17 Sept 2020 6:53 AM IST
Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న వరద
కర్నూలు జిల్లా:
- 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో: 2,22,625 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 3,14,730 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
- ప్రస్తుతం : 885.00 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం: 215.8070 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 17 Sept 2020 6:50 AM IST
AP Eamcet 2020 Updates: నేటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అమరావతి
- ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్
- పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు
- ప్రతి అభ్యర్థి మాస్క్,గ్లవ్స్ ధరించాల్సిందే
- ఈ–హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు
- కోవిడ్ నేపథ్యంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- కోవిడ్ లక్షణాలున్న వారి కోసం ప్రత్యేక పరీక్ష గదులు
- ఎంసెట్–2020 నేటి నుంచి 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
- పరీక్షకు 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- ఏపీ, హైదరాబాద్‌తో కలుపుకుని 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు
- 17నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షకు 1,85,263 మంది, 23 నుంచి 25 వరకు జరిగే అగ్రి తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు 87,637 మంది హాజరు కానున్నారు.







