Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • అరసవల్లి సూర్య భగవానుడి ఆలయం మూసివేత
    15 Aug 2020 4:52 PM GMT

    అరసవల్లి సూర్య భగవానుడి ఆలయం మూసివేత

     శ్రీకాకుళం జిల్లా: లాక్ డౌన్ కారణంగా మరోసారి మూతపడనున్న అరసవల్లి సూర్య భగవానుడు ఆలయం..

    కరోనా తీవ్రత దృష్ట్యా మరో రెండు వారాలు పాటు దేవాలయం మూసివేత..

    రేపటి నుంచి ఈనెల 31 వరకు భక్తులకు అనుమతి నిరాకరణ..

    జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్న ఆలయ అధికారులు.. డి 

  • పోలవరం నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిపివేత
    15 Aug 2020 4:50 PM GMT

    పోలవరం నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిపివేత

    పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ను వరద చుట్టుముట్టడంతో నిర్మాణ పనులు నిలిపివేత

    స్పిల్ వే కాంక్రీట్, గడ్డర్ పనులు, స్పిల్ వే స్లాబ్ పనులను నిలిపివేసిన అధికారులు

    గోదావరి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి పనులు ప్రారంభిస్తాం -నాగిరెడ్డి,పోలవరం ప్రాజెక్ట్, SE

  • ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణ‌మ్మ ప‌ర‌వాళ్లు
    15 Aug 2020 1:52 PM GMT

    ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణ‌మ్మ ప‌ర‌వాళ్లు

    విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వస్తోందని  అప్రమత్తంగా ఉండాలని నదీ పరివాహక ప్రాంత తహసీల్దార్లను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు

    మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడులో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం

    ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశాం

    ఇరిగేషన్ అధికారులు

    ప్రకాశం బ్యారేజ్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు భారీ వరద వస్తోంది

    ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను అడుగుమేర ఎత్తి.. 80 వేల క్యూసెక్కుల నీరు విడుదల

    ఇన్ ఫ్లో 77 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 44 వేల క్యూసెక్కులుగా ఉంది

    తూర్పు, పశ్చిమ కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల

  • 15 Aug 2020 12:33 PM GMT

    విజయనగరం:

    - స్వర్ణముఖి నదిలో పడి వ్యక్తి మృతి. మద్యం మత్తులో పడి వుంటాడని అనుమానం.

    - మృతుడు మక్కువ గ్రామానికి చెందిన మధుర నాగరాజు(60)గా గుర్తింపు.

  • 15 Aug 2020 11:01 AM GMT

    కాకినాడలో జిల్లా ఇన్ చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్

    తూర్పుగోదావరి :

    - ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారు..

    - కరోనా వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందిస్తున్నారు..

    - ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పేరు పొందిన తూర్పుగోదావరి జిల్లాకు ఇన్ చార్జి మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను..

    - ఎటువంటి అరమరికలు లేకుండా అధికారులు, నాయకులతో కలిసి కట్టుగా పనిచేస్తాను..

    - జగన్ ఆశయం కోసం పనిచేస్తూ సమర్ధవంతమైన పరిపాలన అందిస్తాం..

    - అభివృద్ధి పదంలో జిల్లాలను ముందుకు నడిపిస్తాం..

    - గత ప్రభుత్వం చూపించిన గ్రాఫిక్స్ ను నమ్మి అమరావతి రైతులు బాధపడుతున్న మాట వాస్తవమే..

    - కాని అమరావతికి భూములు ఇచ్చిన ఏ ఒక్కరైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..

  • 15 Aug 2020 10:05 AM GMT

    చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని ఫైర్..

    శ్రీకాకుళం జిల్లా:

    - ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జగన్ యజ్ఞం చేస్తుంటే..

    - చంద్రబాబు రాక్షసుడులా యజ్ఞంలో నెత్తురు పోస్తున్నాడు..

    - పరిపాలన వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని జగన్ సంకల్పించారు..

    - ప్రతీ పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్ ఆకాంక్ష..

    - ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎన్నికలు ముగిసిన నాటి నుండి జగన్ కృషి చేస్తున్నారు..

    - ప్రజల్లో జగన్ దేవుడు అయిపోతాడాని చంద్రబాబు అసూయ..

    - జీర్ణించుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు..

    - ఏదైనా కేసు వచ్చినప్పుడు విచారణ జరపడానికి కోర్టులు నిర్ణయించడం సహజం..

    - అందులో భాగంగానే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటాయి..

    - ఏది ఏమైనా డిసెంబర్ 21 నాటికి పేదలకు పక్కా ఇళ్లు ఇచ్చి తీరుతాం..

  • 15 Aug 2020 10:02 AM GMT

    కర్నూలు జిల్లా శ్రీశైలం:

    - శ్రీశైల క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో శిఖరం సమీపాన రోడ్డు ప్రమాదం

    - శ్రీశైలం దర్శనానికి వస్తున్న యాత్రికుల కారుని జీపు ఢీకొనడంతో ఇద్దరు మహిళల కి తీవ్ర గాయాలు ఒక మహిళ పరిస్థితి విషమం

    - శ్రీశైల ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రుల తరలింపు

  • 15 Aug 2020 10:01 AM GMT

    కొండా వెంకటప్పయ్య కాలనీలో దారుణం..

    గుంటూరు:

    - కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన తండ్రి

    - హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తండ్రి

    - భార్య చనిపోవటంతో వేరే మహిళతో సహజీవనం

    - ప్రశ్నించిన కుమారుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం

    - కాలిన గాయాలతో జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న యువకుడు

  • 15 Aug 2020 9:52 AM GMT

    శ్రీకాకుళం జిల్లా:

    - అరసవల్లి సూర్య భగవానుడిని దర్ధించుకున్న మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు..

    - తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా సూర్య దేవుని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి..

  • తిరుమలలో  స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు
    15 Aug 2020 9:41 AM GMT

    తిరుమలలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

    తిరుమల: తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీటీడీ

    జేఈవో క్యాంపు కార్యాలయం గోకులంలో జాతీయ జండాను ఎగురవేసిన టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి

    కరోనా వ్యాప్తి సమయంలో టీటీడీ ఉద్యోగుల సేవలు ప్రసంశనీయం

    దేశంలో ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ తెరవలేదు,

    తెరిచి నా మధ్యలో కొన్నిరోజులు దర్శనాలు ఆపారు

    టిటిడి ఒక్కటే జూన్ 8నుంచి నిరాఘాటంగా దర్శనాలను కొనసాగిస్తోంది

    టీటీడీ ఉద్యోగులు చేయితతోనే సాధ్యమౌతోంది

    ఏవి ధర్మారెడ్డి,

    టీటీడీ అదనపు ఈవో

Print Article
Next Story
More Stories