Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 7 Aug 2020 11:08 AM GMT

    కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

    జాతీయం:

    - అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌లతో వివాదంలో చిక్కుకున్న కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.

    - తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయించాల్సిందిగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం.

    - విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ​కీలక వ్యాఖ్యలు

    - “అసలు మీరెందుకు ఇదంతా చేశారు? మీరు ఆక్టివిస్టే కావొచ్చు. అయినంత మాత్రాన ఇలా ఎందుకు ప్రవర్తించారు? సమాజంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతుంది. మీరు అసభ్యతను వ్యాపింపజేస్తున్నారు. అసలు ఇలాంటి చర్యలు ఎదుగుతున్న పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా’’అని అసహనం వ్యక్తం

    - రెహానా ఫాతిమా తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ మాట్లాడుతూ.. తన క్లైంట్‌పై చైల్డ్‌ పోర్నోగ్రఫీ కింద ఆరోపణలు చేయడం సరైంది కాదు

    - పురుషులు అర్ధనగ్నంగా కనిపిస్తే లేని అభ్యంతరం మహిళల విషయంలో ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్య.

    - కేరళలోని పలు ఆలయాల్లో కొన్ని దేవతా మూర్తులు కూడా అర్ధనగ్నంగా కనిపిస్తాయని.. అయినప్పటికీ ఆలయానికి వెళ్లిన వారిలో లైంగిక ప్రేరేపణ బదులు ఆ విగ్రహాల్లో దైవత్వమే కనిపిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్న రెహానా

  • 7 Aug 2020 11:07 AM GMT

    టీఎస్ హైకోర్టు:

    - జీహెచ్ఎంసీలో పని చేస్తున్న 98 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఆదేశం

    - అప్పటి వరకు సమాన పనికి సమాన జీతం చెల్లించాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం..

    - హైకోర్టు తీర్పు పై ఆనందం వ్యక్తం చేసిన అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్.

  • 7 Aug 2020 11:05 AM GMT

    రాజయ్య కరోనా మృతి పై కుమారుడు సీతారామరాజు సంచలన వ్యాఖ్యలు

    భద్రాచలం: 

    - భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా మృతి పై కుమారుడు సీతారామరాజు సంచలన వ్యాఖ్యలు

    - మా నాన్న కు కరోనా వచ్చిందనే కారణంతో ఊరిజనం దూరంగా ఉండటంతోనే మనస్తాపం తో చనిపోయారు

    - మూడుసార్లు ఎమ్మెల్యే గా సేవలందించిన వ్యక్తి ని కరోనా పేరుతో అంటరాని వ్యక్తి గా చూడటం తట్టుకోలేక పోయారు

    - కరోనా వచ్చిందనే కారణంతో మా కుటుంబం గ్రామంలో వివక్షకు గురవడంతో సున్నం రాజయ్య తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు

    - ఆదివాసీ ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మా తండ్రి రాజయ్య కు ప్రజలు, కార్యకర్తలు దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు

    - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సున్నం రాజయ్య కొడుకు వాయిస్ రికార్డ్

  • 7 Aug 2020 9:58 AM GMT

    పాతబస్తీలో రాత్రి సమయాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ అరెస్ట్

    - నిందితుడు మహమ్మద్ నసిర్ అరెస్ట్ చేసిన చార్మినార్ పోలీసులు

    - నాసిర్ వద్ద నుండి ఒక లాప్ టాప్ 31 లక్షల నగదును స్వాధీనం..

    - చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,

    - ఫలక్నామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో అరెస్టు చేసి రిమాండ్ తరలించిన పోలీసులు..

  • 7 Aug 2020 9:58 AM GMT

    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అర్బన్ పార్కు

    - మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అర్బన్ పార్కు, నర్సరీల ఏర్పాటు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నగేష్

  • 7 Aug 2020 9:57 AM GMT

    సంగారెడ్డి జిల్లా:

    - రామచంద్రపురం BHEL పరిశ్రమ గేట్ ముందు కార్మికులకు ఉచిత హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన BHEL మాజ్దూర్ సంఘ్ (BMS) సభ్యులు.

  • 7 Aug 2020 9:56 AM GMT

    కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి..

    నిజామాబాద్ :

    - కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి.

    - ముగ్గురు టి.ఆర్.ఎస్. ఇద్దరు ఎం.ఐ ఎం. అభ్యర్థులు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక.

    - దారం సాయిలు, చంద్ర కళ, అంత రెడ్డి లత, ముజీబ్, ఇర్ఫానా బేగం కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక.

  • 7 Aug 2020 9:52 AM GMT

    మహబూబ్ నగర్:

    - యూపిఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 272 వ ర్యాంకుతో ఐఏఎస్ కు ఎంపికైన రాహుల్ ను ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు

  • 7 Aug 2020 9:51 AM GMT

    మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్...

    మహబూబ్ నగర్:

    - మహబూబ్ నగర్ లోని 100 పడకల కరోనా ఆస్పత్రిని రెండు రోజుల్లో 220 పడకలు పెంచబోతున్నాం.. ఈ బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ లు ఏర్పాటు చేస్తున్నాం.

    - మహబూబ్ నగర్ ఆస్పత్రిలో ఒక్క వెంటిలేటర్ లోకుెడే.. నేడు 67 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.

    - ప్రపంచానికి అవసరమైన మూడో వంతు మెడిసిన్స్ ను హైద్రాబాద్ నుంచి ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    - కరోనా బాదితులు హైద్రాబాద్ వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకండి.

    - అన్ని వసతులతో కూడిన కరోనా ఆస్పత్రులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం.

    - ఎవ్వరూ బయపడాల్సిన అవసరం లేదు... ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుంది.

    - గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర లో కరోనా పరిస్థితి చూడండి.. తెలంగాణాలో చూడండి..

    - రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంటు ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయబోతున్నాం.

    - సోషల్ మీడియా ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కొత్త చట్టం ద్వారా చర్యలు తీసుకుంటాం.

    - మంత్రి శ్రీనివాస్ గౌడ్..

  • నేత కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డులను ప్రధానం
    7 Aug 2020 8:46 AM GMT

    నేత కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డులను ప్రధానం

    జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉత్తమ కళా నైపుణ్యం కనబరిచిన నేత కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డులను ప్రధానం చేస్తున్న జిల్లా కలెక్టర్ శృతి ఓఝా.

Print Article
Next Story
More Stories