Top
logo

Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 12 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అష్టమి(ఉ.07-58 వరకు) తదుపరి నవమి; కృత్తిక నక్షత్రం (రా. 01-16 వరకు) తదుపరి రోహిణి నక్షత్రం, అమృత ఘడియలు (రా.10-39 నుంచి 12-23 వరకు), వర్జ్యం (మ. 12-10 నుంచి 1-55 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి 12-30 వరకు) రాహుకాలం (మ.12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-45 సూర్యాస్తమయం సా.6-25

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • ఆ బాధిత కుటుంబానికి 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి: ద‌ళిత‌నేత‌లు
  12 Aug 2020 2:49 PM GMT

  ఆ బాధిత కుటుంబానికి 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి: ద‌ళిత‌నేత‌లు

  ప్రకాశం జిల్లా: రిమ్స్ హాస్పిటల్ వద్ద కుక్కలు పీక్కొని తిని శవమై కనిపించిన దళితుడు ఇత్తడి కాంతారావు కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం మంజూరు చేయాలి

  కాంతారావు మరణానికి కారణమైన విధినిర్వహణలో ఉన్న బిట్రగుంట గ్రామ సచివాలయం సిబ్బంది వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

  మృతిపై విచారణ చేపట్టిన రిమ్స్ డాక్టర్లు ఓపి నమోదు పై ఆరా

  రిమ్స్ హాస్పిటల్ సూపర్డెంట్ కలిసిన వారి కుటుంబ సభ్యులు మరియు దళిత సంఘ నాయకులు నీలం నాగేంద్రం దళిత నాయకులు డిమాండ్.

 • చెన్నై ఎయిర్ పోర్ట్ లో డ్రగ్స్ పట్టివేత
  12 Aug 2020 2:40 PM GMT

  చెన్నై ఎయిర్ పోర్ట్ లో డ్రగ్స్ పట్టివేత

   చెన్నై: దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 1.65 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

  నెదర్లాండ్ నుంచి కాంచీపురం అడ్రస్ కు రెండు పార్శిళ్లు, బెల్జియం నుంచి ఎపి అడ్రస్ కు రెండు పార్శిళ్లు పంపినట్టు గుర్తించిన అధికారులు

  ఎపిలో ఓ యువకున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

 • క్రమేణా పెరుగుతున్న గోదావరి ఉధృతి
  12 Aug 2020 8:46 AM GMT

  క్రమేణా పెరుగుతున్న గోదావరి ఉధృతి

  తూర్పుగోదావరి - రాజమండ్రి: ఎగువ పరివాహాక, ఏజన్సీ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు

  ధవలేశ్వరం బ్యారేజ్ గేట్ల నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్న 2లక్షల 50వేల క్యూసెక్కులు

  సాయంత్రానికి మూడున్నర లక్షల వరకూ ఇన్ ఫ్లో చేరుకునే అవకాశం

  పోలవరం కాఫర్ డ్యాం ఎగువ ముంపు మండలం దేవీపట్నం లోని లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

  4లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుకుంటే కొన్ని ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి

  భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 27.10 అడుగులు

  ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 10. 15 అడుగుల వరద నీటిమట్టం

  ధవలేశ్వరం బ్యారేజ్ వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

  తెలంగాణ లో గోదావరి మేడిగడ్డ నుంచి దిగువకు వరదనీరు వదిలే అవకాశాలున్నాయని చెబుతున్న ఇరిగేషన్ అధికారులు..

 • 12 Aug 2020 4:19 AM GMT

  - తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం

  - పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

  - వి.ఆర్ పురం మండలం అన్నవరం వాగులో ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

  - వరదనీరు వంతెనపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం

 • 12 Aug 2020 3:53 AM GMT

  నెల్లూరులో కోవిడ్ తో ఈ తెల్లవారుఝామున ఓ విలేకరి మృతి..

  నెల్లూరు:

  - నెల్లూరులో కోవిడ్ తో ఈతెల్లవారుఝామున ఓ విలేకరి మృతి.

  - స్థానిక పత్రికలో పనిచేస్తున్న దినేష్ మూర్తీ(42) కన్నుమూత.

  - నాలుగురోజులుగా జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న మూర్తీ.

  - ఆక్సిజన్ అందక మృత్యువాత పడినట్లు కుటుంబసభ్యులు వెల్లడి.

  - గతంలో పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేసిన మూర్తీ.

 • 12 Aug 2020 3:03 AM GMT

  జాతీయం

  - జమ్మూ-కాశ్మీర్ లోని పుల్వామాలో భద్రతాదళాలు, తీవ్రవాదులకు మధ్య హోరా హోరీ ఎన్ కౌంటర్

  - ఒక తీవ్రవాది హతం , ఒక ఆర్మీ జవానుకు గాయాలు

  - కొనసాగుతున్న ఎన్ కౌంటర్

 • 12 Aug 2020 2:32 AM GMT

  కరోనా భారినపడి కోలుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.

  ప్రకాశం జిల్లా,

  - నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్.

  - కోవిడ్ 19భారిన పడటంతో గత 10రోజుల క్రితం హాస్పిటల్లో చేరిన కర్ణం బలరాం అతని కుమారుడు వెంకటేష్.

  - వైద్యపరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ గా వైద్యుల నిర్ధారణ.

  - కొన్నిరోజుల పాటు హైదరాబాద్ లో హొం క్వారంటైన్ కె పరిమితం కానున్న కర్ణం.

 • 12 Aug 2020 2:31 AM GMT

  శ్రీకాకుళం జిల్లా..

  - నేడు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లాకు రాక..

  - ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సారి జిల్లాకు రానున్న ధర్మాన కృష్ణదాస్..

  - ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్న వైసిపి శ్రేణులు..

 • 12 Aug 2020 1:53 AM GMT

  శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న వరద

  కర్నూలు జిల్లా

  - ఇన్ ఫ్లో : 37,936 క్యూసెక్కులు

  - ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు

  - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

  - ప్రస్తుతం : 865.10 అడుగులు

  - నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు

  - ప్రస్తుతం : 122.7178 టిఎంసీలు

  - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

 • 12 Aug 2020 1:52 AM GMT

  విశాఖ సీపీ ఆర్కే మీనా బదిలీ..

  విశాఖ...

  - విశాఖ సిటీ పోలీస్ కమిషనర్  ఆర్ కె మీనా బదిలీ ...

  - 2000 i p s బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ సిన్హా నియమితులు అయ్యారు..

  - సీన్హా ప్రస్తుతం రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఐజీ హోదాలో పని చేస్తున్నారు..

  - కేంద్ర స్థాయి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారు...

  - మూడు రాజధానుల ప్రతిపాదన నేపధ్యంలో విశాఖ కు సిన్హా ను బదిలీ చేసినట్లు సమాచారం...

Next Story