Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Hyderabad Updates: మరో వివాదంలో ఎస్సార్ నగర్ పోలీసులు..
    6 Nov 2020 1:14 PM GMT

    Hyderabad Updates: మరో వివాదంలో ఎస్సార్ నగర్ పోలీసులు..

      హైదరాబాద్..    

    -ఎర్రగడ్డ వికాస్ పురి కాలనీలో ఇంటి వివాదం కోర్టులో ఉండగా 25 మందితో వచ్చి బలవంతంగా తమ ఇంట్లో కి దూరి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తమను ఇంట్లో      నుంచి వెళ్ళగొట్టారని బాధితులు ఇంటి ముందు నిరసన

    -ముందస్తు ఒప్పందం ప్రకారమే ఎస్సార్ నగర్ పోలీసులు సమయానికి చేరుకోకుండా వారి తమ ఇంటి పొజిషన్ ఇప్పించారని బాధితులు ఆరోపణ.

    -హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బాదితులు

  • Hyderabad Updates: టీఎస్ లా సెట్ పీజీ ఎల్ సెట్ 2020 ఫలితాల విడుదల..
    6 Nov 2020 1:11 PM GMT

    Hyderabad Updates: టీఎస్ లా సెట్ పీజీ ఎల్ సెట్ 2020 ఫలితాల విడుదల..

      హైదరాబాద్...    

    - మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి హాల్లో టీఎస్ లా సెట్ పీజీ ఎల్ సెట్ 2020 ఫలితాలు విడుదల చేసిన ఉన్నతవిద్యా మండలి చైర్మన్-     పాపిరెడ్డి లా సెట్ కన్వీనర్ జేబీ రెడ్డి

    -మొత్తం 30 262 మంది దరఖాస్తు

    -21559 మంది హాజరు

    -16572 మంది ఉత్తీర్ణత..

    -76.87 శాతం ఉత్తీర్ణత..

    -3ఇయర్స్ లా కోర్సు లో 15398 మంది హాజరు కాగా 12103 మంది ఉత్తీర్ణత

    -5ఏళ్ల లా కోర్సులో 3973 మంది హాజరు కాగా 2477 మంది ఉత్తీర్ణత..

    -పీజీ ఎల్ సెట్ లో 2188 హాజరు కాగా 1992 మంది ఉత్తీర్ణత..

  • 6 Nov 2020 1:04 PM GMT

    Peddapalli Updates: సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ నాయకుల అరెస్టు...

    పెద్దపల్లిజిల్లా : సుల్తానాబాద్

    - బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్ మృతికి టిఆర్ఎస్        పార్టీ కారణమంటూ ఆందోళనకు దిగిన బిజెపి నాయకులు..

    - అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు...

  • Hyderabad Updates: హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతోన్న నేరాలను అదపుచేయాలని బీజేపీ కోరుతోంది..
    6 Nov 2020 12:57 PM GMT

    Hyderabad Updates: హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతోన్న నేరాలను అదపుచేయాలని బీజేపీ కోరుతోంది..

    బీజేపీ మీడియా ప్రకటన,

    కె.కృష్ణసాగర రావు,

    బీజేపీముఖ్య అధికార ప్రతినిధి,

    * హైదరాబాద్ నగరంలో డ్రగ్ అమ్మకందార్లను, పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే వారిని, లైంగిక అఘాయిత్యాలకు పాల్పడే వారిని, క్రమంగా పెరుగుతోన్న        ఈ తరహా నేరాలను అదపుచేయాలని బీజేపీ రాష్ట్ర డీజీపీని, ముగ్గురు కమిషనర్లనూ కోరుతోంది.

    * వీరిలో చాలా మంది విదేశాలకు చెందినవారు, అక్రమంగా వచ్చినవారు. సోషల్ మీడియా వేదికగా యువతనూ, స్కూల్ కు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిలను    లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు.

    * హైదరాబాద్ కి చెందిన పిల్లలు, టీనేజీ వారిని కాపాడటానికి, అలాంటి నేరస్తులపై నగర పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

    * హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ యువతరాన్ని కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్,           డీజీపీలను కోరుతున్నాను.

