Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Nov 2020 3:00 PM GMT
Warangal Urban Updates: హన్మకొండ లో ఐ పి ఎల్ క్రికెట్ బెట్టింగ్ టీమ్ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్...
వరంగల్ అర్బన్...
- హన్మకొండ లోని సుబేదారి లో ఐ పి ఎల్ క్రికెట్ బెట్టింగ్ టీమ్ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.
- 15 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
- 6 Nov 2020 2:58 PM GMT
Suryapet Updates: నేరేడు చర్లలో గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతుల ఆందోళన...
సూర్యాపేట జిల్లా....
- సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతుల ఆందోళన.
- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై ధాన్యం ట్రాక్టర్లు అడ్డుపెట్టి రైతుల నిరసన..
- నల్గొండ కోదాడ రహదారి పై భారీగా నిలిచిపోయిన వాహనాలు.
- సిఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం...
- 6 Nov 2020 2:50 PM GMT
Mahabubnar Updates: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు యధావిధి గానే కొనసాగుతాయి..
మహబూబ్ నగర్ జిల్లా :
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
- చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు యధావిధి గానే కొనసాగుతాయి..
- కరోనా నేపథ్యంలో ప్రజలు తక్కువ సంఖ్యలో పాల్గొనాలి.
- జాతరలో ఎలాంటి షాప్స్ గూడరాలు అనుమతి అనుమతి లేదు..
- 6 Nov 2020 2:48 PM GMT
Nalgonda District Updates: దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్ కు కరోనా పాజిటివ్...
నల్గొండ
- ఎలాంటి లక్షణాలు లేవిని ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపిన ఎమ్మెల్యే ..
- తనతో పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న వారు కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని కోరిన ఎమ్మెల్యే రవీంద్ర నాయక్..
- 6 Nov 2020 2:45 PM GMT
Telangana Updates: రేపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ...
- త్వరలో బీజేపీ లో చేరబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ మేయర్ , మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.
- ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు. నేను టీఆరెస్ పార్టీలోనే ఉంటున్న అంటున్న తీగల.
- 6 Nov 2020 2:42 PM GMT
Pragathi Bhavan Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష....
- రేపు సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష.
- సమావేశానికి హాజరుకానున్న వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో .
- నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.
- 6 Nov 2020 2:39 PM GMT
Pragathi Bhavan Updtaes: కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష..
-రేపు మధ్యాహ్నం కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష.
-2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .
-కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.
-ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.
-సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.
- 6 Nov 2020 2:36 PM GMT
Telangana High Court Updates: పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీ కి హైకోర్టు అదేశం...
టీఎస్ హైకోర్టు....
- డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ..
- గతంలో ఫామ్ 18, అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా అప్లికేషన్ చేసుకునేల చేస్తామన్న ఈసీ..
- గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని హైకోర్టుకు తెలిపిన ఈసీ..
- అవసరమైతే డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని కోర్టుకు తెలిపిన ఈసీ..
- ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపిన ఈసీ..
- ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణ ముగించిన హైకోర్టు
- పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలన్న హైకోర్టు ఆదేశాల ను అమలు చేస్తామన్న ఈసీ.
- డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఓటు హక్కు నమోదు కల్పిస్తామన్న ఈసీ.
- 6 Nov 2020 1:44 PM GMT
Bhupalpally Updates: జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో వివాదం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
* జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య.
* తల్లి సంగరి లాస్య(25) రెండున్నరేళ్ల పాప మహితి తో సహా ఉరివేసి ఆత్మహత్య.
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- 6 Nov 2020 1:40 PM GMT
Sangareddy Updates: జాతీయ రహదారి పై పఠాన్ చెరు వైపు వెళ్తూ అదుపుతప్పి కారు భీభత్సం..
సంగారెడ్డి జిల్లా...
-పఠాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పై పఠాన్ చెరు వైపు వెళ్తూ అదుపుతప్పి కారు భీభత్సం..
-రహదారి పక్కన కూరగాయల షాప్ పై దూసుకెళ్లి విద్యుత్ స్తంబానికి ఢీ కొని కారు బోల్తా...
-షాప్ వైపు వెళ్తున్న మహిళను కారు ఢీ కొనడం తో విప్పల గడ్డ తాండకు చెందిన దేవి అనే మహిళకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం ,ఆసుపత్రి కి తరలింపు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire