Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 6 Aug 2020 5:01 AM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 6 Aug 2020 9:52 AM IST

    రామలింగారెడ్డి గారి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: ఎంపీ. రేవంత్ రెడ్డి

    - ఎంపీ - మల్కాజ్ గిరి

    - శాసన సభ్యుడు, సహచర తెలంగాణ ఉద్యమకారుడు రామలింగారెడ్డి గారి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    - ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను.

  • 6 Aug 2020 9:51 AM IST

    జాతీయం:

    గుజరాత్ అహ్మదాబాద్ లోని నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో భారీగా చెలరేగిన మంటలలో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధాని దిగ్భ్రాంతి.

    చనిపోయిన వారి బంధువులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారకి 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడి

  • 6 Aug 2020 9:50 AM IST

    హైదరాబాద్: 

    తెలంగాణ సిద్ధాంతకర్త ప్రో. కొత్తపల్లి జయశంకర్ గారి 86 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్లు .

  • 6 Aug 2020 9:48 AM IST

    సోలిపేట రామలింగారెడ్డి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం: కేటిఆర్

    - తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది.

    - వారి మృతి తెలంగాణకు తీరని లోటు.

    - వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

    - తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

      

  • 6 Aug 2020 9:45 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్న అట్ల రమణారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వువులు జారీ వరంగల్ అదనపు డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్న వుప్పు తిరుపతికి భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ

  • 6 Aug 2020 9:03 AM IST

    రామలింగారెడ్డి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

    - పత్రికారంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, తెలంగాణ ఉద్యమకారుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణవార్త నాకు తీవ్రదిగ్బ్రాంతి కలిగించింది.

    - TRS పార్టీ కి వారు చేసిన సేవలు మరువలేనివి

    - వారి మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు,TRS పార్టీ కి తీరనిలోటు

    - ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,TRS పార్టీ దుబ్బాక ప్రజలకు,రామలింగారెడ్డి గారి కుటుంబానికి అండగా వుంటుంది

    - రామలింగారెడ్డి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

    - వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను

  • 6 Aug 2020 9:00 AM IST

    తెలంగాణలో కొత్తగా 2,092 పాజిటివ్ కేసులు..

    - తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

    - నిన్న(బుధవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,092 పాజిటివ్‌ కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

    - 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

    - దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కి చేరింది. మృతుల సంఖ్య 589కి పెరిగింది.

    - సోమవారం ఒక్క రోజే 1,289 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

    - దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 52,103కి చేరింది.

  • 6 Aug 2020 7:21 AM IST

    సిదిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కన్నుమూత..

    - హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

    - కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సోలిపేట రామలింగా రెడ్డి.

    - నలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన సోలిపేట రామలింగా రెడ్డి.

    - 2004లో టీఆర్ఎస్ తరపున తొలిసారి ఎమ్మెల్యే గా గెలుపు.

    - 2008 ఉప ఎన్నికలు, 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపు.

K V D Varma

K V D Varma

Next Story