Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 10 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అష్టమి మ.12-29 వరకు తదుపరి నవమి | పునర్వసు నక్షత్రం రా.08-58 వరకు తదుపరి పుష్యమి| వర్జ్యం: ఉ.08-41 నుంచి 10-19 వరకు తిరిగి తే.5-51 నుంచి 5-55 వరకు | అమృత ఘడియలు సా.06-31నుంచి 07-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-20వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 10 Oct 2020 12:12 PM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా


    సరస్వతి బ్యారేజ్


    7 గేట్లు ఎత్తిన అధికారులు


    పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు


    ప్రస్తుత సామర్థ్యం 118.00 మీటర్లు


    పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ


    ప్రస్తుత సామర్థ్యం 8.54 టీఎంసీ


    ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 16,000 క్యూసెక్కులు


  • 10 Oct 2020 12:12 PM GMT

    వ్యవసాయ, LRS బిల్లులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంపీ కోమటిరెడ్డి లేఖ



    కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.... భువనగిరి ఎంపీ.


    కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది


    రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లు ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.


    కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలు ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి.


    తెలంగాణ రాష్ట్రం కూడా వ్యవసాయ వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలి.


    ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది


    ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలి


    ప్రభుత్వం మానవత్వం తో ఆలోచించాలి


    ఇప్పటికే LRS పై ప్రజలు రోడ్డెక్కుతున్నారు


    సామాన్యుడికి పెనుభారం గా మారిన LRS ని ప్రభుత్వం రద్దు చేయాలి


    ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ఎటువంటి ఫిజులు లేకుండా LRS ను అమలు చేయలి.


    దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలి


  • 10 Oct 2020 12:11 PM GMT

    సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..


    తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ -1 ,గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల కాగా యువకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు...


    తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న యువకులకు నిరాశే మిగిలింది...


    అధిక డబ్బులు వెచ్చించి ప్రైవేట్ శిక్షణ సంస్థలో శిక్షణ పూర్తి చేసి దిక్కుతోచని స్థితిలో అయోమయంలో ఉన్నారు...


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ నూట నలభై పోస్టులకు విడుదల చేయడం జరిగింది....


    ఆ తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, పోస్టులు భర్తీ చేయకపోవడం దారుణం...


    దీంతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు...


    కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ చేయలేదు...


    వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా శాఖల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి...


  • 10 Oct 2020 12:10 PM GMT

    గెల్లు శ్రీనివాస్ యాదవ్ TRSV రాష్ట్ర అధ్యక్షుడు @ తెలంగాణ భవన్


    Abvp, Nsui విద్యార్ధి సంఘాలు జాతీయ సమస్యలు పరిష్కరించకుండా దుబ్బాక ఎన్నికల కోసమే వారు నిరసనలు చేస్తున్నారు...


    ఈబీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు ఇది ఇప్పటికి అమలు కాలేదు దీనిపై abvp మాట్లాడారు....


    ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో లోని బెనారస్ యూనివర్సిటీ లో కూడా ఈబిసి రిజర్వేషన్లు అమలు కావడం లేదు..


    దేశ వ్యాప్తంగా 27 శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తున్నారు ఇదే బెనారస్ యూనివర్సిటీ లో ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ కూడా లేరు..


    హర్యానా, గుజరాత్ లలో కూడా ఈ బిసి రిజర్వేషన్లు అమలు కావడం లేదు..


    దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నీట్ ఎక్సమ్ కు కూడా రిజర్వేషన్లు అమలు కావడం లేదు..


    పీజీ, యూజి మెడికల్ ,డెంటల్ లో కూడా రిజర్వేషన్లు ఓబీసీ లకు అమలు కావడం లేదు..


    విద్యా, ఉద్యోగ రంగంలో కూడా కనీసం 12 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు...


    బీజేపీ ఓబీసీ ల మీద కపట ప్రేమ నటిస్తుంది..


    ఇప్పటి ఓబీసీ గా ఎన్నికైన బీజేపీ నేత లక్ష్మణ్ ఓబీసీ రిజర్వేషన్లు పై ఎందుకు మాట్లాడలేదు...


    రాష్ట్రంలో ప్రజలు బీజేపీ నేతలను నమ్మే పరిస్థితి లేదు..


    ప్రయివేటు యూనివర్సిటీ లలో రిజర్వేషన్లు లేకపోవడం గతంలో ఎన్డీయే ప్రభుత్వం నుండే అమలులో ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు..


  • 10 Oct 2020 9:39 AM GMT

    వరంగల్ అర్బన్.


