Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Nov 2020 8:53 AM IST
Anantapur Updates: వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు..
అనంతపురం:
-ఎస్కే యూనివర్సిటీ లో వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు.
-రెండేళ్లుగా విధులకు హాజరు కాని సిద్దయ్య
-కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల ధ్రువపత్రం సమర్పణ
-విచారణ లో ఎటువంటి అనారోగ్యం లేదని నిర్ధారణ.
- 12 Nov 2020 8:51 AM IST
Anantapur Updates: ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు..
అనంతపురం..
-అనంతపురం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు
-2019 - 2020 సంవత్సరానికి ఉత్తమ అవార్డుకు ఎంపికైన రామాంజనేయ గౌడ్
- 12 Nov 2020 8:48 AM IST
Anantapur Updates: మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..
అనంతపురం:
-సోమందేపల్లె లో మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.
-పలుచోట్ల 50శాతానికి పైగా పట్టు ముడిసరుకు వినియోగిస్తున్నారని గుర్తించిన అధికారులు
- 12 Nov 2020 8:31 AM IST
Kadapa Updates: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కేసులో కదలిక...
కడప :
-మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో కదలిక...
-హైకోర్టు ఆదేశాలతో మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న సిబిఐ...
-వివేకా హత్యకేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు...
-రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు తిరిగి జిల్లాకు వచ్చి అవకాశం
-జిల్లాకు వచ్చిన అనంతరం పులివెందుల కోర్టు నుంచి రికార్డులు తీసుకునే అవకాశం ...
-ముగ్గురు అనుమానితుల నార్కో పరీక్షల నివేదిక, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ వివరాలను కూడా పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం...
- 12 Nov 2020 8:28 AM IST
Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,792 మంది భక్తులు.
-తలనీలాలు సమర్పించిన 9,896 మంది భక్తులు.
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు.








