Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Published on: 17 Aug 2020 7:37 AM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • ప్రకాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణ‌మ్మ ప‌ర‌వాళ్లు
    17 Aug 2020 8:38 AM IST

    ప్రకాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణ‌మ్మ ప‌ర‌వాళ్లు

    విజయవాడ: ప్రకాశం బ్యారేజీ 70గేట్లలో 50గేట్లు మూడు అడుగులు, 20గేట్లు రెండు అడుగులు ఎత్తారు

    1.32లక్షల క్యూసెక్కుల నీటిని సరాసరి నదిలోకి, 7వేల క్యూసెక్కులను కాలువలకు వదిలారు

    ఇన్ ఫ్లో 1.4లక్షల క్యూసెక్కులుగా వరద కొనసాగుతోంది

  • కోనసీమలో  పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
    17 Aug 2020 8:35 AM IST

    కోనసీమలో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

    తూర్పు గోదావరి జిల్లా: కోనసీమలో క్రమేణా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

    వశిష్ట ,వైనతేయ ,గౌతమి , వృద్ధ గౌతమి నదీ పాయల తోపాటు పొంగిపొర్లుతున్న ప్రధాన డ్రైన్లు

    21 లంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్

    బోడసకుర్రు ,మురమళ్ళ,నడవపల్లి వద్ద జలదిగ్బంధంలో ఇల్లు

    పశువులకు మేత ఇవ్వాలని కోరుతున్న రైతులు

    లంకలో పళ్ళు కూరగాయలు తోటలతో పాటు , వాణిజ్యపంటలు వరద నీటిలో మునక

    కోనసీమలోని 16 మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు

    ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఆర్డీవో వసంతరాయుడు

    రేపు అమావాస్య కావడంతో వరద నీరు మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్న కోన సీమ వాసులు

K V D Varma

K V D Varma

Next Story