Live Updates: ఈరోజు (సెప్టెంబర్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13ప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 13 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.10-53 వరకు తదుపరి ద్వాదశి | పునర్వసు నక్షత్రం మ.1-22వరకు తదుపరి పుష్యమి | అమృత ఘడియలు: ఉ.10-54 నుంచి 12-32 వరకు | వర్జ్యం: రా.9-21 నుంచి 10-57 వరకు | దుర్ముహూర్తం: సా.4-25 నుంచి 5-14 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 Sept 2020 11:29 AM IST
Amaravati updates: రాష్ట్రంలోని పోలీసులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్....
అమరావతి..
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు సూచనలు చేయనున్న డీజీపీ గౌతమ్ సవాంగ్..
-రెండు రోజుల్లో దేవాలయాల జియో ప్యాకింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు..
-దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు పై సూచనలు..
-గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలి..
-దేవాలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు..
-మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలి..
-ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..
-ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్లు ఏర్పాటు చేయాలి..
-నిరంతరం దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పాయింట్ బుక్ ను స్థానిక పోలీస్ అధికారులు పర్యవేక్షించాలి..
-అగ్ని ప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు..
-రాష్ట్రంలోని ప్రతి ఒక్క దేవాలయాల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సిటీ ఎన్ఫోర్స్మెంట్ ఆక్ట్ 2013 నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూరక్షణ చర్యలు చేపట్టాలి..
- 13 Sept 2020 10:25 AM IST
Chittoor updates: యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్నయువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు..
-యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లికి చెందిన యువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి (29)ని అరెస్టు చేసిన పోలీసులు
-తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపద చాలనే ఆశతో తొలుత కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సీసాలు తెచ్చి విక్రయిస్తూ నాటు సారా తయారీ
-తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీ పంలోని నివాసగృహాల్లో ఒక అద్దె గదిలో స్వయంగా సారా తయారు చేస్తున్న ఇంజనీరు
-ఇంజినీరింగ్ చదివాక కొంత కాలానికి ఐటీ రంగం వస్తువులను మలేషియాకు దిగుమతి దిగుమతులు చేస్తూ నష్టోవమడంతో త్వరగా డబ్బులు సంపాయించడం కోసం ఈ దారిని ఎంచుకున్న వంశీకృష్ణారెడ్డి..
- 13 Sept 2020 10:18 AM IST
Kalahastheeswara updates: కాళహస్తీశ్వరాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్ చేసిన దేవస్థానం అధికారులు..
చిత్తూరు..
-కాళహస్తీశ్వరాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు 8 కిలోల బరువున్న శివుడు, నందీశ్వరుని విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్ చేసిన దేవస్థానం అధికారులు
-భద్రత ఉన్నా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘటనపై సమగ్ర విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం
-పోలీసు లకు ఫిర్యాదు చేసిన ఈఓ..
- 13 Sept 2020 9:51 AM IST
Amaravati updates: నేడు మెడికల్, డెంటల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్..
అమరావతి..
-రాష్ట్రంలో ఈ పరీక్షకు 61,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 151 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు
-మేలో జరగాల్సిన నీట్ పరీక్ష కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసిన అధికారులు
-మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్ష
-కరోనా నేపథ్యంలో విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
-గడువు ముగిస్తే పరీక్ష అనుమతించరు
-పరీక్ష ముగిసేవరకు విద్యార్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు
-పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టిఎ వెబ్ సైట్ నుంచి హాల్ డౌన్లోడ్ చేసుకోవాలి
-అడ్మిట్ కార్డులోని కోవిడ్ -19 సెల్స్ డిక్లరేషన్లో వివరాలు నమోదు చేసి వెంట తెచ్చుకోవాలి
-డ్రెస్ కోడ్ కంపల్సరీ..
- 13 Sept 2020 9:45 AM IST
Antarvedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి స్వామివారికి కొత్త రథం తయారీకి రావులపాలెం అడవిలో నాణ్యమైన టేకు కలప ఎంపిక..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
అంతర్వేది ఫాలోఆఫ్
-ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రథం పనులు ప్రారంభానికి దేవదాయశాఖ అధికారులు సన్నాహాలు
-రాష్ట్రంలో వివిధ దేవాలయాలకు 80 రథాలు తయారు చేసిన అనుభవం వున్న గణపతి ఆచార్యులకు ఈ రథం నిర్మాణ బాధ్యతలు
-అంతర్వేది రథం దగ్ధం ఘటన పై సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఆలయం మరింత కట్టుదిట్టం చేసిన బందోబస్తు
-రథం దగ్ధమైన షెడ్డు చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసిన పోలీసులు.







