Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Aug 2020 11:20 AM IST
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల బహిష్కరించిన కాంట్రాక్ట్ సిబ్బంది
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల బహిష్కరించిన కాంట్రాక్ట్ సిబ్బంది
రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని విధులు బహిష్కరణ
ఆసుపత్రి ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న 200 మంది సిబ్బంది
సిబ్బందికి యూనిఫామ్,బూట్లు ఇతర సామగ్రి ఇవ్వని కాంట్రాక్టర్
సాయి సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిర్వాకంతో రోడ్డెక్కిన సిబ్బంది
- 8 Aug 2020 11:10 AM IST
మహిళ దారుణ హత్య
భద్రాద్రికొత్తగూడెం మణుగూరు అంబెడ్కర్ సెంటర్ లో మహిళ దారుణ హత్య...
కత్తితో నరికి పరారైన గుర్తుతెలియని దుండగుడు పాత గొడవలు కారణమనే స్థానికుల అనుమానాలు..
- 8 Aug 2020 8:26 AM IST
సదాశివనగర్ మండలం అమర్ల బండ గ్రామంలో విషాదం
కామారెడ్డి :
- సదాశివనగర్ మండలం అమర్ల బండ గ్రామంలో విషాదం
- ఇంట్లో దండం పై దుస్తులు అరవేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై రాజశేఖర్ (15) సంవత్సరాల యువకుడు మృతి.
- 8 Aug 2020 8:25 AM IST
కామారెడ్డి :
- జిల్లా లోని అన్ని పంచాయితీ ల్లో నేటి నుంచి 15 వరకు గందగి ముక్త్ భారత్ కార్యక్రమాలు నిర్వహణ జిల్లా కలెక్టర్ శరత్.
- వారం రోజుల పాటు పంచాయితీల్లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యేక అధికారుల నియామకం.
- 8 Aug 2020 8:25 AM IST
దోమకొండ మండల కేంద్రము లో రెండవ రోజు కొనసాగుతున్న స్వచ్చంద లక్ డౌన్
కామారెడ్డి :
- నిబంధనలు అతిక్రమించిన రియలెన్సు జీయె షోరూమ్ కు ఐదువేల జరిమానా జిరక్స్ సెంటర్ వేయి రూపాయలు మరో రెండు దుకాణాలకు ఐదు వందల చొప్పున జరిమానా విధించిన గ్రామ పంచాయితీ పాలక వర్గ సభ్యులు.
- 8 Aug 2020 8:24 AM IST
కామారెడ్డి :
- మచరెడ్డి మండలము పాల్వంచ మర్రి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెట్టుకు డి కొని మహమ్మద్ గౌస్ (48) మృతి నలుగురికీ తీవ్ర గాయాలు.
- 8 Aug 2020 8:24 AM IST
పల్లె ప్రగతి పనులు వేగవంతం చేసి ఈ నెల 30 లోగా పూర్తి చేయాలి
కామారెడ్డి :
- పల్లె ప్రగతి పనులు వేగవంతం చేసి ఈ నెల 30 లోగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ శరత్.
- రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పర్యవేక్షించి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఈ నెల 15 లోగా కోతుల అవస కేంద్రాలు,30 లోగా కంపోస్ట్ షెడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచన.
- 8 Aug 2020 8:23 AM IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
నల్గొండ :
- పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.- ప్రస్తుత నీటిమట్టం : 557.60 అడుగులు.
- ఇన్ ఫ్లో :38,140 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో : 4084 క్యూసెక్కులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ : 226.8344 టీఎంసీలు.
- 8 Aug 2020 8:20 AM IST
కామారెడ్డి :
- బిక్కనుర్ మండలం లోని సిద్దరమేశ్వర్ నగర్ శివారులోని పేకాట స్థావరం పై పోలీసుల దాడి.
- పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారినుంచి 3,750 నగతు సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు.





