Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Nov 2020 7:27 AM IST
Chittoor district Updates: రేణిగుంట గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...
- రేణిగుంటలో యువకుడు పై హత్యాయత్నం.
- మద్యం మత్తులో పార్థబన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు యువకులు.
- ప్రాణబయం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టిన పార్థబన్.
- గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
- ముగ్గురి లో ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈ దాడికి సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.
- 11 Nov 2020 7:24 AM IST
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,239 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 9,503 మంది భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు.





