Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Aug 2020 1:39 PM IST
జాతీయం:
జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలో బిజెపి పార్టీ కి చెందిన సర్పంచ్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
- 6 Aug 2020 1:35 PM IST
రాజధాని రైతులు తరపున దాఖలైన 32 పిటిషన్లు
అమరావతి :
- పరిపాలన వికేంద్రీకరణ, జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ నివేదికలను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు
- తదుపరి విచారణ ఈ నెల 14కి వాయిదా వేసిన న్యాయస్థానం
- రాజధాని రైతులు తరపున దాఖలైన 32 పిటిషన్లు
- ఈ నెల 14 వరకు రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసిన హైకోర్టు
- 6 Aug 2020 1:35 PM IST
కడప రైల్వే స్టేషన్ ఎదుట ఎఐటియూసి అద్వర్యంలొ అందొళన...
కడప :
- రైల్వే ప్రవేటికరణ మానుకొవడంతొ పాటు, కడప రైల్వే గూడ్స్ స్టేషన్ ను కృష్ణాపురంకు తరలించవద్దని, కోవిడ్ 19 సమయంలో హమాలీ కార్మికులకు అదుకోవలంటూ డిమాండ్..
- 6 Aug 2020 10:12 AM IST
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో జిల్లాలో దాడులు...
కర్నూల్ జిల్లా:
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో జిల్లాలో దాడులు....
- అక్రమ మద్యం మరియు నాటు సారా పై 33 కేసులు నమోదు ,45 మంది అరెస్టు ,18 వావాహనాలు సీజ్ .
- 248 లీటర్ల నాటు సారా , 600 కేజిల బెల్లం స్వాధీనం.
- 2,700 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం .
- వివిధ బ్రాండ్లకు చెందిన 1951 బాటిల్స్ ( 415 లీటర్లు) మద్యం స్వాధీనం.
- ఇసుక అక్రమ రవాణా పై 2 కేసులు నమోదు. ముగ్గురు అరెస్టు, 3 వాహానాలు సీజ్. 12 టన్నుల ఇసుక సీజ్
- 6 Aug 2020 10:04 AM IST
కొత్తపల్లిలో ఎస్ఈబీ అధికారుల సోదాలు..
తూర్పు గోదావరి :
- గోకవరం మం. కొత్తపల్లిలో ఎస్ఈబీ అధికారుల సోదాలు..
- భారీగా సారా, నల్లబెల్లం పట్టివేత..
- అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు కోరుకొండ ఎక్సైజ్ అధికారులు సోదాలు..
- రూ. మూడు లక్షల విలువైన ఏడు టన్నుల నల్లబెల్లం స్వాధీనం..
- మళ్ళ గణేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు..
- 6 Aug 2020 10:04 AM IST
ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి:
- ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- 20 మంది ఎమ్మెల్యేలా.. లేక.. బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా..
- అన్న ప్రశ్నకు,. ఎమ్మెల్యేలు పోతే పోయారుగానీ.. లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నాడు.
- బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది"!
- 6 Aug 2020 10:01 AM IST
తుంగభద్ర కు పెరిగిన వరద ప్రవాహం
అనంతపురం:
- తుంగభద్ర కు పెరిగిన వరద ప్రవాహం
- ఇన్ ఫ్లో: 17,858 క్యూసెక్కులు.
- ఔట్ ఫ్లో: 7808 క్యూసెక్కులు.
- డ్యాం లో నీటి నిల్వ: 40.262 టీఎంసీలు.
- డ్యాం పూర్తి స్థాయి నీటినిల్వ: 100.85 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి మట్టం: 1612.50 అడుగులు.
- పూర్తి స్థాయి సామర్థ్యం: 1633 అడుగులు.
- 6 Aug 2020 10:00 AM IST
మెడికల్ షాపులలో శానిటైజర్ బాటిల్స్ లను తనిఖీలు చేస్తున్న పోలీసులు..
ప్రకాశం జిల్లా:
కుర్చేడు ఘటనతో జిల్లాలోని మెడికల్ షాపులలో శానిటైజర్ బాటిల్స్ లను తనిఖీలు చేస్తున్న పోలీసులు.
ఎస్పీ ఆదేశాల మేరకు సాగుతున్న తనిఖీలు.
- 6 Aug 2020 9:58 AM IST
ప్రకాశం జిల్లా:
పర్చూరు మండలం అడుసుమల్లి లో కరోనా పాజుటివ్ వచ్చిందని మనస్తాపం తో 55 సంవత్సరాలు మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య ...
- 6 Aug 2020 9:56 AM IST
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ ఎదురుదెబ్బ
అంతర్జాతీయం:
- ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ ఎదురుదెబ్బ
- 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ లో భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రస్తావించిన పాకిస్థాన్
- పాకిస్థాన్ వాదనను తోసిపుచ్చిన భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలు. భారతదేశ వాదనకు మద్దతు.
- కాశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమన్న భద్రతామండలి



