Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ధోనీ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిం చిన  సీఎం జగన్
    15 Aug 2020 5:22 PM GMT

    ధోనీ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిం చిన సీఎం జగన్

    అమరావతి: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపి సీఎం జగన్

    ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్ తరాల వారికి ఆదర్శ వంతమైన క్రికెట్ అందించారని ధోని ని కొనియా డిన జగన్..

    ధోనీ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిం చిన  సీఎం జగన్ 

  • అమ‌లాపురంలో క‌రోనా క‌ల్లోలం
    15 Aug 2020 5:17 PM GMT

    అమ‌లాపురంలో క‌రోనా క‌ల్లోలం

    తూర్పు గోదావరి: అమలాపురం కరోనా తో అమలాపురం లో ఆరుగురు మృతి.....

    కిమ్స్ లో ఒక్కరు మృతి చెందగా ఏరియా ఆసుపత్రి లో అయిదుగురు చనిపోయారు..

  • లోతట్టు ప్రాంతాలకు ముంపు ప్రమాదం
    15 Aug 2020 5:14 PM GMT

    లోతట్టు ప్రాంతాలకు ముంపు ప్రమాదం

    విజయవాడ: గత అనుభవం దృష్ట్యా ప్రకాశం బ్యారేజి వద్ద 1.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లోతట్టు ప్రాంతాలకు ముంపు ప్రమాదం 

    50వేల క్యూసెక్కులను వరద పెరుగుదలను బట్టి దిగువకు వదులుతున్న అధికారులు 

    ప్రమాద స్ధాయికి చేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు

    లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్న అధికారులు

  • కృష్ణానదికి కొనసాగుతున్న వరద
    15 Aug 2020 5:11 PM GMT

    కృష్ణానదికి కొనసాగుతున్న వరద

    విజయవాడ: కృష్ణానదికి మున్నేరు వరద పెరుగుతోంది

    ప్రస్తుతం 92వేల క్యూసెక్కుల రికార్డు

    వత్సవాయి మండలం లింగాల వద్ద లో లెవెల్ కాజ్ వే సెన్సిటివ్ గా గుర్తింపు

    పెనుగంచిప్రోలు వద్ద కూడా లో లెవెల్ కాజ్ వే సెన్సిటివ్ గా గుర్తింపు

  • నాటు సారా స్థావరాలపై పోలీసుల మెరుపుదాడులు
    15 Aug 2020 5:09 PM GMT

    నాటు సారా స్థావరాలపై పోలీసుల మెరుపుదాడులు

    కృష్ణాజిల్లా: అవనిగడ్డ సర్కిల్ పరిధిలో నాటు సారా స్థావరాలపై పోలీసుల మెరుపుదాడులు

    అవనిగడ్డ స్టేషన్ పరిధిలో తుంగాలవారి పాలెం లంకలో దొంగతనంగా సారా తయారు చేస్తున్న స్థావరాలను ధ్వంసం చేసి ఆరు గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అవనిగడ్డ ఎస్సై సందీప్

    వారి వద్ద నుంచి 700 లీటర్ల బెల్లపు ఊట 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    నాగాయలంక స్టేషన్ పరిధిలో సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న నాగాయలంక ఎస్సై శ్రీనివాస్

  • గోదావ‌రిలో పెరుగుతున్న నీటి మ‌ట్టం.భారీగా ..వరద నీరు విడుదల
    15 Aug 2020 5:07 PM GMT

    గోదావ‌రిలో పెరుగుతున్న నీటి మ‌ట్టం.భారీగా ..వరద నీరు విడుదల

    తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం అప్పర్ స్ట్రీమ్ లో 27.8 మీటర్ల గోదావరి వరద నీటిమట్టం

    11లక్షల 66వేల క్యూసెక్కుల డిశ్చార్జి

    డొంకరాయి మెయిన్ డ్యాం నుంచి 33వేల 365 క్యూసెక్కుల వరద నీరు విడుదల

    .

  • 15 Aug 2020 5:03 PM GMT

    ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పితృవియోగం

    తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పితృవియోగం

    దొరబాబు తండ్రి  సర్పవరం సొసైటీ  మాజీ అధ్యక్షుడు  పెండెం పెద వీర్రాఘవరావు (94) మృతి

    కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే అంత్య క్రియలకు ఏర్పాట్లు

  • రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం
    15 Aug 2020 4:58 PM GMT

    రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం

    తూర్పు గోదావరి జిల్లా: గోకవరం మండలం గుమ్మల్ల దొడ్డి HPCL వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం

    ట్రాఫిక్ కు అంతరాయం, ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్,పట్టించుకోని అధికారులు, పోలీసులు.

    ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి రంపచోడవరం వెళ్లే రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం

    సమయానికి వాహదారులు లేకపోవడంతో తృటిలో తప్పిన ప్రమాదం

  • శ్రీకాకుళంలో భారీగా ఒరిస్సా మద్యం పట్టివేత..
    15 Aug 2020 4:57 PM GMT

    శ్రీకాకుళంలో భారీగా ఒరిస్సా మద్యం పట్టివేత..

    శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో భారీగా ఒరిస్సా మద్యం పట్టివేత..

    అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న టెక్కలి పోలీసులు..

    వహానంలో 1001 ఒరిస్సా మద్యం సీసాలు లభ్యం..

    8 మంది అరెస్టు.. లక్ష రూపాయలు నగదు, ఒక కారు, నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్..

    పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్షన్నర ఉండవచ్చని అంచనా..

  • వర్షం కారణంగా ఆదివారం కర్వ్యూ ఎత్తివేత
    15 Aug 2020 4:55 PM GMT

    వర్షం కారణంగా ఆదివారం కర్వ్యూ ఎత్తివేత

    తూర్పుగోదావ‌రి జిల్లాలో వర్షం కారణంగా ఆదివారం కర్వ్యూ ఎత్తివేత

    రేపు యథాతథంగా మాంసం దుకాణాలు,షాపులు తెరుచుకోవచ్చు

    జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

Print Article
Next Story
More Stories