Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Sept 2020 8:00 AM IST
Anantapur Updates: సత్య సాయి విద్యా సంస్థల్లో ఇంటర్ ప్రవేశానికి 23న పరీక్షలు.
అనంతపురం:
- ఆన్ లైన్ లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు.
- గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే అవకాశం
- ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 26, 27, 28 తేదీల్లో ముఖాముఖి ఎంపిక
- 9 Sept 2020 7:58 AM IST
Amaravati Updates: గుడివాడ లో భారీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన మంత్రి కొడాలి.
అమరావతి
- అమరావతిలో తన దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో నిరసనప్రదర్శన, ఆందోళనలకు పిలుపు.
- పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని టీడీపీ రెచ్చోగొడుతుందంటున్న మంత్రి నాని.
- అమరావతిలో శాసన రాజధాని వద్దని మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తడంతో గుడివాడలో చేపట్టిన ఆందోళనకు పెరిగిన ప్రాధాన్యత.
- 9 Sept 2020 7:20 AM IST
Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద
కర్నూలు జిల్లా:
- ఇన్ ఫ్లో : 28,535 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 36,400 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
- ప్రస్తుత : 884.90 అడుగులు
- నీటి నిల్వ సామర్ధ్యం : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం : 215.3263 టీఎంసీలు
- కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిపివేసిన విద్యుత్ ఉత్పత్తి
- 9 Sept 2020 6:29 AM IST
TV actress Sravani death: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య
- తెలుగు సీరియల్స్ లో నటించిన శ్రావణి ఆత్మహత్య....
- మధురానగర్ లో తన నివాసంలో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య...
- మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించిన శ్రావణి ...
- శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు...





