Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Sept 2020 6:48 AM IST
Eluru Updates: ఇసుక అక్రమ రవాణా కేసులో సిఐ నాగేశ్వరనాయక్ పై విచారణ చేపట్టిన అధికారులు..
పశ్చిమ గోదావరి జిల్లా
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ఇసుక అక్రమ రవాణా కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ సిఐ నాగేశ్వరనాయక్ పై విచారణ చేపట్టిన అధికారులు..
👉ఒక్క ఐపియస్ అధికారితో పాటు డియస్పి స్దాయి అధికారి విచారణ
👉కేసు విచారణ లో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లోని కంప్యూటర్ ను సీజ్ చేయడానికి వెళ్లిన విచారణ అధికారులు
👉అధికారులను అడ్డుకుని కంప్యూటర్ లో డేటాను ట్యాంపరింగ్ కు యత్నించిన ఎస్సై గంగాధర్
👉అప్రమత్తమైన విచారణ అధికారులు
👉కంప్యూటర్ స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించిన అధికారులు
👉అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జంగారెడ్డిగూడెం సిఐ నాగేశ్వర నాయక్ తో పాటు ఎస్సై గంగాధర్ ను వీఆర్ కు పంపి విచారణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు




