Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Amaravati updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలి.. నిమ్మకాయల చినరాజప్ప..
  11 Sep 2020 12:30 PM GMT

  Amaravati updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలి.. నిమ్మకాయల చినరాజప్ప..

  అమరావతి..

  నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి..

  -ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం

  -హిందూ ధార్మిక క్షేత్రాలపై ముమ్మాటికీ దాడే

  -16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అక్రమాలపైనా విచారణ జరపాలి

 • Vijayawada updates: సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..
  11 Sep 2020 12:26 PM GMT

  Vijayawada updates: సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..

  విజయవాడ..

  డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..

  -రాష్ట్రంలోని డ్వాక్రా మహిలలందరికీ ఈరోజు పండుగ రోజు

  -27 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు

  -అన్న మాట ప్రకారం సీఎం జగన్ 4 విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు

  -88 లక్షల మంది మహిళల నమ్మకాన్ని సీఎం నిలబెట్టారు

  -కరోనా కష్టకాలంలోనూ మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు

  -1400 కోట్ల సున్నా వడ్డీ నిధులిచ్చి డ్వాక్రా సంఘాలకు ఊపిరి పోశారు

  -అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో

  -పిల్లలను చదివించుకునే అవకాశాన్ని మహిళలకిచ్చారు

  -దిశ చట్టం, 30 లక్షల ఇళ్ల పట్టాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు

  -మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు జగన్

  -వైఎస్సార్ చేయూత తో మహిళల స్వయం ఉపాదికి అవకాశం కల్పించారు

 • National updates: ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.
  11 Sep 2020 12:18 PM GMT

  National updates: ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

  జాతీయం..

  ఎంపీ రఘురామ కృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు

  -హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

  -ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎనిమిది గంటల పాటు దీక్ష చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

  -రఘురామకృష్ణంరాజు దీక్షకు మద్దతు తెలిపిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.

  -ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి హిందువుల మనోభావాలు తెలియపరచండి నా ఈ నిరసన దీక్ష చేపట్టాను.

  -హిందూ దేవుళ్ళ విగ్రహాలు పై జరిగిన దాడిని పిచ్చివాడి చర్యగా నిర్లక్ష్యం చేయడం వల్లే అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.

  -అంతర్వేది దేవాలయ రథం దగ్ధం ఘటనతో హిందూ సమాజం మేల్కొంది.

  -సనాతన స్వదేశీ సేన పేరుతో ఒక ఐక్య పోరాట సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాము.

  -హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు మరింత బలోపేతమైన వ్యవస్థ కోసం ఆ సంస్థ పనిచేస్తుంది.

  -మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా మా సంస్థకు ఉండాలని కోరుకుంటున్నాం.

  -మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి నా రాజీనామా కోరడం పై ప్రతి సవాల్ విసిరిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

  -మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే అమరావతి రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నా.

 • National updates: మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసు దర్యాప్తు పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..
  11 Sep 2020 12:01 PM GMT

  National updates: మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసు దర్యాప్తు పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..

  జాతీయం..

  -మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తు పైన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడం పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..

  -దర్యాప్తు పై స్టే ఇవ్వడం సరికాదన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

  -అమరావతి లో ల్యాండ్ పోలింగ్ కోసం పేద ఎస్సీ ఎస్టీ ల భూములను బెదిరించి లాక్కున్న మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి పై ఎఫ్ఐఆర్   దాఖలు

  -తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నష్టపరిహారం లేకుండా సేకరిస్తుందని పేదలను బెదిరించిన నిందితులు

  -ఈ వ్యవహారం పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

  -ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు

  -నిందితుల అభ్యర్థన మేరకు కేసు దర్యాప్తు పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

  -స్టే విధించ డా న్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం

  -తదుపరి కేసు తుది విచారణ ఈనెల 22 కి వాయిదా

 • Amaravati updates: డ్వాక్రా అక్క చెల్లమ్మలకి నేడు పండగ రోజు..రోజా APIIC చైర్ పర్సన్..
  11 Sep 2020 11:39 AM GMT

  Amaravati updates: డ్వాక్రా అక్క చెల్లమ్మలకి నేడు పండగ రోజు..రోజా APIIC చైర్ పర్సన్..

  అమరావతి...

  -రోజా apiic చైర్ పర్సన్, ఎమ్మెల్యే

  -ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు..

  -మహిళల కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు..

  -90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది..

  -మహిళ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి..

  -చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగన్నకు తెలియదు..

  -మహిళలు, విద్యార్థులు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు..

  -మహిళకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు..

  -రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు..

  -దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది..

  -నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళకు అవకాశం కల్పించారు..

  -మహిళ ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా సీఎం జగన్ ఎత్తివేస్తున్నారు.

  -అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు ప్రవేయం ఉంది..

 • Srikakulam updates: దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
  11 Sep 2020 11:17 AM GMT

  Srikakulam updates: దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

  శ్రీకాకుళం జిల్లా..

  -ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

  -ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం...ఆయన మాటే ఒక చట్టం

  -వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచారు

  -త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తాం

  -కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం కాగానే పట్టాలు పంపిణీ చేపడతాం

  -జిల్లాలో తొలివిడతగా 377 కోట్లు విడుదల చేశాం

  -విమర్శలు చేసే వారికి శతకోటి నమస్కారాలు

  -ఎవరు మాటలు చెబుతున్నారో...ఎవరు చేతల్లో చేసి చూపిస్తున్నారో ప్రజలకు తెలుసు

 • 11 Sep 2020 11:07 AM GMT

  East Godavari Updates: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన మరో ఆడియో టేప్ లీక్..

  తూర్పుగోదావరి :

  -చనిపోయో ముందురోజు శ్రావణి కుటుంబ సభ్యులు, సాయితో ఇంట్లో జరిగిన గొడవను రికార్డు చేసిన దేవరాజు రెడ్డి..

  -నన్ను ప్రతీసారి తిట్టవద్దు, అందరి పేర్లు రాసి చనిపోతా, ఆరోజు రెస్టారెంట్, లిఫ్ట్ లో నాపై చెయ్యి చేసుకున్నావు, అంటు సాయితో కుటుంబ సభ్యులతో గోడలు   పడుతున్నా మాటలు రికార్డింగ్..

  -శ్రావణి దేవరాజు కు ఫోన్ చేసి అన్లో ఉంచి గోడవ అంత వినిపిస్తూ ఉండగా రికార్డర్ చేసిన దేవరాజు రెడ్డి..

  -గోడవ మధ్యలో ఫోన్ ఆన్ లో ఉందని గమనించిన కుటుంబ సభ్యులు..

  -శ్రావణి తమ్ముడు ఫోన్ తీసుకుని దేవరాజుతో ఫోన్లో గొడవలు పడినట్లు రికార్డింగ్..

  -సుమారు అరగంట కు పైగా జరిగిన సంభాషణ..

 • 11 Sep 2020 10:28 AM GMT

  Cherukuvada Sri Ranganadha Raju Comments: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాజీ మంత్రి పితానిపై కామెంట్స్..

  చెరుకువాడ శ్రీరంగనాధరాజు కామెంట్స్..

  -వైయస్ ఆర్ ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాజీ మంత్రి పితానిపై కామెంట్స్..

  -నేను గాను మా కార్యకర్తలు ఆచంట నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, నిరూపిస్తే దేనికైనా సిద్ధం

  -మాజీ మంత్రి పితాని తనయుడు చేసిన కుంభకోణానికి తండ్రికి సంభంధం లేదనడం ఎంతవరకు సమంజసం రాజకీయాలు చేయవద్దు.

  -ESI స్కామ్ లో నాణ్యత లేని నకిలీ మందులు సరఫరా చేసి ప్రజలను మోసం చేసిన దొంగలందరికి చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలుస్తున్నాడు.

  -తప్పు చేయకుంటే బయట తిరగవచ్చు ఇతర రాష్ట్రాలు వెళ్లి దాక్కునే అవసరం ఏముంది

  -కరోనా ప్రభావంతో విజయవాడలో చనిపోయిన సుమారు 10 మంది బాధితులను పరామర్శించే పరిస్తితి లేదు కానీ సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి     జగన్ పై బురద చల్లుతున్నారు

  -మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు ని కూడా అరెస్ట్ చేస్తే వారిని కూడా పరామర్శించడానికి కొమ్ముచిక్కాల వద్దుడు చంద్రబాబు

  -బీసీ కార్డు అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయడం సబబు కాదన్న మంత్రి

  -Esi స్కాములో మాజీ మంత్రి పి.ఎస్ పాత్ర ఉంది తనయుడు పాత్ర ఉంది కాని పితాని పాత్ర లేకపోవడం చాలా విచిత్రం

  -అవినీతి ఆరోపణలు లేకుండా జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

 • Amaravati updates: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీపై నిషేదం ఏడాది పాటు పొడిగింపు..
  11 Sep 2020 10:15 AM GMT

  Amaravati updates: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీపై నిషేదం ఏడాది పాటు పొడిగింపు..

  అమ‌రావ‌తి..

  -గ‌త నెల 17నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన నిషేదం..

  -అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నందున మ‌రో ఏడాది నిషేదం కొన‌సాగిస్తూ ఉత్త‌ర్వులు జారీ..

  -మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివ‌ల్యూష‌న‌రీ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ పై నిషేదం కొన‌సాగింపు..

  -గ‌త నెల 9 వ తేదీ నుంచి ఏడాది పాటు అమ‌ల్లోకి వచ్చిన నిషేదం...

 • Vizianagaram Vizianagaram updates: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు ప్రకటించిన అమ్మవారిదేవస్థానం అధికారులు..
  11 Sep 2020 9:53 AM GMT

  Vizianagaram Vizianagaram updates: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు ప్రకటించిన అమ్మవారిదేవస్థానం అధికారులు..

  విజయనగరం..

  -అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం మరియు పందిరిరాట కార్యక్రమం

  -అక్టోబర్ 22న అర్ధ మండల దీక్షలు ప్రారంభం

  -అక్టోబర్ 26న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

  -అక్టోబర్ 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం

  -నవంబర్ 3న తెప్పోత్సవం. 10న ఉయ్యాల కాంబల ఉత్సవం.11 న చండీహోమం.

  -చండీహోమం తో ముగుస్తున్న అమ్మవారి ఉత్సవాలు..

Next Story