Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం 7సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Aug 2020 9:54 AM IST
సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని కి ఈడి నోటీసులు..
- తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన ముంబై ఈడి.
- సుశాంత్ మరణం తర్వాత పోలీసులు అనుమతి తో హైదరాబాద్ చేరుకున్న సిద్ధార్థ..
- సుశాంత తో కలిసి కొన్నాళ్ళపాటు అదే ఇంట్లో ఉన్న సిద్ధార్థ పితాని..
- సుశాంత్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్న ట్లుగా గా తెలిపిన ఈ డి..
- సుశాంత్ కు క్రియేట్ మేనేజర్గా పని చేసిన సిద్ధార్థ.
- సుశాంత్ ప్రియురాలు రియా కు 15 కోట్లు వ్యవహారంపై ఆరా..
- రియా కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలంటూ ఇప్పటికే సిద్ధార్థ కు ఫోన్ కాల్స్.
- తనకు వచ్చిన ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధార్థ...
- 7 Aug 2020 9:49 AM IST
ఏపీలో 13 మంది యువ ఐఎఎస్ లకు పోస్టింగులు..
అమరావతి:
1. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎం ఎస్ మురళి
2. పృధ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప)
3. ప్రతిష్ఠ మాంగైన్ – సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ)
4. హిమాన్షూ కౌశిక్ – సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి)
5. అమిలినేని భార్గవ్ తేజ – సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం)
6. విధే ఖారే – సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం) ( పార్వతీపురం ఐటిడిఎ పిఓగా అదనపు బాధ్యతలు)
7. నారపురెడ్డి మౌర్య – సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం)
8. శ్రీవాస్ అజయ్ కుమార్ – సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు)
9. అనుపమ అంజలి – సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి)
10. సూరజ్ ధనుంజయ్ – సబ్ కలెక్టర్ టెక్కలి (శ్రీకాకుళం)
11. మేదిడ జాహ్నవి – సబ్ కలెక్టర్ మదనపల్లి (చిత్తూరు)
12. కల్పన కుమారి – సబ్ కలెక్టర్ నంద్యాల (కర్నూల్)
13. కేతన గార్గ్ – సబ్ కలెక్టర్ రాజంపేట (కడప)
- 7 Aug 2020 9:48 AM IST
అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
తూర్పుగోదావరి:
- కరోనా లక్షణాల అనుమానంతో టెస్ట్ చేయించుకోవడంతో వెలుగుచూసిన పాజిటీవ్
- ప్రస్తుతం హైదరాబాద్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొఁదుతున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
- తాను కరోనా బాధితుల పరామర్శకైఎక్కువగా పర్యటించడంతో వైరస్ సోకిందని భావిస్తున్నాను
- ఆరోగ్యం బాగానే వుందని త్వరలోనే వచ్చి అందర్నీ కలుస్తానని పేర్కొన్న ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి
- 7 Aug 2020 9:47 AM IST
- ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారికి భార్య వియోగం
- గుండె పోటు తో చనిపోయిన పరుచూరి విజయలక్ష్మి (74)
- 7 Aug 2020 9:47 AM IST
తూర్పుగోదావరి:
- రాజమహేంద్రవరం సబ్ కలెక్టరు గా అనుపమ అంజలి, అమలాపురం సబ్ కలెక్టరు గా హిమాంశుకౌశిక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
- 7 Aug 2020 9:46 AM IST
తుంగభద్ర కి భారీగా వరద ప్రవాహం..
అనంతపురం:
- ఇన్ ఫ్లో: 81,218 క్యూసెక్కులు.
- ఔట్ ఫ్లో: 8,225 క్యూసెక్కులు.
- ప్రస్తుతం నీటి నిల్వ: 46.556 టీఎంసీలు.
- పూర్తి సామర్థ్యం: 100.85 టీఎంసీలు.
- డ్యాం లో నీటి లెవెల్ : 1615.35 అడుగులు.
- డ్యాం పూర్తి నీటి మట్టం: 1633 అడుగులు.
- 7 Aug 2020 9:46 AM IST
తాడేపల్లిగూడెం క్వారంటైన్ లో కరోన బాధితుల ఆందోళన...
ప.గో:
- చాలీచాలని,నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రోడెక్కిన బాధితులు
- ,వైద్యసేవలు అందించడం లేదంటు ఆగ్రహం
- ప్రశ్నించిన వారిని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని...
- క్వారంటైన్ సిబ్బందిపై తీసుకోవాలని బాధితులు డిమాండ్..
- 7 Aug 2020 9:42 AM IST
గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ లో స్వల్పంగా పెరిగిన వరద ఇన్ ఫ్లో
తూర్పుగోదావరి:
- 88వేల 500 క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
- ధవలేశ్వరం వద్ద 10.15 అడుగుల గోదావరి నీటమట్టం
- భారీవర్షాలతో పంటకాల్వలకు తగ్గించిన సాగునీరు విడుదల
- 7 Aug 2020 9:40 AM IST
రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలా కరోనా విజృంభన
తూర్పుగోదావరి:
- రాజమండ్రి సెంట్రల్ జైలు కరోనా ఆఫ్టేడ్స్
- రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలా కరోనా విజృంభన
- కరోనా పంజరంలో రాజమండ్రి జైలు ఖైదీలు
- 983 ఖైదీలకు నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలలో 265 మందికి పాజిటీవ్ నిర్ధారణ
- ఇప్పటికే మరో 25 మంది సిబ్బందికి కరోనా తో చికిత్స
- గత కొద్దిరోజుల్లో పాజిటీవ్ వచ్చిన ఖైదీలకు రాజమండ్రి ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స
- జైలులో వైద్యబృందాలు పర్యటన
- మరో రెండు రోజులలో మరో 600 మందికి పైగా ఖైదీల కరోనా టెస్ట్ ల ఫలితాలు
- జైలులో అపారంగా పెరిగిపోతున్న పాజిటీవ్ కేసులకు చికిత్స ఎక్కడ అందించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్న జైలు అధికారులు
- సెంట్రల్ జైలులోనే కొవిడ్ కేర్ సెంటర్ కమ్ క్వారంటైన్ ఏర్పాటుకు జైలు, వైద్యాధికారులు సమాలోచనలు
- జైలులొలో సీరియస్ కొవిడ్ లక్షణాలు గల కేసులు అంతగా కన్పించడం లేదంటున్న వైద్యులు
- రాజమండ్రి సెంట్రల్ జైలులో మొత్తం 1666 ఖైదీలు, 205 మంది వరకూ సిబ్బంది..
- నిన్నకరోనాతో విజయవాడ కు చెందిన ఓ ఖైదీ మృతితో ఆందోళన చెందుతున్న సెంట్రల్ జైలు ఖైదీలు..



