Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 8 Aug 2020 9:57 AM GMT

    తెలుగుదేశం నాయకులపై రాజకీయ కక్ష తోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

    అనంతపురం:

    - జేసి ప్రభాకరరెడ్డి పై ఎస్సి, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం తప్పు.

    - 68 ఏళ్ల వ్యక్తి 54రోజులు రిమాండులో ఉండి, బెయిలుపై వచ్చారు.

    - 24గంటలు గడవకముందే తిరిగి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం.

    - ఈ రకమైన వేదింపులు ప్రభుత్వానికి మంచిది కాదు

    - ట్రాఫిక్, కోవిద్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరియైన విధానం కాదు.

    - ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మీద కక్షపూరిత ధోరణిని విడనాడాలి: పయ్యావుల కేశవ్

  • 8 Aug 2020 9:55 AM GMT

    తూర్పు గోదావరి జిల్లా:

    - మండపేట వైస్సార్ సిపి కో ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు

    - మండపేట లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తోట త్రిమూర్తులు...

    - రాష్ట్రం లో సిఎం జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి. 

    - అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తాo. 

    - మీలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను...

    - ఆగష్టు15న ఆర్హులైన వారందరికీ 28 వేల కోట్లతో అద్భుతమైన కార్యక్రమం చేపట్టనున్న సిఎం జగన్

    - మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు

  • 8 Aug 2020 9:53 AM GMT

    తెలుగుదేశం నాయకులపై రాజకీయ కక్ష తోనే అక్రమ కేసులు: మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

    అనంతపురం

    - తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డిపై ఎస్సి, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం.

    - 54రోజులు రిమాండులో ఉండి, బెయిలుపై వచ్చి 24గంటలు గడవకముందే తిరిగి అరెస్టు చేయడాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నాం.

    -మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

  • 8 Aug 2020 9:50 AM GMT

    తూర్పుగోదావరి రాజమండ్రి కరోనా కేసులు ఆఫ్టేడ్

    - జిల్లాలో 30వేలు దాటిన కరోనా పాజిటీవ్ కేసులు

    - ఈరోజు కొత్తగా 1,310 పాజిటీవ్ కేసులు నమోదు

    - జిల్లాలో 30 వేల 160కి చేరిన మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

    - కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య16,148

    - కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 14వేల 250

  • 8 Aug 2020 9:49 AM GMT

    జాతీయం:

    - కరోనా చికిత్స పూర్తి చేసుకుని అభిషేక్ బచ్చన్ డిశ్ఛార్జ్

  • 8 Aug 2020 9:48 AM GMT

    అమరావతి:

    *టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...*

    *ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు ఆర్ధికంగా తీవ్రంగా నష్ట పోతున్నారు*.

    - రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 34 లక్షలు క్వింటాల్ ఉల్లి దిగుబడి వస్తోంది .

    - ఉల్లి సాగు చేసిన రైతులు పంట కొనుగోలు లేకపోవటంతో, మద్దతు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు .

    - ఎకరాకు 70 నుంచి 80 వేలు వెచ్చించి ఉల్లి పంటను వేసిన రైతులకు కన్నీరు మిగిలింది.

    - ఉల్లి పంటలు అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూల్ మార్కెట్ యార్డ్ కరోనా తీవ్రత కారణంగా మూతబడింది.

    - ప్రభుత్వం చెపుతున్నట్లుగా సచివాలయాల వద్ద కొనుగోలు జరగటం లేదు .

    - రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉల్లిపంటను రైతుల వద్ద నుండి వారి గ్రామంలోనే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

  • 8 Aug 2020 9:47 AM GMT

    ఢిల్లీ:

    👇అశోక గజపతి రాజు, మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి

    - కోజికోడ్ ఎయిర్పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉంది

    - ఈ అంతర్జాతీయ విమానాశ్రయం లో పెద్ద విమానాలు దిగేందుకు ఇది తప్పనిసరి

    - మరి రన్ వే ఎక్స్టెన్షన్ చేశారా ? లేదా అన్న విషయం నాకు తెలియదు

    - ఎయిర్ పోర్టు, ఎయిర్క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి

    - డీజిసీఎ నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది

  • 8 Aug 2020 9:46 AM GMT

    సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

    విశాఖ

    - సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

    - మరో ఇద్దరు నిందితులను కస్టడీకి అనుమతించిన కోర్ట్

    - ఎ5 డాక్టర్ తిరుమల, ఎ4 రామకృష్ణనూ కస్టడీకి

    - ఎ1 డాక్టర్ నమ్రత ను కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్

    - మరో మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్ట్

    - ఎ1 డాక్టర్ నమ్రతతో పాటు ఎ5 డాక్టర్ తిరుమలను మహారాణిపేట పీఎస్‌లో విచారణ.

    - ఇప్పటికే డాక్టర్ నమ్రతను రెండు రోజులు విచారించిన పోలీసులు

    - ఎ1 ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈ కేసులో మరో ఇద్దరిని కస్టడీకి కోరిన పోలీసులు

    *63 ప్రసవాల అసలు తల్లిదండ్రులు, చిన్నారులెక్కడున్నారు..?*

    - వేరొకరి చేతులకు వెళ్లాయా అన్న దానిపై కూపీ లాగుతున్న పోలీసులు

    - ఎ4 ఏజెంట్ రామకృష్ణను విచారించనున్న పోలీసులు

  • 8 Aug 2020 9:44 AM GMT

    శ్రీకాకుళంలో లాక్ డౌన్ పొడిగింపు..

    శ్రీకాకుళం జిల్లా:

    - శ్రీకాకుళంలో లాక్ డౌన్ పొడిగింపు..

    - వారం రోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్..

    - కరోనా తీవ్రత దృష్ట్యా పొడిగింపు నిర్ణయం..

    - రేపటి నుంచి ఆగస్టు 15 వరకు శ్రీకాకుళం పరిధిలో కొనసాగనున్న లాక్ డౌన్..

    - ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకే దుకాణాలకు అనుమతి..

    - నిత్యావసర, అత్యవసర దుకాణాలు తప్ప మిగతా దుకాణాలకు అనుమతి లేదు..

  • 8 Aug 2020 8:58 AM GMT

    జిల్లాలో ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన శ్రీకాకుళం పోలీసులు..

    శ్రీకాకుళం జిల్లా:

    - రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానాం కార్యక్రమం..

    - ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్..

    - రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా దానం చేసిన పోలీసులు..

    - ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న పోలీసులు స్వచ్చందంగా ప్లాస్మా దానం..

    - జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 157 మంది పోలీసులు..

    - కరోనా నుంచి కోలుకుని 50 మంది పోలీసులు డిశ్చార్జ్..

Print Article
Next Story
More Stories