Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Oct 2020 2:25 PM IST
TS ELECTION COMMISSIONER: తిరుచానూరు అమ్మవారిని దర్శనంలో తెలంగాణ ఎలక్షన్ కమిషనర్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి
- స్వాగతం పలికిన డిప్యూటీ ఈఓ ఝాన్సీ రాణి
- అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మోకులు చెల్లించున్న ఎలక్షన్ కమిషనర్
- 7 Oct 2020 2:21 PM IST
DHARANI: ధరణిలో ఆస్తుల నమోదు పై సమీక్ష
వరంగల్ అర్బన్ జిల్లా:
ధరణి ఆప్ లో ఆస్తుల నమోదు ప్రక్రియ పురోగతి పై బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ పమేలా సత్పతి తో సమీక్షిస్తున్న అర్బన్ కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు
- 7 Oct 2020 2:16 PM IST
పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఎం సీపీఐ కలిసి పోటీ: చాడ వెంకట రెడ్డి
చాడ వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి @ మగ్ధుమ్ భవన్..
- కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రయివేటికరణ ,వ్యవసాయ చట్టాలపై పై సీపీఐ తీవ్రంగా ఖండిస్తుంది..
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ని అంశాలు ఇంకా పూర్తి కాలేదు కేంద్రం ఈ విషయంలో వివక్ష చూపిస్తుంది..
- అక్టోబర్ 12 - 18 వరకు జలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం..
- కృష్ణ, గోదావరి నదుల విషయం లో అపెక్స్ కౌన్సిల్ 2016 నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఎందుకు సమావేశం కాలేదు..
- పట్టబద్రుల ఎన్నికల్లో సీపీఎం సీపీఐ కలిసి పోటీ చేస్తుంది...
- అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది..
- రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం...
- దుబ్బాక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని నిర్ణయించాం..
- దుబ్బాక ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు...
- ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు..
- 7 Oct 2020 11:53 AM IST
Hyderabad updates: శివ గణేష్ ను ఎర్రమంజిల్ తీసుకువెళ్ళిన కొండారెడ్డి ,అనుచరులు..
సినిమా డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్ ను నిన్న ఉదయం మాట్లాడదామని శ్రీనగర్ కాలనీ నుండి ఎర్రమంజిల్ తీసుకువెళ్ళిన కొండారెడ్డి ,అనుచరులు..
-దాదాపు గంటకు పైగా సాగిన ల్యాండ్ వివాదం సెటిల్ మెంట్....
-శివ గణేష్ తో ప్రొద్దుటూరు లో వున్న ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి రెండున్నర ఎకరాల పత్రాలపై సంతకం చేయించుకుని అనుచరులతో ఎస్ కెప్ అయిన కొండారెడ్డి..
-ఎట్టకేలకు బయటకు వచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన బాధిత ఫిలిం డిస్టిబ్యూటర్ శివ గణేష్..
-శివ గణేష్ ని తుపాకులతో బెదిరించిన కొండ రెడ్డి అతని అనుచరులు..
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- 7 Oct 2020 11:45 AM IST
Hyderabad updates: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధిత ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్..
హైద్రాబాద్..
-శివ గణేష్ ను నుండి మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు..
-మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం..
-బంజారాహిల్స్ సీ ఐ ను నేరుగా కలిసేందుకు వచ్చిన బాధిత ఫిలిం డిస్టిబ్యూటర్ శివ గణేష్...
- 7 Oct 2020 11:12 AM IST
Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న నీటి ప్రవాహం..
నిజామాబాద్..
-ఇన్ ఫ్లో 24938 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 24938 క్యూసెక్కులు
-4 వరద గేట్లు ఎత్తిన అధికారులు
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.
-నీటి సామర్థ్యం 90 టీఎంసీల
-జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 273 టీఎంసీలు.
-155 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు
- 7 Oct 2020 11:06 AM IST
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి..
తిరుమల..
-త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు
-నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు ఉంటాయి
-ఇంకా ఎన్నికల తేదీ ఖరారు చేయలేదు
-త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం
-పార్థసారథి, తెలంగాణ ఎన్నికల కమిషనర్
- 7 Oct 2020 10:51 AM IST
Nizamabad updates:స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఉప ఎన్నికలకు కరోనా సెగ...
నిజామాబాద్ :
-కరోనా టెస్టులు చేయించుకున్న 824 మంది ఓటర్లు.
-24 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పాజిటివ్ నిర్ధారణ.
-పోస్టల్ బ్యాలెట్, లేదా చివరి గంట లో ఓటు వేసేందుకు అవకాశం పరిశీలిస్తున్న అధికారులు.
-50 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 4 పి.పి.ఈ. కిట్లు ఉంచాలని నిర్ణయం.
- 7 Oct 2020 10:49 AM IST
Hyderabad updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం కలిసి పోటీ...
హైదరాబాద్..
-రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడిగా పోటీ చేయానున్న కమ్మునిస్ట్ పార్టీలు...
-రెండు నియోజకవర్గాల్లో చెరో స్థానం నుంచి పోటీ చేయనున్న సిపిఐ సిపిఎం...
-హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ సిపిఎం అభ్యర్థిగా నాగేశ్వర్ రావు , వరంగల్ - ఖమ్మం - నల్గొండ సీపీఐ అభ్యర్థిగా విజయ సారథి పేరు దాదాపు ఖరారు...
-స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పటికే బరిలో ఉన్నప్పటికీ సీపీఎం బేషరతుగా మద్దతు అంగీకరించిన సిపిఐ...
-అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించనున్న సిపిఐ సిపిఎం...
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు కోసం కోదండరామ్ ప్రయత్నాలు విఫలం...
- 7 Oct 2020 9:00 AM IST
Adilabad district updates: ఉమ్మడి ఆదిలాబాద్ లో కోనసాగుతున్న పోలీసుల కూంబింగ్...
ఆదిలాబాద్...
-ఉట్నూరు, కడెం మండలాల్లోని అడవులలో మావోల కోసం జల్లేడ పడుతున్న పోలీసులు
-కదంబ ఎన్ కౌంటర్ లో తప్పించుకున్న మావోయిస్టు నాయకుడు బాస్కర్,వర్గీస్, రాము, అనిత ల కోసం కోనసాగుతున్నా మావోల వేట..
-అందోళన చెందుతున్న. అదివాసీలు












