Live Updates: ఈరోజు (15 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (15 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 15 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య ఉ.11-24 తదుపరి శుక్లపక్ష పాడ్యమి | విశాఖ నక్షత్రం రా.7-11 తదుపరి | వర్జ్యం రా.10-56 నుంచి 12-25 వరకు | అమృత ఘడియలు రా.10-58 నుంచి 12-28 వరకు | దుర్ముహూర్తం సా.3-51 నుంచి 4-36 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.06-08 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Pragathi Bhavan Updates: ప్రగతి భవన్ లో ధరణి పోర్టల్ పై సీఎం సమీక్ష...
    15 Nov 2020 3:21 AM GMT

    Pragathi Bhavan Updates: ప్రగతి భవన్ లో ధరణి పోర్టల్ పై సీఎం సమీక్ష...

     ప్రగతి భవన్...

    - ఈ రోజు 11 గంటలకు ప్రగతి భవన్ లో ధరణి పోర్టల్ పై సీఎం సమీక్ష.

    - ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని అధికారులకు అదేశించనున్న సీఎం.

    - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి...?

    - వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ఏం చేయాలి...? అనే అంశాల పై అధికారులతో చర్చించనున్న సీఎం.

    - ఈ సమవేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

  • Hyderabad Updates: కూకట్‌పల్లి హార్డ్ వేర్ షాపులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం..
    15 Nov 2020 3:16 AM GMT

    Hyderabad Updates: కూకట్‌పల్లి హార్డ్ వేర్ షాపులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం..

     హైదరాబాద్.. 

    - కూకట్‌పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని హార్డ్ వేర్ షాపులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం..

    - రాందేవ్ ఎలక్ట్రికల్ హార్డ్ వేర్ షాపులో మంటలు ...

    - 5 ఫైరింజన్ల ,5 మినీ ట్యాంకర్ల తో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..

    - షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం ...

    - హార్డ్ వేర్ షాపు కావటంతో లోపల ఉన్న ఎలక్ట్రికల్ ఉపకరణాలు, పెయింట్ డబ్బాలు, ఫ్లై వుడ్ ఉపకరణాలు ఉండటంతో మంటలు షాపులోని మూడు     అంతస్తులలో మంటలు ...

    - భారీగా ఆస్తి నష్టం ...

Print Article
Next Story
More Stories