Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha updates: విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం..
    11 Nov 2020 4:07 AM GMT

    Visakha updates: విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం..

     విశాఖ...

    - ఎంవిపి కాలనీ లో రాకేష్ అనే యువకుడిని కిడ్నాప్ ఎత్తుకెళ్లిన ఆగంతకులు

    - తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద కార్ లో తీసుకువెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

    - ఉద్యోగాలు ఇప్పిస్తానని గుంటూరు జిల్లాలో భారీగా డబ్బు వసూలు చేసిన రాకేష్

    - దాదాపుగా రూ. కోటి 50 లక్షలు వసూలు చేసిన రాకేష్

    - డబ్బు ఇచ్చిన నిరుద్యోగులకు మధ్యవర్తిగా ఉన్న రాకేష్ బంధువులు

    - నిరుద్యోగుల నుంచి రాకేష్ బంధువులకు పెరిగిన ఒత్తిడి

    - రాకేష్ ను పట్టుకొని గుంటూరు పోలీసులు కు అప్పగించేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్న పోలీసులు

    - విశాఖ పోలీసులు అదుపులో రాకేష్ , అతని బంధువులు

  • Gunter District Updates: క్రికె బెట్టింగ్ కు యువకుడు బలి, చావు బతుకుల్లో మరొక యువకుడు...
    11 Nov 2020 4:04 AM GMT

    Gunter District Updates: క్రికె బెట్టింగ్ కు యువకుడు బలి, చావు బతుకుల్లో మరొక యువకుడు...

    గుంటూరు...

    -పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరుకు చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమరయ్యలకు క్రికెట్ బెట్టింగ్ లతో లక్షల్లో   నష్టం.

    -డబ్బులకోసం బుకీల వత్తిడి.

    -బాకీలు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం.

    -బెల్లంకొండ రైల్వే ట్రాక్ వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు‌ ప్రయత్నించిన యువకులు సురేష్, కొమరయ్యలు.

    -చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపిన కొమరయ్య.

    -ఇద్దరినీ గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన బంధువులు.

    -చికిత్స పొందుతూ సురేష్ మృతి, కొమరయ్య పరిస్థితి విషమం.

    -కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బెల్లంకొండ పోలీసులు.

  • Visakha Weather Updates: కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు!
    11 Nov 2020 4:02 AM GMT

    Visakha Weather Updates: కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు!

      విశాఖ...

    - రెండు తూర్పు పవనాలు వెంట వెంట వ్యాపించటంతో కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు

    - ఉరుములు‌ మెరుపులు కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు..

    - 16,17 తేదీల్లో కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

  • Vizianagaram Updates: గుర్ల మండలం పెనుబర్తి వద్ద కారును ఢీకొన్న లారీ ఐదుగురికి తీవ్ర గాయాలు..
    11 Nov 2020 3:59 AM GMT

    Vizianagaram Updates: గుర్ల మండలం పెనుబర్తి వద్ద కారును ఢీకొన్న లారీ ఐదుగురికి తీవ్ర గాయాలు..

     విజయనగరం :

    - కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్ళ పరిస్థితి విషమం

    - జిల్లా కేంద్రాసుపత్రికి తరలింపు

    - హైదరాబాద్ నుంచి పాలకొండ శుభకార్యం నిమిత్తం వెళ్తుండగా ఘటన

  • Vijayawada Updates: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది...
    11 Nov 2020 3:55 AM GMT

    Vijayawada Updates: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది...

     విజయవాడ

    - ప్రేమిస్తున్నానని,తననే పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న ప్రేమోన్మాది అజయ్ కుమార్

    - గవర్నర్ పేట 1 డిపోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న బాధిత యువతి

    - అదే డిపోలో మెకానిక్ గా విధులు నిర్వహిస్తున్న ప్రేమోన్మాది అజయ్ కుమార్

    - కొద్దిరోజుల క్రితమే యువతికి మరో వ్యక్తితో నిశ్చయమైన వివాహం

    - తననే పెళ్లి చేసుకోవాలని లేకుంటే చంపేస్తానని యువతి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించిన ప్రేమోన్మాది

    - సత్యనారాయపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి

  • Visakha Updates: పెందుర్తిలో దారుణం...
    11 Nov 2020 3:53 AM GMT

    Visakha Updates: పెందుర్తిలో దారుణం...

     విశాఖ

    - మైనర్ బాలిక పట్ల ఓ వృద్ధుడు, యువకుడు అఘాయిత్యం

    - బాలికపై 63 ఏళ్ల సూర్యనారాయణ, 24 ఏళ్ల కార్తీక్ లైంగికంగా లోబరుచుకుని గర్భవతిని చేసిన వైనం

    - బాలికకు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి లోబరుచుకున్న వృద్దుడు, యువకుడు

    - బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించిన చికిత్స

    - బాలిక గర్భవతిగా వైద్యులు తేల్చగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

  • Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
    11 Nov 2020 3:51 AM GMT

    Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...

       నెల్లూరు :

    -- ఇన్ ఫ్లో 8566 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 6800 క్యూసెక్కులు.

    -- ప్రస్తుత నీటి మట్టం 74.664 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు

  • Amaravati Updates: కరోనా సమయంలో దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
    11 Nov 2020 3:26 AM GMT

    Amaravati Updates: కరోనా సమయంలో దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...

     అమరావతి

    - జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్

    - కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగం కు అనుమతి

    - రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచన

    - రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం

    - అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసిన ఏపిసర్కార్

    - కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశం

    - దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడోద్దని అని సూచించిన ప్రభుత్వం...

  • Vijayawada Updates: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం...
    11 Nov 2020 2:10 AM GMT

    Vijayawada Updates: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం...

      విజయవాడ

    - చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపం లోని పాత ప్రసాద్ థియేటర్లో అగ్ని ప్రమాదం

    - మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

    - థియేటర్ మూత పడటంతో తప్పిన ప్రాణ నష్టం.

    - భయాందోళన చెందిన చుట్టు పక్కల ప్రజలు.

    - ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

  • Chittoor District Updates: పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం...
    11 Nov 2020 2:02 AM GMT

    Chittoor District Updates: పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం...

      చిత్తూరు

    -- ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం

    -- ఆదివారం కాశ్మీరు సరిహద్దులో చొరబాటుదారులతో జరిగిన భీకర పోరులో వీరమరణం పొందిన జవాను ప్రవీణ్్

    -- రెండు రోజుల తరువాత స్వగ్రామానికి పార్థివ దేహం

    -- కడసారి చూపుకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతం

    -- వీర జవానుకు జేజేలు పలుకుతూ నినాదాలు

Print Article
Next Story
More Stories