Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Aug 2020 7:42 AM IST
రాజమండ్రి వద్ద పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి
తూర్పుగోదావరి -రాజమండ్రి
- ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద దిగువకు విడుదలవుతున్న 6లక్షల 50వేల క్యూసెక్కులు
- ధవలేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లను పూర్తిగా ఎత్తేసిన ఇరిగేషన్ అధికారులు
- గేట్లన్నీ ఎత్తేయడంతో బ్యారేజ్ వద్ద 8.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- 11.75 అడుగులకు చేరుకుంటే మొదటి వరద ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు చేస్తారు..
- ఉదయానికి మరింతగా పెరగనున్న వరద డిశ్చార్జి
- పోలవరం కాఫర్ డ్యాం ఎగువ దేవీపట్నం లో వరద పరవళ్ళు




