Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Nov 2020 6:04 PM IST
National Updates: హైదరాబాద్ ఇక్రిశాట్‌కి డ్రోన్ల వినియోగానికి కేంద్రం అనుమతి!
జాతీయం..
- వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగించే షరతులతో అనుమతి మంజూరు
- పౌర విమానయాన శాఖ, డీజీసీఎ నుంచి అనుమతులు
- 16 Nov 2020 5:29 PM IST
Warangal Rural District Updates: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే...
వరంగల్ రూరల్ జిల్లా:
- వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, రామవరం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు..
- 16 Nov 2020 5:25 PM IST
Mahabubabad Updates: ఆర్టీసీ బస్సు ఇంజన్ లో పొగలు...
మహబూబాబాద్ జిల్లా...
- వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇంజన్ లో పొగలు...
- కేసముద్రం మండల కేంద్రం లోని ఫ్లై ఓవర్ పై నిలిపివేత, తప్పిన ప్రమాదం. ప్రయాణికులు,సిబ్బంది కిందికి దిగి నీళ్లు చల్లి ఆర్పివేశారు..
- 16 Nov 2020 5:22 PM IST
Mahabubnagar Updates: సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...
మహబూబ్ నగర్ జిల్లా..
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హనుమాన్ పురాలో సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...
- కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్న మంత్రి
- 16 Nov 2020 11:09 AM IST
Medchal Updates: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిది సురారం కాలనీ లో విషాదం..
మేడ్చల్ జిల్లా...
కుత్బుల్లాపూర్
- దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిది సురారం కాలనీ లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు
- బండరాయి తలపై వేసి హత్య చేసినట్లు స్దానికుల అనుమానం.
- మృతుని వయస్సు 40సంవత్సరాలు వరకు ఉండవచ్చని భావిస్తున్న స్దానికులు.
- సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
- 16 Nov 2020 9:58 AM IST
Suryapet Updates: లింగేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు...
సూర్యాపేట జిల్లా...
* మేళ్లచెరువు శ్రీ స్వయంభూశంభు లింగేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు.
* కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా వేకువజాము నుండే శివుడిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు.
- 16 Nov 2020 9:48 AM IST
Rangareddy Updates: నార్సింగ్ లో విషాదం...
రంగారెడ్డి జిల్లా..
- ప్రేమికుల ఆత్మహత్య..
- నార్సింగ్ లో 2 రోజుల క్రితం ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం..
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి ఇద్దరూ శనివారం సాయంత్రం నార్సింగ్ మంచిరేవుల ప్రాంతంలో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం..
- సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి తము పురుగుల మందు తాగమని.. తమను ఆస్పత్రికి తరలించాలని ఫోన్ చేసి కోరడంతో స్నేహితుడు,పోలీసుల సాయంతో నగరంలోని ఆసుపత్రికి తరలించారు..
- ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు..
- ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....
- 16 Nov 2020 9:06 AM IST
Khammam District Updates: శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు...
ఖమ్మం జిల్లా...
- కార్తీకమాస పర్వదిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు
- మొదటి కార్తీక సోమవారం కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పలు దేవాలయాల్లో స్వామివారిని భక్తులు దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటుచేసిన ఆలయ అధికారులు.
- వేకువ జాము నుండే శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీ







