Live Updates: ఈరోజు (సెప్టెంబర్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 12 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | దశమి (రా.11-18 వరకు) తదుపరి ఏకాదశి | ఆర్ద్ర నక్షత్రం (మ.12-53 వరకు) తదుపరి పునర్వసు | అమృత ఘడియలు: లేవు | వర్జ్యం: రా.1-07 నుంచి 2-45 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-50 నుంచి 7-27 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Sept 2020 9:31 AM IST
Amaravati Updates: ప్రధాన నగరాల్లో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు
అమరావతి
- ఏపీలో మే 21 నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి విదితమే
- ఈ నెల 20 నుంచి ప్రధాన నగరాల్లో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు
- ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు ఉండడంతో నిర్ణయం
- 10 లక్షల మంది పరీక్షలు రాస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ ఏర్పాట్లు
- సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలుండడంతో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక




