Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Oct 2020 7:02 AM GMT

    Nizamabad updates: కవిత ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు!

    నిజామాబాద్ :

    -మారుతి నగర్ లోని ఎం.ఎల్.సి. కవిత ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు.

    -తెలంగాణ లో ఈ.డబ్ల్యు.ఎస్. రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్.

    -కవిత ఇంటి ముట్టడికి అడ్డుకున్న పోలీసులు, ఏబీవీపీ నేతల అరెస్ట్.

  • Rangareddy updates: మైలార్ దేవుపల్లి పరిస్థితులను పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్..
    15 Oct 2020 6:57 AM GMT

    Rangareddy updates: మైలార్ దేవుపల్లి పరిస్థితులను పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్..

    రంగారెడ్డి ..

    మైలార్ దేవుపల్లి..

    -పల్లె చెరువు కట్ట తెగడంతో మైలార్ దేవుపల్లి అలీ నగర్ పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్..

    -ప్రస్తుత పరిస్థితులను రెవెన్యూ ఎన్డీఆర్ఎఫ్ జిహెచ్ఎంసి ఇతర సిబ్బందితో చర్చించిన సిపి..

    -తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులతో చర్చించిన సిపి..

  • Uthamkumar reddy: వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు!
    15 Oct 2020 6:48 AM GMT

    Uthamkumar reddy: వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు!

    -hmtv తో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

    -మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

    -మూడు రోజుల నుండి వరద నీటిలో ప్రజలు ఉంటే అధికారులు ఎవరూ రాలేదు...

    -ప్రభుత్వం కనీసం స్పందించలేదు...

    -చాలా ఖాళీలు బస్సులో ఇంకా వరదనీటి ముంపులోనే ఉన్నాయి...

    -ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది...

    -లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలి...

    -ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వల హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వరద ముంపుకు గురయ్యాయి...

    -రెండు రోజులైనా ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు రోడ్ల మీద పడ్డ చెట్లు కూడా ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి...

  • Warangal Urban updates: హన్మకొండ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్..
    15 Oct 2020 6:33 AM GMT

    Warangal Urban updates: హన్మకొండ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్..

    వరంగల్ అర్బన్.

    -అమరావతి నగర్ కాలనిలో ప్రజలు తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

    -అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరు తమను పట్టించుకోవడం లేదని, తకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని తెలిపారు.

    -మంత్రి సర్దిచెప్పిన తమకు న్యాయం కావాలని ప్రజలు నిలదీశారు..

  • Hyderabad updates: కమిషనర్ పై కిషన్ రెడ్డి సీరియస్!
    15 Oct 2020 6:28 AM GMT

    Hyderabad updates: కమిషనర్ పై కిషన్ రెడ్డి సీరియస్!

    -జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్

    -తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆగ్రహం

    -కేంద్రమంత్రి లోతట్టు ప్రాంతాల సందర్శన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు దూరం

    -జాఇహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు పోన్ చేసిన కిషన్ రెడ్డి

    -కనీసం డీఈ , ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సమంజసం కాదన్న కిషన్ రెడ్డి.

  • 15 Oct 2020 6:10 AM GMT

    Bhupalpally updates: తృటిలో తప్పిన ప్రమాదం!

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

    -జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీంకి తృటిలో తప్పిన ప్రమాదం

    -రేగొండ మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి రేగొండకు ప్రభుత్వ వాహనంలో బయలుదేరిన జిల్లా కలెక్టర్ గారి వాహనానికి రేగొండ మండలం రామన్నగూడెంతండా సమీపంలో ప్రధాన రోడ్డుపై సడన్ గా ద్విచక్ర వాహనదారుడు అడ్డు రావడంతో కలెక్టర్ వాహనం డ్రైవర్ అప్రమత్తమై అతన్నీ తప్పించే ఉద్దేశంతో వాహనానికి బ్రేక్ వేస్తూ రోడ్డు కిందికి తీసుకు వెళ్ళాడు.

    -దానితో వాహనదారుడు మరియు కలెక్టర్ తో సహా కలెక్టర్ ప్రయాణిస్తున్న సిబ్బంది అందరూ సురక్షితంగా బయట పడ్డారు.

    -ప్రమాదం జరిగితే వాహనదారునికి లేదా కలెక్టర్ వాహనం అదుపుతప్పి పడిపోతే కలెక్టర్ గారికి ప్రాణహాని జరిగేది.

    -కలెక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం నివారించబడింది. వెంటనే రేగొండ పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు.

  • Hyderabad updates: ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన!
    15 Oct 2020 6:01 AM GMT

    Hyderabad updates: ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన!

    హైదరాబాద్...

    -వరద ముంపు ప్రాంతాల్లో పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన...

    -రాజ్ భవన్ ఎదురుగా ఉన్న మక్తా లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేతలు...

    -ముంపు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • 15 Oct 2020 5:58 AM GMT

    Sangareddy updates: మున్సిపాలిటీ ఇస్కా బావి వద్ద వాగులో గల్లంతు!

    సంగారెడ్డి..

    -నగర శివారులోని అమీన్ పూర్ మున్సిపాలిటీ ఇస్కా బావి వద్ద వాగులో గల్లంతు ఐనా ఆనంద్ కోసం తిరిగి ప్రారంభమైన సహాయక చర్యలు.. నిన్న చీకటి   పడడంతో నిలచిన గాలింపు చర్యలు..

    -మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు దాటుతుండగా కారు తో పాటు వాగులో కొట్టుకు పోయిన ఆనంద్..

    -నిన్న ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం, వర్షం, వాగులో వరద ఉధృతి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం. 36   గంటలుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు.. ఇంకా దొరకని ఆనంద్ ఆచూకి..

    -నేడు రంగంలోకి ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు స్పీడ్ బోట్ ద్వారా గాలింపు కు ప్రయత్నాలు..

  • Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవాహం..
    15 Oct 2020 4:26 AM GMT

    Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవాహం..

    నిజామాబాద్ :

    -శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్ళీ పెరిగిన వరద ప్రవాహం. గేట్లు ఎత్తిన అధికారులు.

    -8 వరద గేట్లు ఎత్తి.. 25వేల క్యూసెక్కుల నీటి విడుదల

    -ఇన్ ఫ్లో 40378 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 14900 క్యూసెక్కులు

    -ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.

    -నీటి సామర్థ్యం 90 టీఎంసీల

    -జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 296.73 టీఎంసీలు.

    -174.01 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

  • Hyderabad updates: శంషాబాద్ కు చెందిన మాధవ్ అనే వ్యక్తి మిస్సింగ్..
    15 Oct 2020 4:08 AM GMT

    Hyderabad updates: శంషాబాద్ కు చెందిన మాధవ్ అనే వ్యక్తి మిస్సింగ్..

    హైదరాబాద్... 

    -మంగళవారం రాత్రి తన తల్లిని పంజాగుట్ట లో బస్సు ఎక్కించి తాను బైక్ పై శంషాబాద్ బయలుదేరాడు..

    -ఆరోజు రాత్రి నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది..

    -రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన మాధవ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మాధవ్ స్నేహితుడు..

    -ఈరోజు ఉదయం మాధవ్ బైక్ ను శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద గుర్తించిన పోలీసులు..

    -మాధవ్ వరదలో గల్లంతయ్యాడా ఇంకా ఎక్కడైనా ఉన్నాడా తెలియడం లేదు అంటున్న మాధవ్ స్నేహితుడు..

    -శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్న మాధవ్..

Print Article
Next Story
More Stories