Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 06 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చవితి (సా.4-11వరకు) తదుపరి పంచమి | అశ్విని నక్షత్రం (తె.3-44 వరకు) తదుపరి భరణి | అమృత ఘడియలు: రా.7-45 నుంచి 9-31 వరకు | వర్జ్యం: రా.11-18 నుంచి 1-04 వరకు | దుర్ముహూర్తం: సా.4-29 నుంచి 5-18 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు |సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-08
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Sept 2020 10:02 AM IST
Warangal Urban updates: నేడు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు..
వరంగల్ అర్బన్..
-వాహనాల తనికులు చేపట్టిన పోలీసులు.
-అనుమానిత వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.
-నిన్న రాత్రి నుండి కొనసాగుతున్న చెక్ పోస్ట్ తనిఖీలు.
- 6 Sept 2020 9:59 AM IST
Mulugu district updates: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..
ములుగు జిల్లా..
-స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు
-వెంకటాపురం, వాజేడు, మండలాలకు బస్సులు నిలిపివేసిన అధికారులు
-మావోయిస్టు శంకర్ మృతిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ బంద్‌కు పిలుపు
- 6 Sept 2020 9:56 AM IST
Jayashankar Bhupalpally updates:సరస్వతి బ్యారేజ్ -2 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,600 క్యూసెక్కులు.
- 6 Sept 2020 9:50 AM IST
Jayashankar Bhupalpally updates: శంకర్ బూటకపు ఎంకౌంటర్ కు నిరసనగా నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
-ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు.
-ఏజెన్సీలో ప్రత్యేక కుంబింగ్ చేపట్టిన స్పెషల్ పార్టీ పోలీసులు.
-ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు హెచ్చరికతతో హై అలెర్ట్ లో పోలీసులు.
- 6 Sept 2020 9:46 AM IST
Mulugu updates: నేడు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు..
ములుగు జిల్లా..
-నేడు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు.
-గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఏటూరునాగారం ఏజెన్సీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.
-గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు రంగంలోకి..



