Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 12 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అష్టమి(ఉ.07-58 వరకు) తదుపరి నవమి; కృత్తిక నక్షత్రం (రా. 01-16 వరకు) తదుపరి రోహిణి నక్షత్రం, అమృత ఘడియలు (రా.10-39 నుంచి 12-23 వరకు), వర్జ్యం (మ. 12-10 నుంచి 1-55 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి 12-30 వరకు) రాహుకాలం (మ.12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-45 సూర్యాస్తమయం సా.6-25
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Aug 2020 7:11 AM IST
అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు.
అనంతపురం:
- నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం.
- జిల్లా లో ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తి.
- రైతులకు గిట్టుబాటు ధర కలిగే అవకాశం.
-ఎంపీ తలారి రంగయ్య
- 12 Aug 2020 7:10 AM IST
అనంతపురం: జిల్లాలో 1,83,883 మందికి జగనన్న చేయూత.
జిల్లా వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్య వయస్సు కల్గిన మహిళల ఎంపిక.
:నర్సింహారెడ్డి, డిఆర్డీఏ, వెలుగు పీడీ
- 12 Aug 2020 7:09 AM IST
అనంతపురం: ధర్మవరం- పాకాల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డ్ ఆమోదం: ఆలోక్ తివారి, డిఆర్ ఎం, గుంతకల్లు.
ధర్మవరం-పాకాల సెక్షన్ లో 227 కిలో మీటర్ల డబుల్ లైన్ పనులపై రూ.1816 కోట్ల అంచనాతో సర్వే : ఆలోక్ తివారి, డిఆర్ ఎం, గుంతకల్లు.
- 12 Aug 2020 7:09 AM IST
కడప :
రైల్వేకోడురు మండలం బాలుపల్లె అటవీ ప్రాంతంలొ అటవీశాఖాధికారుల కూంబింగ్
అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగల పట్టివేత...
ఆరుగురు అరెస్టు
- 12 Aug 2020 7:07 AM IST
స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఈరోజు తుది నివేదికలు సమర్పించనున్న కమిటీలు
విజయవాడ
- ఏపీ మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపిన స్వర్ణప్యాలెస్ దుర్ఘటన
- నేడు తుది నివేదిక సమర్పించనున్న కమిటీలు
- నిన్న రాత్రికే సిద్ధమైన నివేదికలు
- స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో విస్తుపోయే నిజాలు
- నివాస భవనానికి అనుమతులతో హోటల్ నిర్మాణం
- అగ్ని ప్రమాదాలను నిలువరించే పరికరాలు నిల్
- పనిచేయని స్మోక్ డిటెక్టర్, సెక్యూరిటీ అలారం, ఎమర్జెన్సీ లైట్లు
- అత్యవసర మార్గం చెక్కలతో మూసివేసినట్టు గుర్తించిన అధికారులు
- ఘటన బాధితులలో 26మందికి కోవిడ్ నెగెటివ్
- రెండుసార్లు కోవిడ్ నెగెటివ్ వచ్చినా, నిమ్ముచేరిందని డిశ్చార్జి నిలపడంతో ఒకరి మరణం
- తమ నివేదికను జిల్లా కలెక్టర్ ముందుంచిన జిల్లా కమిటీ
- ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
- పరారీలో రమేష్ హాస్పిటల్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాలు
- 12 Aug 2020 7:04 AM IST
ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం-
తూర్పుగోదావరి -రాజమండ్రి
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాదారులపై 78 కేసులు నమోదు చేశాం
- 294 మందిని అరెస్టు చేసి 212 వాహనాలు, 32,409 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నాం
- కొంతమంది స్థానిక నాయకుల అండతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అది శ్రేయస్కరం కాదు
- రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్
- 12 Aug 2020 7:04 AM IST
తూర్పుగోదావరి
- రాజమండ్రి - కొవ్వూరు మధ్య రోడ్డు కం రైలు బ్రిడ్జి పై రాకపోకలకు అనుమతి
- కరోనా కేసుల విస్తృతి నేపధ్యంలో కొద్దిరోజులుగా నిలిపివేసిన రాకపోకలు పునరుద్దరణ
- ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అత్యవసరాలకే బయటకు వెళ్ళాలన్న అధికారులు