  • 6 Nov 2020 12:25 PM GMT

    Srinivas Death Updates: శ్రీనివాస్ మృతికి సంతాపంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు..

    నారాయణపేట జిల్లా :

    -బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ మృతికి సంతాపంగా నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ       దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు.

    నాగర్ కర్నూల్ జిల్లా :

    -బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కరూల్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన   బీజేపీ నాయకులు.

  • Hyderabad Updates: బోర్డు తిప్పేసిన ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ..
    6 Nov 2020 12:21 PM GMT

    Hyderabad Updates: బోర్డు తిప్పేసిన ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ..

    హైదరాబాదు..

    -హైదరాబాదులో బోర్డు తిప్పేసిన DQ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్)

    -కంపెనీ దివాలా తీసిందని ట్రిబ్యునల్ petition దాఖలు చేసిన డిక్యు ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్)

    -రోడ్డున పడ్డ 1400 మంది ఉద్యోగులు..

    -గత ఎనిమిది నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించని సంస్థ..

    -తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన ఉద్యోగులు..

    -సంస్థపై సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన ఉద్యోగులు..

    -ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని డిమాండ్.

    -రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు

    -ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14లక్షలు రావాలని తెలిపిన ఉద్యోగులు

    -ఎండి పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసిన ఉద్యోగులు..

    -తమ వేతనాలు అడిగితే వేధింపులకు , బెదిరింపులకు పాలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగులు..

  • 6 Nov 2020 12:08 PM GMT

    Warangal Urban Updates: భీమదేవరపల్లి మండలం లో బీజేపీ కార్యకర్తల ధర్నా..

      వరంగల్ అర్బన్ జిల్లా:

    - భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో బీజేపీ కార్యకర్తల ధర్నా..

    - బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య కు నిరసనగా ఆందోళన .

    - సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల యువత ధైర్యం కోల్పోతుందని ఆరోపిస్తూ ధర్నా.

  • Karimnagar District Updates: హుజురాబాద్ నియోజకవర్గం లో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటన...
    6 Nov 2020 12:05 PM GMT

    Karimnagar District Updates: హుజురాబాద్ నియోజకవర్గం లో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటన...

    కరీంనగర్ :

    // ఇటీవల నియోజకవర్గం లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న మంత్రి

    // నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

  • 6 Nov 2020 11:58 AM GMT

    Yadadri Updates: ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి గోడకు ఢీ..తప్పిన ప్రమాదం..

     యాదాద్రి:

    * యాదాద్రి ఆలయ అభివృద్ధి లో పనులలో భాగంగా...

    * దేవస్థాన మొదటి ఘాట్ రోడ్డు మలుపులో ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి గోడకు ఢీ...

    * తప్పిన ప్రమాదం..

  • Hyderabad Updates: గంగుల శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బండి సంజయ్...
    6 Nov 2020 5:14 AM GMT

    Hyderabad Updates: గంగుల శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బండి సంజయ్...

    హైదరాబాద్..

    -బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి యాచారం మండలం తమ్మలోని గూడెం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

    -నిన్న యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయిన బీజేపీ కార్యాకర్త గంగుల శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బండి సంజయ్...

    -బండి సంజయ్ వెంట భారీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలు...

    -నవంబర్ 1న బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్..

    -58శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోదాలో చికిత్స..

    -మూడు రోజుల పాటు వెంటిలేటర్ పైన చికిత్స తీసుకున్న శ్రీనివాస్ నిన్న రాత్రి మృతి..

    -నిన్న రాత్రి పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించిన తరువాత నేరుగా అక్కడి నుండి యాచారం తరలించిన పోలీసులు...

    -బీజేపీ రాష్ట్ర కార్యాలయం తో పాటు, శ్రీనివాస్ స్వగ్రామం తమ్మలోని గూడెం లో భారీగా మోహరించిన పోలీసులు...

Print Article
Next Story
More Stories