    హన్మకొండ తెలంగాణ జాన్ సమితి పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రో. కోదండరామ్ @ ప్రెస్ మీట్


    పాత ఓటరు లిస్టు రద్దు కావడం వల్ల అందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి


    ఎమ్మెల్సీ ఎన్నికల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మేము సహకరిస్తాం


    ప్రభుత్వ విధానాలతో ఆస్తులకు విలువలేకుండా పోయింది


    డబ్బులు లేని సమయంలో ఎల్ ఆర్ ఎస్ కట్టాలని ప్రభుత్వం వేధిస్తోంది


    ఆస్తుల రెమ్యునేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది


    ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు


    సిగ్నల్ లేక చెట్లు ఎక్కి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు


    లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ లేదు


    ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చారు


    తెలంగాణ తెచ్చిన ఆకాంక్షను అణచివేశారు


    అమరుల త్యాగాలను కాపాడుకునేందుకు టీజేఎస్ ముందుకొచ్చింది


    మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది


    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కు మద్దతు ఇవ్వండి


    నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు


  • 10 Oct 2020 7:39 AM GMT

    మహబూబాబాద్ జిల్లా:


    ఇంటింటి సర్వే కి వెళ్ళిన అధికారులను గృహ నిర్బంధించిన గ్రామస్తులు


    తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఇంటింటి సర్వే నమోదు కార్యక్రమానికి వెళ్లిన గ్రామ కార్యదర్శి తో పాటు కారోబార్ లను గృహ నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్, గ్రామస్తులు


    LRS తో పాటు గ్రామాలలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే నిలిపివేయాలని కోరుతూ అధికారులను గృహనిర్బంధం చేశారు గ్రామస్తులు.


  • 10 Oct 2020 7:39 AM GMT

    యాదాద్రి -భువనగిరి జిల్లా:-


    బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి..


    మంత్రి కి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు కార్యకర్తలు...


    కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి..


    కరోనా సమయంలో అందరూ విధిగా మాస్క్ లు ధరించాలని సూచన..


    ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా 9 ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించారు.


    తెలంగాణలోని.. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు, సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష చేస్తా..


    ఎయిమ్స్ వైద్యులు, సిబ్బందితో కలిసి.. AIIMS ప్రాంగణంలో మొక్క నాటిన మంత్రి కిషన్ రెడ్డి.


    AIIMS వైద్యులతో కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం..


  • 10 Oct 2020 4:55 AM GMT

    నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ ముషీరాబాద్ లో ఒక వ్యక్తి మృతి..


    ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఎదురుగా శ్రీ సాయి అపార్ట్మెంట్లో భారీగా చేరిన వర్షం నీరు...


    సెల్లర్ లో చిక్కుకొని హైకోర్టు లో పనిచేసే రాజ్ కుమార్ మృతి..


    నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో బయటికి వెళ్లేందుకు కిందికి దిగిన వ్యక్తి సెల్లార్ లో ప్రమాదవశాత్తు మృతి ‌...


    రాజ్ కుమార్ కుమారుని ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు


  • 10 Oct 2020 4:54 AM GMT

    హైదరాబాద్


    డేటింగ్ యాప్ పేరుతో వైద్యుని మోసం చేసిన సైబర్ చీటర్స్..


    సికింద్రాబాద్ పద్మారావు నగర్ కు చెందిన వైద్యుడు మూడు నెలల క్రితం లోకాంటో యాప్ లో ఓ యాడ్ చూసి కాల్ చేసాడు..


    ఆన్లైన్ డేటింగ్ పేరుతో అమ్మాయిల ఫోటోలు, వీడియోలు పంపుతు నగదు వేయించుకున్న సైబర్ నేరగాళ్లు..


    అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తూ, ఫోటోలు చూపిస్తూ అమౌంట్ వేయించుకున్న సైబర్ చీట్స్..


    మూడు నెలల్లో 41 లక్షల నగదును సైబర్ చిటర్స్ అకౌంట్ లో వేసిన వైద్యుడు..


    తను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యుడు..


    సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


  • 10 Oct 2020 4:54 AM GMT

    చామకూర మల్లారెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి


    రోగులకు వీఐపీల తరహాలో చికిత్స అందించిన నాడే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేసిన వారవుతారని ఈఎస్ఐ అధికారులకు మంత్రి మల్లా రెడ్డి సూచించారు.


    ప్రతినెలా కోట్ల రూపాయల ఇండెంట్లు పంపుతున్నా... ఇప్పటికీ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


    ఈఎస్ఐ అధికారులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ క్యాంపస్​లో మంత్రి సమీక్షా సమావేశం.


    ఇకపై ప్రతినెలా రోగులకు అందించిన మందుల వివరాలను ఆన్​లైన్ లో ఉంచాలని ఆదేశించారు.


    అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన సిబ్బందిని నియమించాలి.


    ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈఎస్ఐలో సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.


Print Article
Next Story
More Stories